ఎయిర్‌టెల్ సంచలనం, 20 వేల వైఫై హాట్‌స్పాట్‌లు !

Written By:

ఎయిర్‌టెల్ మరో సంచలనానికి రెడీ అయింది. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ దిగ్గజం ఫేస్‌బుక్‌ తో కలిసి భారత్ లోని గ్రామీణ ప్రాంత యూజర్లకు ఇంటర్నెట్ అందుబాటులోకి తెచ్చే దిశగా ఎక్స్‌ప్రెస్‌ వై-ఫై కోసం చేతులు కలిపింది. ఫేస్‌బుక్‌ గతంలో ప్రతిపాదించిన ఉచిత ఫ్రీ బేసిక్స్‌ ఇంటర్నెట్‌ సేవలకు భిన్నంగా దీన్ని పెయిడ్‌ విధానంలో అమలు చేయనుంది.

అమెజాన్ భారీ ఆఫర్ల పండగ, రెడీనా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎయిర్‌టెల్‌ రాబోయే కొన్ని నెలల్లో

ఈ ఒప్పందం ప్రకారం ఎయిర్‌టెల్‌ రాబోయే కొన్ని నెలల్లో 20,000 పైచిలుకు వై-ఫై హాట్‌స్పాట్స్‌ ఏర్పాటు చేయనుంది. నిర్దిష్ట వెబ్‌సైట్స్‌కి మాత్రమే పరిమితమైన ఫ్రీ బేసిక్స్‌కు భిన్నంగా ఎక్స్‌ప్రెస్‌ వై-ఫైలో పోర్టల్స్‌పై ఎటువంటి పరిమితి ఉండదు.

టెలికం ఆపరేటర్ల ద్వారా

టెలికం ఆపరేటర్ల ద్వారా అందుబాటులో ఉండే పబ్లిక్‌ వై-ఫై హాట్‌స్పాట్స్‌ను ఉపయోగించుకునేందుకు యూజర్లు రోజువారీ, వారంవారీ, నెలవారీ డేటా ప్యాక్స్‌ను స్థానిక రిటైలర్స్‌ నుంచి కొనుగోలు చేయొచ్చు.

కేవలం 39 కోట్ల మంది

130 కోట్ల మంది జనాభా గల భారత్‌లో కేవలం 39 కోట్ల మంది మాత్రమే ఇంటర్నెట్‌కి అనుసంధానమై ఉన్నారని ఫేస్‌బుక్‌ ఆసియా పసిఫిక్‌ ప్రాంత కనెక్టివిటీ సొల్యూషన్స్‌ విభాగం హెడ్‌ మునీష్‌ సేథ్‌ తెలిపారు.

దేశీయంగా మారుమూల ప్రాంతాలకు

ఈ నేపథ్యంలో దేశీయంగా మారుమూల ప్రాంతాలకు కూడా నెట్‌ను అం దుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో ఎక్స్‌ప్రెస్‌ వై-ఫై అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. మిగతా భాగస్వాములంతా కూడా కలిస్తే విస్తరించేందుకు వీలు కాగలదన్నారు.

డేటాకు సంబంధించిన చార్జీలు

ఈ సేవలకు సంబంధించి తాము ప్లాట్‌ఫామ్, సొల్యూషన్స్‌ మాత్రమే అందిస్తామని.. ఇందుకు గాను ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ లేదా టెలికం ఆపరేటర్, రిటైలర్‌ నుంచి ఎటువంటి చార్జీలు వసూలు చేయమని వివరించారు. డేటాకు సంబంధించిన చార్జీలు మొదలైనవి ఆపరేటర్‌ నిర్ణయిస్తారని సేథ్‌ తెలిపారు.

500 పైగా స్థానిక రిటైలర్లతో

ప్రస్తుతం ఫేస్‌బుక్‌ పలు ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ (ఐఎస్‌పీ), 500 పైగా స్థానిక రిటైలర్లతో చేతులు కలిపినట్లు వివరించారు. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌తో కలిసి ఫేస్‌బుక్‌ 2015లో ఫ్రీ బేసిక్స్‌ పేరిట పరిమిత వెబ్‌సైట్స్‌తో ఉచిత ఇంటర్నెట్‌ సేవలు ప్రవేశపెట్టింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook ties up with Airtel for 20,000 wi-fi hotspots Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting