ప్రపంచవ్యాప్తంగా ప్రారంభం కాబోతోన్న Facebook వీడియో స్ట్రీమింగ్ సర్వీస్, యూట్యూబ్‌కు పోటీ తప్పదా..?

సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్, యూట్యూబ్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసుకు పోటీగా తన సొంత వీడియో సర్వీసును మార్కెట్లోకి తీసుకురాబోతోన్న విషయం తెలిసిందే.

By GizBot Bureau
|

సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్, యూట్యూబ్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసుకు పోటీగా తన సొంత వీడియో సర్వీసును మార్కెట్లోకి తీసుకురాబోతోన్న విషయం తెలిసిందే. ఫేస్‌బుక్ వాచ్ (Facebook Watch) పేరుతో అందుబాటులోకి రాబోతోన్న ఈ సర్వీసును యూఎస్ మార్కెట్లో ఇప్పటికే విజయవతంగా పరీక్షించి చూసిన ఫేస్‌బుక్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రోల్‌అవుట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణమాలతో డిజిటల్ టెలివిజన్ కంటెంట్ విభాగంలో మరో ఆసక్తికర పోరు మొదలైందని మార్కెట్లో వర్గాలు చర్చించుకుంటున్నాయి.

వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ విభాగంలో యూట్యూబ్....

వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ విభాగంలో యూట్యూబ్....

వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ విభాగంలో గూగుల్ యూట్యూబ్ ఏకచక్రాధిపత్యాన్ని కొనసాగిస్తున్న విషయం తెలసిందిే. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మందిచే వీక్షించబడుతోన్న ఈ ఇంటర్నెట్ వీడియో ప్లాట్‌ఫామ్ పోటీ అనేదే లేకుండా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో గూగుల్ యూట్యూబ్‌కు ధీటుగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది.

ఫేస్‌బుక్ వాచ్ సర్వీసుకు ....

ఫేస్‌బుక్ వాచ్ సర్వీసుకు ....

ఫేస్‌బుక్ వాచ్ సర్వీసుకు మరిన్ని కొత్త హంగులను అద్దే క్రమంలో వాచ్‌పార్టీ పేరుతో మరో ఫీచర్‌ను కూడా ఫేస్‌బుక్ అనౌన్స్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా ఫేస్‌బుక్ గ్రూప్‌లలోని యూజర్లు వీడియోలను రియల్ టైమ్‌లో వీక్షిస్తూ కామెంట్స్ చేసుకునే వీలుంటుంది. వాచ్ పార్టీ స్టార్ట్ అయిన వెంటనే గ్రూపు సభ్యులందరూ ఆ లైవ్ లేదా రికార్డెడ్ వీడియోను వీక్షిస్తూ పరస్పరం కామెంట్స్ చసుకునే వీలుంటుందని ఫేస్‌బుక్ ప్రొడక్ట్ మేనేజర్ ఎరిన్ కొన్నోల్లీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫీచర్‌ను ఉపయోగించు కోవాలనుకునే యూజర్లు ముందుగా ఫేస్‌బుక్‌లో వీడియో‌ను సెర్చ్ చేసుకుని, ఆ తరువాత వీడియోను వీక్షించేందుకు గ్రూపులోని ఇతర సభ్యులను ఇన్వైట్ చేయవల్సి ఉంటుంది.

వీడియో ప్లే అవుతున్నప్పుడు గ్రూప్ సభ్యులు ....

వీడియో ప్లే అవుతున్నప్పుడు గ్రూప్ సభ్యులు ....

వీడియో ప్లే అవుతున్నప్పుడు గ్రూప్ సభ్యులు చాట్ చేసుకునేందుకు వీలుగా ఓ చాట్ విండో కూడా స్క్రీన్ పై ప్రత్యక్షమవుతుంది . ఈ ఫీచర్‌తో మరో రెండు కొత్త ఫీచర్లను కూడా ఫేస్‌బుక్ అనౌన్స్ చేసింది. వాటిలో కో-హోస్టింగ్ ఫీచర్ ఒకటి కాగా మరొకటి క్రౌడ్‌సోర్సింగ్ ఫీచర్. కో-హోస్టింగ్ ఫీచర్ ద్వారా వీడియోను వీక్షిస్తున్నప్పుడు గ్రూపులోని ఇతర సభ్యులు కూడా కో-హోస్ట్‌గా మారి మరిన్ని వీడియోలను యాడ్ చేస్తూ పార్టీని ముందుకు తీసుకువెళ్లవచ్చు. క్రౌడ్ సోర్సింగ్ ఫీచర్ ద్వారా గ్రూపులోని సభ్యులు కొత్త కొత్త వీడియోలను సజెస్ట్ చేయవచ్చు. ఫేస్‌బుక్ వాచ్ ఫీచర్‌ను యూఎస్ యూజర్లకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చిన తరువాత ప్రపంచవ్యాప్తంగా రోల్ అవుట్ చేయాలని భావించిన ఫేస్‌బుక్, తాజాగా ఈ ప్రాసెస్‌ను మొదలు పెట్టేసింది.

 

 

Best Mobiles in India

English summary
Facebook Rolls Out Watch Video Service Globally To Rival YouTube.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X