మీ పోస్టుల్లో ఇకపై చెత్త కామెంట్లకు చెక్, Downvote బటన్ వస్తోంది !

Written By:

Facebookలో ఈ మధ్య అసంబద్ధ వ్యాఖ్యలు, అబ్యూసివ్‌ వ్యాఖ్యలు రాజ్యమేలుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాజకీయాల గురించి ఎవరైనా పోస్టులు పెడితే అందులో అనేక కామెంట్లు అబ్యూసివ్‌గా ఉంటాయి, ఆ పోస్టు నచ్చని వారు విపరీత అర్థాలతో కామెంట్లు పెడుతుంటారు. వాళ్లు మనకు బాగా కావల్సిన వాళ్లు కాబట్టి మనం దాన్ని ఖండిచలేక అలాగే వదిలేస్తుంటాం. దాన్ని అందరూ చూస్తుంటారని తెలిసినా డిలీట్ చేయలేని పరిస్థితి.అయితే ఇప్పుడు దీనికి Facebook పరిష్కారం చూపబోతోంది. ఇలాంటి కామెంట్లకు డౌన్‌ఓట్ బటన్ తీసుకొస్తోంది.

Airtel Sim Owner వివరాలు తెలుసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

downvote అనే ఫీచర్‌..

ఫేస్‌బుక్‌ వినియోగదారుల సౌకర్యార్థం downvote అనే ఫీచర్‌ను టెస్ట్‌ చేస్తోంది.ఫేస్‌బుక్‌ పోస్ట్‌లపై వినియోగదారులకు ప్రతికూల స్పందనను నమోదు చేసే ఒక లక్షణాన్ని పరీక్షిస్తోంది. అయితే చాలామంది ఫేస్‌బుక్‌ వినియోగదారులకు ఆశిస్తున్నట్టుగా డిజ్‌లైక్‌ బటన్‌లా కాకుండా సరికొత్తగా దీన్ని పరీక్షిస్తోంది.

ఇబ్బంది పెట్టే కామెంట్‌పై..

ఫేస్‌బుక్‌ యూజర్లను ఇబ్బంది పెట్టే కామెంట్‌పై సంబంధిత యూజర్లు డౌన్‌వోట్‌ బటన్‌ క్లిక్‌ చేసినపుడు ఆ వ్యాఖ్య ప్రమాదకరమైందా, తప్పుదోవ పట్టించేదా, లేదా టాపిక్‌తో సంబంధం లేనిదా చెప్పమని అడుగుతుంది. అనంతరం ఆ కామెంట్లు మిగతా యూజర్లకు కనిపించకుండా చేస్తుంది.

2009 లో

కాగా 2009 లో లైక్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చినపుడు డిజ్‌లైక్‌ బటన్‌ కూడా చేర్చాలని యూజర్లు కోరుకున్నారు. అయితే 2016లో రియాక్షన్‌ ఎమోజీలను (ప్రేమ, నవ్వు, ఆశ్చర్యం, విచారం లాంటి) జోడించిన సంగతి తెలిసిందే.

ఎమోజీలకు అలవాటు..

ఇక ఎమోజీలకు అలవాటు పడిన చాటింగ్‌ ప్రియులకు కొత్తగా మరికొన్ని ఎమోజీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది చివరికల్లా కొత్తగా తయారుచేసిన 157 ఎమోజీలన్నీ స్మార్ట్‌ఫోన్‌లోకి అందుబాటులోకి రానున్నాయని యూనికోడ్‌ కన్సార్టియం తెలిపింది.

అనేక రకాల కొత్త ఎమోజీలు..

మహిళా సూపర్‌ హీరో, లైట్‌ స్కిన్‌ రెడ్‌ హెయిర్‌ ఉన్న అమ్మాయి, డార్క్‌ స్కిన్‌ కర్లీ హెయిర్‌ ఉన్న అబ్బాయి, దోమ, పైరెట్‌ ఫ్లాగ్‌(డేంజర్‌ జోన్‌లో ఉండే బొమ్మ) ఇలా అనేక రకాల కొత్త ఎమోజీలు ఉన్నట్లు సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook Testing Downvote Button to Let Users Flag Inappropriate Comments More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot