చాట్ బోట్స్ ఎలా మారబోతున్నాయ్?

By Madhavi Lagishetty
|

చాట్ బోట్...ఇదొక్క యాప్. ఫేస్ బుక్ మెసెంజర్లో ఈ ఫీచర్ను ప్రవేశపెట్టింది. చాట్ అంటే మాట్లాడటం లేదా సంభాషణ. బోట్ అనే పదం రోబోట్ నుంచి తీసుకున్నారు. సంభాషణ మరియు రోబో ల కలయికే చాట్ బోట్ అని అర్ధం. రోబో ఏం చేస్తుంది. మనం ఇచ్చిన ప్రోగ్రాంకు అనుగుణంగా పనిచేస్తుంది. ఈ చాట్ బోట్ కూడా అంతే. మనం చెప్పినట్లే నడుస్తుంది.

 
చాట్ బోట్స్ ఎలా మారబోతున్నాయ్?

దీన్ని ఆర్టిఫిషయల్ ఇంటలిజెన్స్ తో తయారు చేశారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఈ చాట్ బోట్ జనాలకు ఏమాత్రం దగ్గరకాలేదు. ఎందుకంటే కస్టమర్లు చెప్పినట్లుగా చాట్ బోట్ పనిచేయడం లేదు. AI రీసెర్చ్ టీం చెప్పినట్లుగానే నడుచుకుంటుంది. అంతేకాదు ఈ చాట్ బోట్స్ మల్టీపుల్ లెవల్స్ లో పూర్తిగా విఫలం అవుతున్నాయి. ఇలాంటి లోపాలపై ద్రుష్టి పెట్టింది AI – రీసెర్చ్ టీం.

మనకు కావాల్సిన దానికి గురించి అడిగినప్పుడు, దానికి సంబంధించిన సమాచారాన్ని మనముందు ఉంచాలి. కానీ చాట్ బోట్ అలా చేయదు. నాకు తెలియదు అని సింపుల్ గా రిప్లే ఇస్తుంది. ఇలాంటి లోపాలు చాట్ బోట్లో చాలానే ఉన్నప్పటికీ..వాటి పనిలో అవి బిజీగా ఉంటాయి. అంతేకాదు చాట్ బోట్స్ సంభాషణలు మనకు అస్సలు అర్ధం కావు. ఇలాంటి లోపాలపై AI- రీసెర్చ్ టీం ద్రుష్టిసారించింది. టీం డిజైన్ చేసినట్లుగా కాకుండా...అచ్చం మానవుల మాదిరిగా సంభాషించేలా కొత్త ప్రోగ్రామ్న్ డిజైన్ చేశారు.

వాస్తవానికి చాట్ బోట్స్ కు సంబంధించి ప్రోగ్రామ్ ముందే డిజైన్ చేస్తారు. ఎలాంటి ప్రశ్నలకు ఏవిధమైన సమాధానం ఇవ్వాలనేది ముందుగానే డేటాసెట్లలో డిజైన్ చేస్తారు. దానికి అనుగుణంగానే చాట్ బోట్స్ నడుచుకుంటాయి. అయితే సరైన డేటాను ప్రారంభించడంలో పరిశోధకులు అద్భుతమైన ఫలితాలను సాధించినప్పటికీ...కొన్ని ఇబ్బందులను మాత్రం ఎదుర్కొనాల్సి వస్తోంది.

మీ డబ్బుకి న్యాయం చేసే స్మార్ట్‌ఫోన్ హానర్ 9 లైట్, ఫీచర్లపై ఓ లుక్కేయండి !మీ డబ్బుకి న్యాయం చేసే స్మార్ట్‌ఫోన్ హానర్ 9 లైట్, ఫీచర్లపై ఓ లుక్కేయండి !

సినిమాకు సంబంధించిన స్క్రిప్స్ట్ ను ఉదాహరణగా తీసుకుంటే....స్క్రిప్ట్ లోని కొన్ని డైలాగ్స్ ను ఎలా చెప్పాలో చాట్ బోట్స్ ముందే ట్రైనింగ్ పొందుతాయి. అయితే స్క్రిప్ట్ లో డైలాగ్స్ సరిగ్గా అన్వయించకపోవడంతో...చాట్ బోట్స్ సరిగ్గా సంభాషించడంలేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఫేస్ బుక్ ఇంజనీర్లు చాట్ బోట్స్ కోసం సొంతగా ఒక డేటా సెట్ను డిజైన్ చేశారు.

పర్సనా-చాట్ అని పిలిచే ఈ డేటాసెట్లో దాదాపు 160,000కంటే ఎక్కువగానే డైలాగ్ లైన్స్ ఉన్నాయి. దీన్ని( MTurk) నుంచి సేకరించారు. అమెజాన్ మెకానికల్ టర్క్ అనేది ఒక క్రౌడ్ సోర్సింగ్ ఇంటర్నెట్ మార్కెట్. ఇది కొంతమంది వ్యక్తులు మధ్య బిజినెస్ కో-ఆర్డినేట్ చేసేందుకు ఉపయోగపడే మానవ మెదస్సుకు సంబంధించింది. ప్రస్తుతం కంప్యూటర్లు చేయలేని పనిని ఇది చేసి పెడుతుంది.

ఒక వ్యక్తి నేను ఒక కళాకారిణి. నాకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఈ మధ్యే నేనొక్క పిల్లిని పెంచుకుంటున్నాను. వ్యాయామం కోసం ప్రతిరోజు వాకింగ్ కు వెళ్తుంటాను. ఇలా సంభాషించడానికి చాట్ బోట్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఈ డేటా చాట్ బోట్స్ కు చాలా సులభంగా ఉంటుంది.

 

కానీ వ్యక్తుల మాదిరిగా స్పష్టంగా సంభాషించలేవు. వ్యక్తుల వలే మాట్లాడటంపై ఎక్కువ స్కోర్ చేయనప్పటికీ, సినిమా డైలాగ్స్ కు సంబంధించిన శిక్షణలో చాట్ బోట్ చాలా మెరుగ్గానే ఉందని చెప్పవచ్చు.

ఇక చాట్ బోట్స్ ఇంప్రూవ్ చేసే క్రమంలో సొంతగా మాట్లాడేందుకు ఒక భాషను క్రియేట్ చేస్తున్నట్లు FAIR టీం తెలిపింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు టీం ఇప్పటికీ అధికారికంగా చెప్పలేదు. ఇది విజయవంతం అయితే భవిష్యత్తులో మాత్రం చాట్ బోట్స్ హవా కొనసాగుతుందని చెప్పవచ్చు.

Best Mobiles in India

Read more about:
English summary
Facebook is trying to teach chatbots how to converse like a human. Facebook's engineers have built their own dataset which the chatbots will learn from. Called Persona-chat, this dataset comprises of over 160,000 lines of dialogue, sourced from workers found on Amazon’s Mechanical Turk marketplace.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X