Just In
- 8 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 10 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 13 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Movies
Pathaan Day 4 Collections: పఠాన్ రికార్డుల సునామీ.. రూ. 400 కోట్ల దిశగా షారుక్ సినిమా!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
ఫేస్‌బుక్ కొత్త ఫీచర్ ‘క్లియర్ హిస్టరీ’
తమ వినియోగదారుల సౌకర్యార్థం 'క్లియర్ హిస్టరీ' పేరుతో సరికొత్త ప్రైవసీ కంట్రోలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ తెలిపారు. ఈ ఫీచర్ ద్వారా తమ యూజర్లు ఫేస్‌బుక్ బ్రౌజింగ్ హిస్టరీని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకునే వీలుంటుందని ఆయన తెలిపారు. ఈ ఫీచర్ గురించి ఫేస్‌బుక్ యాన్యువల్ ఎఫ్8 మీటింగ్‌లో చర్చించనున్నట్లు ఆయన తన ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా ఇతర వెబ్‌సైట్స్ అలానే యాప్స్ నుంచి వ్యక్తిగత ఫేస్‌బుక్ అకౌంట్‌లకు సెండ్ అవుతోన్న సమాచారాన్ని యూజర్లు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. అంతేకాకుండా ఆ సమాచారాన్ని వారివారి అకౌంట్ల నుంచి డిలీట్ చేసుకునే సౌలభ్యత కూడా ఉంటుంది. ఈ సరికొత్త టూటల్ బ్రౌజర్‌లో కుకీలను క్లియర్ చేయటంతో పాటు యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా మరింతగా మెరుగుపరచగలుగుతుందని జూకర్‌బర్గ్ వెల్లడించారు.

తారా స్ధాయికి చేరుకున్న ఫేస్‌బుక్ వినియోగం..
సోషల్ నెట్‌వర్కింగ్ మరింతగా విస్తరించిన నేపధ్యంలో ఫేస్‌బుక్ వినియోగం తారా స్ధాయికి చేరుతోంది. ఫేస్‌బుక్ ఆకౌంట్ యాక్సిస్ స్మార్ట్‌ఫోన్‌లలోనూ సాధ్యమవటంతో ఇండియా వంటి దేశాల్లో మొబైల్ ఫేస్‌బుక్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. హ్యాకింగ్ సమస్య ఆన్‌లైన్ ప్రపంచాన్ని వేధిస్తోన్న నేపధ్యంలో ఫేస్‌బుక్ యూజర్లు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. ఫేస్‌బుక్ అకౌంట్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేసుకునేందుకు కొన్ని విలువైన సూచనాలు మీ కోసం..

లాగిన్ అప్రూవల్స్‌ను సెట్ చేసుకోవటం ద్వారా...
మీ ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించి లాగిన్ అప్రూవల్స్‌ను సెట్ చేసుకోవటం ద్వారా మీ అకౌంట్ సెక్యూరిటీ పరంగా మరింత కట్టుదిట్టంగా ఉంటుంది. "2-factor authentication"ను యాక్టివేట్ చేసుకునేందుకు Settings -> Security -> 'Login Approvals'లోకి వెళ్లండి. మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను వేరొక డివైస్ లో ఓపెన్ చేసి లాగ్ అవుట్ చేయటం మర్చిపాయారు. అయితే ఆ సెషన్‌ను రిమోట్ విధానం ద్వారా సైన్ అవుట్ చేయవచ్చు. అది ఏలా సాధ్యం అంటారా..? మీరు కాకుండా వేరొకరు వాడుతున్నట్లు తెలిస్తే ఆ యాక్టివిటీని ఎండ్ చేసేందుకు Settings -> Security -> 'Where You're Logged In' ఆప్షన్‌లోకి వెళితే సరిపోతుంది.

కొద్ది మందికి మాత్రమే కనిపించేలా సెట్ చేసుకోండి..
కొన్ని సందర్భాలలో చిరాకుపుట్టించే మెసేజులు మన ఫేస్‌బుక్ టైమ్‌లైన్ పై సర్క్యులేట్ అవుతుంటాయి. అయితే ఇలా ఎవరు పడితే వాళ్లు మీ టైమ్ లైన్ పై మెసేజ్ లను పోస్ట్ చేయకుండా, మీ టైమ్‌లైన్ కొద్ది మందికి మాత్రమే కనిపించేలా Settings -> Timeline and Tagging ->'Who can add things to my timeline?'ను మార్చుకోండి.

శక్తివంతమైన పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ అవసరం..
శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను ఎంపిక చేసుకోండి (మీరు ఎంపిక చేసకునే పాస్‌వర్డ్‌లో అక్షరాలు ఇంకా విరామ చిహ్నాలు ఉండేవిధంగా జాగ్రత్త వహించండి). ఆకౌంట్‌ను ఓపెన్ చేసిన ప్రతిసారి లాగ్ అవుట్ చేయటం మరవద్దు. ఆకౌంట్‌కు ‘సెక్యూరిటీ ప్రశ్న' ఫీచర్‌ను జత చేసుకోండి. ఫేస్‌బుక్‌లో ఉన్న కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించటం మంచిది. గూగుల్ యాడ్ బ్లాక్ ప్లస్ ఫీచర్‌ను మీబ్రౌజర్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని రీడ్ రిసిప్ట్స్ ఫీచర్‌ను టర్నాఫ్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470