ప్లీజ్...మెసేంజర్ కిడ్స్ యాప్ తొలగించండి. ఫేస్ బుక్ సీఈవోకు నిపుణుల లేఖ!

Posted By: Madhavi Lagishetty

ఫేస్ బుక్ మెసేంజర్ కిడ్స్ యాప్... ఈ యాప్ తో పిల్లలకు ప్రమాదం పొంచి ఉందా? ఈ యాప్ ను 13 ఏళ్ల పిల్లలు వినియోగించడం అంత సేఫ్ కాదా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. 13 ఏళ్లలోపు పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించి వీడియో కాలింగ్, మెసేజింగ్ అప్లికేషన్ను నిలిపివేయాలని నిపుణులు ఫేస్ బుక్ కు సూచిస్తున్నారు.

ప్లీజ్...మెసేంజర్ కిడ్స్ యాప్ తొలగించండి. ఫేస్ బుక్ సీఈవోకు నిపుణుల

సోషల్ మీడియా పిల్లలకు చాలా ప్రమాదం అంటున్నారు. వందమందికి పైగా పిల్లలకు సంబంధించిన హెల్త్ ఎక్స్ పర్ట్స్ ...ఈ యాప్ ను శాశ్వతంగా తొలగించాలని ఫేస్ బుక్ సీఈవో మార్కె జూకర్ బర్గ్ ను కోరారు.

13ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాలో అకౌంట్స్ క్రియేట్ చేసుకునేంత స్థాయికి వారు రాలేరని...ఫేస్ బుక్ చీఫ్ కు నిపుణులు ఒక బహిరంగ లేఖను రాశారు. పిల్లల కోసం ప్రత్యేకంగా యాప్ ను డిజైన్ చేసిన మొట్టమొదటి సోషల్ మీడియా ఫేస్ బుక్ ,మెసేంజర్ కిడ్స్ ను నిలిపివేయాలని వైద్యులు, అధ్యాపకులు, బాలల ఆరోగ్య నిపుణులతోపాటు పలు సంస్థలకు చెందినవారు సంతకాలతో కూడిన లేఖతో కమర్షియల్ ఫ్రీ ప్రచారం చేపట్టారు.

సోషల్ మీడియా యువకులను ఎలా ప్రభావితం చేస్తుందో అని ఆందోళన చెందుతున్న ఈ సమయంలోనే...ఫేస్ బుక్ తన ప్రొడక్టును ఉపయోగించుకోవడానికి పిల్లలను ప్రోత్సహించడం అనేది బాధ్యతారహితమైనదని రచయితలు లేఖలో పేర్కొన్నారు.

మెసేంజర్ కిడ్స్ యాప్ డిసెంబర్ 2017లో ప్రారంభించబడింది. ఈ యాప్ పిల్లలను టాబ్లెట్ లేదా స్మార్ట్ ఫోన్ ద్వారా తమ సన్నిహితులు, ఫ్యామిలీతో కనెక్ట్ అయ్యేందుకు డిజైన్ చేయబడింది. అయితే ఈ యాప్ ద్వారా పిల్లలు మంచి కంటే చెడుకే కనెక్ట్ అవుతున్నారు.

ఎలాంటి యాడ్స్ లేకుండా...మార్కెటింగ్ ప్రయోజనాలకోసం కొత్త యాప్ ను ఫేస్ బుక్ కలెక్ట్ చేస్తుంది. డేటా ద్వారా డబ్బు సంపాదించుకోవాలని కాదు. కానీ కుటుంబాలపై, సమాజంపై ఈ యాప్ తీవ్రప్రభావం చూపుతుందని తెలిపారు. చిన్నపిల్లలో సోషల్ మీడియా ఉపయోగం అనేది వారిని మానసికంగా ఒత్తిడికి గురిచేసినట్లు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వాడకం వల్ల పిల్లలు చాలా వరకు నష్టపోతున్నారని...పరిశోధకులు పేర్కొన్నారు.

4 రూపాయలతో నచ్చిన నెట్‌వర్క్‌లోకి, టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఝలక్ !

నిపుణుల లేఖపై ఫేస్ బుక్ అధికార ప్రతినిధి గార్డియన్ స్పందించారు. మెసేంజర్ కిడ్స్ యాప్ ద్వారా కుటుంబాలపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. ఎందుకంటే మెసేంజర్ కిడ్స్ యాప్ లో ఎలాంటి యాడ్స్ లేవని మేము స్పష్టంగా చెప్పామన్నారు.

డిసెంబర్ లో బ్రిటీష్ హెల్త్ సెక్రటరీ జెరెమీ హంట్ సోషల్ మీడియాకు పిల్లలను దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. చిన్నపిల్లలను లక్ష్యంగా చేసుకునే ఇలాంటి యాప్స్ వస్తుంటాయని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

English summary
More than 100 child health experts have urged Facebook's CEO Mark Zuckerberg to delete Messenger Kids app permanently.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot