ఫేస్‌బుక్‌లో మీకు డబ్బులు వచ్చేస్తున్నాయ్ !

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఇప్పుడు యూజర్లకు మరో అద్బుతమైన ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొస్తోంది.

By Hazarath
|

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఇప్పుడు యూజర్లకు మరో అద్బుతమైన ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఫేస్‌బుక్ ద్వారా యూజర్లను డబ్బులు పొందే సౌకర్యాన్ని కల్పిస్తోంది. ట్రయిల్స్ దశలో ఉన్న ఈ ఫీచర్ విజయవంతం అయితే అతి త్వరలోనే యూజర్లకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. ఈ ఫీచర్‌తో యూజర్లను మరింత మందిని ఆకట్టుకోనుందని తెలుస్తోంది.

సోనీ నుంచి ఫస్ట్ డ్యూయెల్ కెమెరా ఫోన్..సోనీ నుంచి ఫస్ట్ డ్యూయెల్ కెమెరా ఫోన్..

మార్కెట్‌ ప్లేస్‌ అనే కొత్త ఫీచర్‌..

మార్కెట్‌ ప్లేస్‌ అనే కొత్త ఫీచర్‌..

ఫేస్‌బుక్‌కు భారీ మొత్తంలో యూజర్‌ డేటాబేస్‌ ఉండటంతో, ఫేస్‌బుక్‌ తన పేజీలో మార్కెట్‌ ప్లేస్‌ అనే కొత్త ఫీచర్‌ తీసుకొస్తోంది. మార్కెట్‌ప్లేస్‌' పేరుతో ఫేస్‌బుక్‌ ప్లాట్‌ఫామ్‌పై ఈ ఫీచర్‌ ట్రయల్‌ను ముంబైలో చేపట్టింది.

ఓలెక్స్‌, క్వికర్‌ తరహాలో..

ఓలెక్స్‌, క్వికర్‌ తరహాలో..

ఒకవేళ అక్కడ ఇది సక్సెస్‌ అయితే వెంటనే దేశవ్యాప్తంగా దీన్ని లాంచ్‌ చేయబోతుంది. ఆన్‌లైన్‌ క్లాసిఫైడ్స్‌ ఓలెక్స్‌, క్వికర్‌ తరహాలో ఫేస్‌బుక్‌ కూడా ఈ సేవలను అందిస్తోంది.

 

నచ్చినవారు అక్కడే ఛాటింగ్‌..

నచ్చినవారు అక్కడే ఛాటింగ్‌..

అందులోకి వెళ్లి అమ్మాలనుకుంటున్న లేదా కొనాలనుకుంటున్న వస్తువుల ఫొటోలు పెట్టి వివరాలు రాయాలి. అది చూసి నచ్చినవారు అక్కడే ఛాటింగ్‌ లేదా కాల్‌ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తారు.

అన్ని కేటగిరీ వస్తువులను..
 

అన్ని కేటగిరీ వస్తువులను..

గృహోపరికరాలు, ఎలక్ట్రానిక్స్‌, అప్పారెల్స్‌ వంటి అన్ని కేటగిరీ వస్తువులను దీనిలో కొనుగోలు చేసుకోవడానికి, అమ్మడానికి అవకాశం కల్పించనుంది.

ఫేస్‌బుక్‌ బాధ్యత..

ఫేస్‌బుక్‌ బాధ్యత..

అయితే పేమెంట్‌కు, డెలివరీకి మాత్రం ఫేస్‌బుక్‌ బాధ్యత కాదు. ఇందులో అభ్యంతరకమైన వస్తువులను అమ్మకానికి పెట్టడానికి వీలులేకుండా మెషీన్‌ లెర్నింగ్‌ సాంకేతికతను వాడుతున్నారు.

ఈ ఫీచర్‌ 25 దేశాల్లో..

ఈ ఫీచర్‌ 25 దేశాల్లో..

కాగా ఇప్పటికే ఈ ఫీచర్‌ 25 దేశాల్లో అందుబాటులో ఉంది. ఇటీవలే జర్మనీ, ఫ్రాన్స్‌, యూకే వంటి 17 దేశాల్లో దీన్ని ప్రారంభించారు.

పూర్తిగా అందుబాటులోకి వస్తే

పూర్తిగా అందుబాటులోకి వస్తే

అయితే ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తే ఒలెక్స్ తో పాటు మిగతా ఈ కామర్స్ దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Best Mobiles in India

English summary
Facebook trials Olx-like Marketplace feature in India Read more once at Gibot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X