Home
Social media

ఫేస్‌బుక్ కొత్త ఫీచర్ 'Your Time on Facebook'

సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ ఓ సరికొత్త ఫీచర్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు సమచారం. ఈ ఫీచర్ ద్వారా ఫేస్‌బుక్‌లో రోజూ ఎంత సమయాన్ని గడుపుతున్నామనే దాని గురించి తెలసుకునే వీలుంటుందట.

By Bommu Sivanjaneyulu

సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ ఓ సరికొత్త ఫీచర్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు సమచారం. ఈ ఫీచర్ ద్వారా ఫేస్‌బుక్‌లో రోజూ ఎంత సమయాన్ని గడుపుతున్నామనే దాని గురించి తెలసుకునే వీలుంటుందట. 'Your Time on Facebook' పేరుతో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఫేస్‌బుక్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లో ఈ ఫీచర్‌ను విజయవంతంగా పరీక్షించి చూసినట్లు సమాచారం. త్వరలోనే ఫేస్‌బుక్ iOS అప్లికేషన్‌లో కూడా ఈ ఫీచర్‌ను పరీక్షించనున్నట్లు తెలియవచ్చింది.

 వారం రోజుల యూసేజ్ టైమ్‌ను ముందుగా లెక్కించి..

వారం రోజుల యూసేజ్ టైమ్‌ను ముందుగా లెక్కించి..

టెక్‌క్రంచ్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకురాబోతోన్న 'Your Time on Facebook' ఫీచర్ ప్రస్తుతానికి ఫేస్‌బుక్ యాప్‌లో హైడ్ చేసి ఉంచబడింది. యూజర్ ఫేస్‌బుక్ యూసేజ్‌కు సంబంధించి గడిచిన వారం రోజుల టైమ్‌ను ముందుగా ఈ ఫీచర్ లెక్కించి ఆ తరువాత యావరేజ్ టైమ్‌ను ట్యాలీ చేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా ఫేస్‌బుక్‌లో రోజుకు ఎంత సమయాన్ని కేటాయించాలనే దాని పై కూడా ఓ రిమైండర్‌ను సెట్ చేసుకునే వీలుంటుంది.

నోటిఫికేషన్స్‌కు పూర్తిగా దూరంగా ఉండొచ్చు...

నోటిఫికేషన్స్‌కు పూర్తిగా దూరంగా ఉండొచ్చు...

నోటిఫికేషన్స్ సెట్టింగ్స్‌ను ఛేంజ్ చేసుకునేందుకు ఓ షార్ట్‌కట్‌లా కూడా ఈ ఫీచర్ వ్యవహరిస్తుందట. ‘Your Time on Facebook' ఫీచర్‌లో అందుబాటులో ఉంచని 'Do Not Disturb' మోడ్‌ను ఎనేబుల్ చేసుకున్నట్లయితే ఫేస్‌బుక్ నోటిఫికేషన్స్‌కు పూర్తిగా దూరంగా ఉండొచ్చు. ఈ ఫీచర్‌ను ఏఏ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంచుతున్నామనే దాని పై ఫేస్‌బుక్ ఇప్పటికి వరకు స్పందించలేదు. దీనిపై త్వరలోనే ఓ అనౌన్స్‌మెంట్ చేసే అవకాశముంది.

గూగుల్, యాపిల్ సంస్థలకు ధీటుగా..

గూగుల్, యాపిల్ సంస్థలకు ధీటుగా..

గడిచిన నెలలో చోటుచేసుకున్న టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్‌లను మనం గమనించినట్లయితే ఫేస్‌బుక్ నేతృత్వంలోని ప్రముఖ ఫోటో షేరింగ్ ఇన్‌స్టాగ్రామ్, Usage Insights పేరుతో సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసిది. ఈ ఫీచర్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో రోజు ఎంత సేపు గడుపుతున్నామనేదాని గురించి తెలసుకునే వీలుంటుంది. తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే గూగుల్, యాపిల్ సంస్థలకు ధీటుగా కొత్త టెక్నాలజీలను ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మితిమీరుతోన్న స్మార్ట్‌ఫోన్ యూసేజ్‌...

మితిమీరుతోన్న స్మార్ట్‌ఫోన్ యూసేజ్‌...

ఈ నెల ఆరంభంలో యాపిల్ సంస్థ నిర్వహించిన 2018 వరల్డ్‌ వైడ్ వెబ్‌డెవలపర్స్ కాన్ఫిరెన్స్‌లో భాగంగా కంపెనీ తన iOS 12 ప్లాట్‌ఫామ్‌ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్లాట్‌ఫామ్‌లో పొందుపరిచిన స్ర్కీన్ టైమ్ ఫీచర్ ద్వారా ఐఫోన్ యూజర్లు స్మార్ట్‌ఫోన్ ఓవరేజ్‌ను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసకునే వీలుంటుంది. ఇదే సమయంలో గూగుల్ తన ఆండ్రాయిడ్ పీ ఆపరేటింగ్ సిస్టంతో పాటుగా ‘Digital Wellbeing' పేరుతో ఓ విప్లవాత్మక ఫీచర్‌ను అనౌన్స్ చేసింది. మితిమీరుతోన్న స్మార్ట్‌ఫోన్ యూసేజ్‌ను తగ్గించుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

Best Mobiles in India

English summary
Facebook has been spotted testing a feature that will let you see how long you spend on the social media network on a daily basis. Called 'Your Time on Facebook', the feature is initially under testing on Facebook's Android app.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X