Home
Social media

ఫేస్‌బుక్ వాడితే డబ్బులు కట్టాలంటూ...

ఇక పై ఫేస్‌బుక్ ద్వారా మనం పంపే ప్రతి మేసెజ్‌కు 0.01 పైసా వసూలు చేస్తారని...

By Sivanjaneyulu Bommu

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు సంబంధించి ఓ మెసేజ్ విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది. ఫేస్‌బుక్ ఇక ఏ మాత్రం ఉచితం కాదని, ఇక పై ఫేస్‌బుక్ ద్వారా మనం పంపే ప్రతి మేసెజ్‌కు 0.01 పైసా వసూలు చేయబడుతుందని సదరు మెసేజ్ సారాంశం.

ఫేస్‌బుక్ వాడితే డబ్బులు కట్టాలంటూ...

Read More :

ఫేస్‌బుక్ విధించబోయే ఈ ఛార్జ్ నుంచి తప్పించుకోవాలంటే ఈ మెసేజ్‌ను 10 మందికి షేర్ చేయటం ద్వారా మీ లోగో blueగా మారుతుందని తద్వారా మీరు ఉచితంగా ఫేస్‌బుక్‌ను వాడుకోవచ్చని లేకుంటే మీ అకౌంట్‌కు ఛార్జ్ చేయబడుతుందని సదరు మెసేజ్ చెబుతోంది. వాస్తవానికి ఇదో పెద్ద ఫేక్ మెసేజ్.

ఫేస్‌బుక్ వాడితే డబ్బులు కట్టాలంటూ...

Read More :

ఫేస్‌బుక్ ఇటువంటి ప్రకటనను ఎన్నడూ చేయలేదు. ఇటువంటి మెసేజ్ లను పంపే సెండర్ ను బ్లాక్ చేసి వెంటనే వాటిని డిలీట్ చేయాలని ఫేస్‌బుక్ తమ యూజర్లను కోరుతోంది.

అసత్యాలు, అపోహలు

అసత్యాలు, అపోహలు

ఇంటర్నెట్‌లో అసత్యాలు, అపోహలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని పలువురు ఆకతాయలు ఈ అనాగరిక చర్యలకు పాల్పడుతున్నారు. అమాయక నెటిజనులను కలవరపాటుకు గురి చేస్తూ పలు అసత్య ప్రచారాలతో ఫోటోషాప్ టూల్ ద్వారా ఎడిట్ చేయబడిన మార్ఫింగ్ ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి దయచేసి వీటిని నమ్మకండి.

కాంటాక్ట్ లెన్స్‌లు కరిగిపోతున్నాయంటూ..

కాంటాక్ట్ లెన్స్‌లు కరిగిపోతున్నాయంటూ..

కాంటాక్ట్ లెన్స్‌లు వేడికి కరిగి పోతున్నాయంటూ నిరాధారమైన వార్తలు ఇంటర్నెట్ ప్రపంచంలో హల్ చల్ చేస్తున్నాయి.

జనగనమణ...

జనగనమణ...

భారత జాతియ గీతాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ జాతియ గీతంగా యునెస్కో ప్రకటించినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేసాయి. వీటిలో ఏ మాత్రం వాస్తవం లేదు.

ఎబోలా వైరస్‌...

ఎబోలా వైరస్‌...

ఐఫోన్ 6 ఫోన్‌లు ఎబోలా వైరస్‌కు గురయ్యాయంటూ ఇటీవల పలు రూమర్స్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తాయి. వీటిలో ఏ మాత్రం వాస్తవం లేదంటూ వైద్యులు కొట్టిపారేసారు.

11 మంది పిల్లలకు..

11 మంది పిల్లలకు..

11/11/11న 11 మంది పిల్లలకు గుజరాత్‌లో ఓ తల్లి జన్మనిచ్చిందంటూ ఓ రూమర్ సోషల్ మీడియాలో ఓ ప్రచారం సాగింది. ఈ ప్రచారంలో ఏ విధమైన వాస్తవం లేదు.

8 తలల పామంటూ

8 తలల పామంటూ

8 తలల పామంటూ సోషల్ మీడియాలో హల్ చేస్తున్న మార్ఫింగ్ ఫోటో. కొంత మంది ఈ ఫోటోను నిజమని భ్రమపడుతున్నారు.

దీపావళి కాంతుల్లో ...

దీపావళి కాంతుల్లో ...

దీపావళి కాంతుల్లో భారత్ వెలిగిపోతుందంటూ ఇటీవల కాలంలో ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా సర్కిలేట్ అవుతోంది. వాస్తవానికి ఈ ఫోటో దీపావళి సంబరాలుది కాదు. 1992-2003 మధ్య భారత జనాభాను విశ్లేషిస్తూ నాసా ఈ ఫోటోను విడుదల చేసింది.

Best Mobiles in India

English summary
Facebook To Start Charging Users?. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X