ఫేస్ బుక్ లో మరిన్ని మార్పులు!

By Madhavi Lagishetty
|

ఫేస్ బుక్...ఈ పదం తెలియనివారుండరు. స్మార్ట్ ఫోన్ ఉందంటే...ఖచ్చితంగా ఫేస్ బుక్ యాప్ ఉండాల్సిందే. దీంతో ఫేస్ బుక్ రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు యూజర్లకు కొత్త కొత్త అప్ డేట్స్ ను, ఫీచర్లను పరిచయం చేస్తూ...అట్రాక్ట్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఫేస్ బుక్ మరో పెద్ద అప్ డేట్ ను తీసుకురాబోతోంది.

 
ఫేస్ బుక్ లో మరిన్ని మార్పులు!

ఫేస్ బుక్ లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ తెలిపారు. ఫేస్ బుక్ లో తాము ఇచ్చే సమాచార పద్దతిలో మార్పులు చేస్తున్నట్లు సూచించారు. ఇన్నిరోజులు వ్యాపార లావాదేవీలకు సౌకర్యంగా ఉండేదని...కానీ ఇప్పుడు దీన్ని మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. ఫ్రెండ్స్ , ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకునేలా సరికొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జూకర్ బర్గ్ వెల్లడించారు.

ప్రజలకు సంబంధించి మంచిచెడులు చూసేందుకు, వారి సంక్షేమం కోసం ఫేస్ బుక్ పనిచేస్తుందని చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని..తాను తన బ్రుందం అభిప్రాయపడినట్లు చెప్పారు. ఫేస్ బుక్ లో ఈ మార్పులు సహజమని చెప్పిన జూకర్ బర్గ్, వ్యాపార సంస్థలు ఫేస్ బుక్ ను ఉపయోగించకపోయిన పర్వేలేదన్నారు. ప్రజలకు అనుగుణంగా ఉంటే చాలు అని అన్నారు.

గూగుల్, ట్విట్టర్, ఫేస్ బుక్ ల ద్వారా కొన్ని సందర్భాల్లో బోగస్ వార్తలు వచ్చాయి. వీటితో చాలా తీవ్రపరిణామాలు ఎదుర్కోవల్సి వచ్చింది. 2016లో రష్యా ఎలక్షన్స్ లో ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నాం. అయితే అలాంటి సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశించి ఫేస్ బుక్ కొన్ని మార్పులను ప్రవేశపెట్టింది. ఫేస్ బుక్ లో అనవసర కంటెంట్ ను తగ్గించి...తాము పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ అప్ డేట్స్ వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పుకొచ్చారు.

వన్‌ప్లస్ 5టీ నుంచి సరికొత్త లావా రెడ్ ఎడిషన్వన్‌ప్లస్ 5టీ నుంచి సరికొత్త లావా రెడ్ ఎడిషన్

తమకు ఇష్టమైన వారితో మాట్లాడటం, న్యూస్ ఆర్టికల్స్ చదవడం, షేర్ చేసిన వీడియోలను చూడటం వంటివి ఉండకపోవచ్చని సూచించాడు. ఇక ఈ ఏడాది జూకర్ బర్గ్ ఉద్దేశించినట్లుగా మిషన్ సామాజిక నెట్ వర్క్ ను పరిష్కరించడానికి , దుర్వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతామన్నరు. దీని కోసమే ఫేస్ బుక్ ఎక్కువ సమాయాన్ని వెచ్చిస్తుందన్నారు.

మరింత అర్థవంతమైన సామాజికంగా ఉపయోగపడే చర్యలకు సహాయపడటానికి...అవసరమైన కంటెంట్ను కనుగొనేలా చేయడంలో సహాయం చేస్తామని...తాను తమ బ్రుందం దీన్ని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతామని జుకర్ బర్గ్ వెల్లడించారు.

Best Mobiles in India

English summary
Facebook has now announced a major update to its platform. Well with the update, friends and family will be given priority above pages or celebrities in a user's news feed - and likely result in people spending less time on the leading social network.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X