ఫేస్ బుక్ నుంచి రెండు స్మార్ట్ స్పీకర్లు...జూలైలో లాంచ్!
ఫేస్ బుక్ నుంచి టచ్ స్క్రీన్ స్మార్ట్ స్పీకర్లు రెడీ అవుతున్నట్లు గతేడాది ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. ఒకటి లేదా రెండు స్మార్ట్ స్పీకర్లతో యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు ఫేస్ బుక్ ఎలక్ట్రానిక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్లు digitimes రిపోర్టులో వెల్లడించింది. అలోహ, ఫియోనా...పేర్లతో ఈ స్మార్ట్ స్పీకర్లు...2018మధ్యలో రిలీజ్ కానున్నట్లు రిపోర్టు తెలిపింది. అలోహ, ఫియోనా అనేవి స్మార్ట్ స్పీకర్ల సంకేతపదాలు మాత్రమే. ఈ డివైజులు వేర్వేరు పేర్లతో రిలీజ్ కానున్నాయి.

డిజిటైమ్ రిపోర్టు ప్రకారం...అలోహ, ఫియోనా స్మార్ట్ స్పీకర్లను 15అంగుళాల టచ్ స్క్రీన్ తో LG రూపొందిస్తున్నట్లు తెలిపింది. ఈ స్మార్ట్ స్పీకర్లను ఈ ఏడాది మే నెలలో లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు పేర్కొంది. క్వాలిటీతోకూడిన గాడ్జెట్స్ ను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఫేస్ బుక్ వీటిని రెడీ చేసేందుకు మరికొంత సమయం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ ఏడాది జూలైలో ఈ డివైసును రిలీజ్ చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు రిపోర్టులో తెలిపింది.
ఈ రెండు డివైజులూ కూడా సీక్రెట్ బిల్డింగ్ 8 ల్యాబ్ లో తయారవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అడ్వాన్స్డ్ మోడల్ గా చెప్పుతున్న ఈ డివైజులు ఫేస్ బుక్ యొక్క అధికారిక పోర్టల్ ద్వారా లాంచ్ కానున్నాయి. వాయిస్ కమాండ్స్ తోపాటు...స్మార్ట్ స్పీకర్స్ కూడా యూజర్లు గుర్తించడానికి ఫేస్ రికగ్నైజ్ టెక్నాలజీతో రానున్నాయి. దాదాపు 31,735రూపాయలు ఉండే అవకాశం ఉందని పుకార్లు వస్తున్నాయి.
అలోహ అకా పోర్టల్ సోషల్ నెట్ వర్కింగ్ ఫంక్షన్లను అందిస్తుందని డిజిటైమ్ రిపోర్టు వెల్లడించింది. దీని కోసం సోనీ, యూనివర్సల్ మ్యూజిక్ తో ఒప్పందం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. వీటి సహాయంతో స్మార్ట్ స్పీకర్లతో మరిన్ని ఫీచర్లను చేర్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications