ఫేస్‌బుక్ పోస్ట్‌ను వాట్సప్‌లో షేర్ చేసుకుంటారా..?

|

వాట్సప్ అలాగే ఫేస్‌బుక్ రెండు కూడా సోషల్ మీడియా ప్రపంచంలో ఒక సంచలనం అనే చెప్పవచ్చు. అటు మొబైల్ ప్రపంచాన్ని వాట్సప్ రారాజుగా ఏలుతుంటే, మరోవైపు ఫేస్‌బుక్ కూడా ప్రపంచ వ్యాప్తంగా తన ఖాతాదారులతో సంచలనాలు తయారు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ రెండు యాప్స్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు కూడా ఒకే సంస్థగా పనిచేస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఫేస్ బుక్ లో మీరు చూసిన వీడియో లేదా ఫోటోను. వాట్సప్ లో కూడా షేర్ చేసుకునే వీలును కల్పించేందుకు ఫేస్‌బుక్ ఒక కొత్త సదుపాయాన్ని కల్పించింది. దీని ద్వారా మీకు నచ్చిన ఫొటోలు, వీడియోలు, అలాగే గిఫ్ ఇమేజీలను ఎంచక్కా షేర్ చేసుకునే సర్దుబాటు లభిస్తోంది.

 
ఫేస్‌బుక్ పోస్ట్‌ను వాట్సప్‌లో షేర్ చేసుకుంటారా..?

ఇందుకోసం చేయాల్సిన పనేంటో చూద్దాం.. ముందుగా ఫేస్‌బుక్ ఇప్పటికే బీటా వెర్షన్ రూపంలో ఈ వాట్సప్ షేరింగ్ ఆప్షన్ ను పరిశీలిస్తోంది. గతంలో ఫేస్‌బుక్ మెసెంజర్ లో సైతం ఈ తరహాలోనే షేర్ చేసేవారు. ఇప్పుడు ఈ ఫీచర్ ను బీటా వర్షన్ ను ఎంపిక చేసిన యూజర్ల ద్వారా టెస్ట్ చేస్తున్నారు.

మార్కెట్లో వేడెక్కిన పోటీ, భారీగా తగ్గిన స్మార్ట్‌టీవీ ధరలు !మార్కెట్లో వేడెక్కిన పోటీ, భారీగా తగ్గిన స్మార్ట్‌టీవీ ధరలు !

ఫేస్‌బుక్ లో పోస్ట్ చేసిన వాటిని డైరక్టుగా వాట్సప్ లో షేర్ చేసేందుకు, కేవలం షేర్ బటన్ క్లిక్ చేస్తే చాలు ఎంచక్కా వాట్సప్ లో షేర్ అయిపోతుంది. మనం ఎంపిక చేసుకున్న గ్రూప్స్ లేదా కాంటాక్ట్స్ కు కూడా షేర్ చేసుకునే అవకాశం దక్కుతుంది. దీని ద్వారా ఇప్పటికే ఫేస్‌బుక్, వాట్సప్ కలిసి ఒకే సంస్థ ద్వారా పనులు చేస్తున్నప్పటికీ, ప్రస్తుతం రెండు యాప్స్ కు మధ్య కనెక్షన్ కలవడం నిజంగానే యూజర్లకు పండగే..

Best Mobiles in India

English summary
Facebook likely tests ‘Send in WhatsApp’ sharing button More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X