ఫేస్‌బుక్ మెసేంజర్ యూజర్ల కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇన్ స్టాంట్ గేమ్స్!

Posted By: Madhavi Lagishetty

ఫేస్‌బుక్ మెసేంజర్ యూజర్లకు గుడ్ న్యూస్. మెసేంజర్లో ఇన్ స్టాంట్ గేమ్స్ ఆడుకునేవారికి లైవ్ స్ట్రీమింగ్ మరియు వీడియో చాట్స్ ను ఫేస్‌బుక్ అందిస్తుంది. ఈ మధ్యకాలంలోనే...మెసేంజర్ తన యూజర్ల కోసం ఇన్ స్టాంట్ గేమ్స్ యాప్ ను రిలీజ్ చేసింది. ఈ యాప్ తో ఫ్రెండ్స్ తో గేమ్స్ ఆడుకోవచ్చు. అయితే ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్ కోసం ఫేస్ బుక్ సపోర్టు ప్రకటించింది. లైవ్ వీడియో చాటింగ్ ద్వారా గేమ్స్ ఆడుకోవచ్చు.

ఫేస్‌బుక్ మెసేంజర్ యూజర్ల కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇన్ స్టాంట్ గేమ్స్!

ఫస్ట్ లైవ్ స్ట్రీమింగ్ ను ప్రారంభిస్తున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటిచింది. గేమర్స్ చిన్న స్మాక్ టాక్ తో పాల్గొనడానికి ఇష్టపడేవారిని షేర్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ లైవ్ ద్వారా కొత్త లైవ్ స్ట్రీమింగ్ కెపాసిటి ప్రజల కోసం దీన్ని సులభతరం చేస్తుంది. మెసెంజర్లో గేమ్స్ ఇష్టపడేవారికి వారి అనుభవాలు పంచుకోవచ్చని తన బ్లాక్ పోస్టులో ప్రకటించింది.

ఈ కొత్త ఫీచర్స్ తో యూజర్లు లైవ్ స్ట్రీమ్స్ ను రికార్డు చేసుకోవచ్చు. అంతేకాదు రికార్డు చేసుకున్న లైవ్ స్ట్రీమ్స్ ను తమ ప్రొఫైల్ కు పోస్టు చేయవచ్చు. నెలకు దాదాపు 245మిలియన్ల మంది యూజర్లు మెసేంజర్లో వీడియో చాట్ చేస్తున్నారు. త్వరలోనే ఒక టెస్టు ప్రారంభించడానికి సంతోషంగా ఉందని కంపెనీ తెలిపింది. వీడియో చాటింగ్ చేసేటప్పుడు యూజర్లు ఒకరికొకరు గేమ్స్ ను ఆడటానికి వీలు కల్పిస్తారని కంపెనీ వెల్లడించింది.

BSNL నుంచి మరో మూడు కొత్త ప్లాన్లు !

సోషల్ మీడియా దిగ్గజం కూడా re-imagined అని పెద్ద పేరుతో మొబైల్ టైటిల్స్ తో ఇన్ స్టాంట్ గేమ్స్ ఫ్లాట్ ఫాంను ప్రకటించింది. 2018లో ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభించనుంది. ఇది యాంగ్రీ బర్డ్స్ కు ఉత్తేజకరమైన మార్గంగా క్లాసిక్ ఆటతీరును ప్రదర్శించే మెసెంజర్ కోసం నిర్మించిన ఒక కొత్త గేమ్ అని ఫేస్‌బుక్ తెలిపింది.

ఫేస్‌బుక్ మెసేంజర్ యూజర్ల కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇన్ స్టాంట్ గేమ్స్!


లైవ్ స్ట్రీమింగ్ ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?

లైవ్ స్ట్రీమింగ్ ను యాక్టివేట్ చేసుకోవడం చాలా ఈజీ. గేమ్ ఆడుతున్నప్పుడు, గేమ్ కుడి ఎగువ మూలలో ఉన్న కెమెరా ఐకాన్ను నొక్కండి. ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మీ వీడియో గురించి ఏదైనా చెప్పడానికి...మీరు లైవ్ స్ట్రీమింగ్ చేయాలనుకుంటున్న ఆడియన్స్ ను సెలక్ట్ చేసుకోవచ్చు. వీడియో గురించి చిన్నగా ఏదైనా వివరణను యాడ్ చేయండి.

రికార్డింగ్ ను ప్రారంభించడానికి లైవ్ వీడియోను ప్రారంభించండి. బటన్ను ప్రెస్ చేశాక, లైవ్ ముగిసిన తర్వాత మీ పేజీ లేదా ప్రొఫైల్ కు వీడియో పబ్లిక్ చేయబడుతుంది. దీంతో మీ గేమ్ ను చూడలేని అభిమానులు తర్వాత చూసుకునే అవకాశం ఉంటుంది. వీడియో పోస్ట్ ను..ఇతర పోస్టుల వలే ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చు.

English summary
Facebook is introducing two new features to Instant Games that will help you engage and connect with those you care about in new and different ways.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot