Facebookలోకి వాయిస్ క్లిప్ ఫీచర్, టైపింగ్ చేయడం మరచిపోండి !

Written By:

ఇప్పుడు టైపింగ్ చేయడం కన్నా వాయిస్ క్లిప్పింగ్ పంపడం అనే దానిలో చాలామంది ఆసక్తిని ప్రదర్శిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. టైపింగ్ చేయడం బోర్ గా ఫీలయ్యేవారికి వాయిస్ క్లిప్పింగ్ అనేది చాలా ముఖ్యం. దీని ద్వారా టైం కూడా చాలా సేవ్ అవుతంది. మనం చెప్పాలనుకున్నది క్షణాల్లో వారికి తెలిసిపోతుంది. దీన్ని పసిగట్టిన ఫేస్‌బుక్ ఇప్పుడు వాయిస్ క్లిప్పింగ్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇండియాలోని యూజర్ల కోసం ఫేస్‌బుక్ వాయిస్ క్లిప్పింగ్ అనే ఫీచర్ ను టెస్టింగ్ చేస్తోందని కధనాలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని Abhishek Saxena అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

షియోమి సంచలనం, రూ. 13 వేలకే 32 అంగుళాల స్మార్ట్‌టీవి..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

TechCrunch అనే వెబ్‌సైట్

అయితే ఈ విషయంపై TechCrunch అనే వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌ని సంప్రదించగా ఇది నిజమేనని దీని మీద ఫేస్‌బుక్‌ టెస్టింగ్ నిర్వహిస్తోందని అందులోని పనిచేస్తున్న ఓ అధికారి తెలిపారు. మేము ఎప్పుడూ ప్రజలకు అవసరమైన విషయాల మీద పనిచేస్తామని అందరికీ ఉపయోగపడే విషయాలనే వారికి అందించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. ఇదొక కొత్త ప్రయత్నమని ప్రజలు తమ సమయాన్ని ఈ ఫీచర్ ద్వారా మరింతగా సేవ్ చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.

Original content broadcasting

అయితే Original content మీద ఫేస్‌బుక్ పట్టు కోల్పోతున్న నేపథ్యంలో ఇలాంటి ఆలోచనకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. Original content 2015లో 21 శాతంగా ఉంటే 2016 నాటికి ఇది 15 శాతానికి పడిపోయింది. కాగా రియాలిటీ స్టోరీల విషయంలో ఫేస్‌బుక్‌కు ప్రధాన పోటీగా స్నాప్ చాట్, ట్విట్టర్ ఉన్న సంగతి తెలిసిందే.

ఫేస్‌బుక్‌లో వచ్చే న్యూస్ నిజమో కాదో తెలియకుండానే ..

కాగా ఫేస్‌బుక్‌లో వచ్చే న్యూస్ నిజమో కాదో తెలియకుండానే చాలామంది ఆ లింకులను షేర్లు చేస్తుంటారు. క్షణాల్లో లక్షల్లో  ఈ న్యూస్ షేర్ అయి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళుతోంది. ఈ ఫేక్ న్యూస్ భారీ స్థాయి షేరింగులతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందనే అపవాదును ఇప్పటికే ఫేస్ బుక్ మూటగట్టుకుని ఉంది. దీన్ని రూపుమాపాలని ఫేస్‌బుక్ ప్రయత్నిస్తున్నప్పటికీ ఆశాజనక ఫలితాలు రావడం లేదు. యుఎస్ కెనడాలో ఇలాంటివి చాలా ఎక్కువగానే జరిగినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. అయితే వాయిస్ క్లిప్ రావడం ద్వారా దీన్ని కొంతమేరకైనా అరికట్టే అవకాశం ఉందని ఫేస్‌బుక్ భావిస్తోంది.

వాల్ మీద మీరు రాసే పోస్టుల దగ్గరే..

ఫేస్‌బుక్ నుంచి త్వరలో రానున్న ఈ ఫీచర్  మీ వాల్ మీద మీరు రాసే పోస్టుల దగ్గరే కనిపిస్తుంది. photo uploads, location check-insలతో పాటు మీకు అక్కడ Add Voice Clip అనే ఆప్సన్ కూడా ఉంటుంది. దీన్నిట్యాప్ చేయడం ద్వారా మీరు మీ వాయిస్ క్లిప్ ని పోస్ట్ చేయవచ్చు. ఇందులో మీకు లిమిట్ అనేది ఉండదు. ఎంత టైమ్ అయినా మీరు మాట్లాడి పంపుకునే అవకాశం ఉన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

ఓ సారి పోస్ట్ చేసిన తరువాత..

అయితే మీరు ఓ సారి పోస్ట్ చేసిన తరువాత దాన్ని ఎడిట్ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. దీన్ని న్యూస్ లాగా షేర్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. వేవ్ యానిమేషన్లో ఈ క్లిప్ ని యూజర్లు వినే సౌలభ్యం ఉంది. కొన్ని ఆడియో యాప్స్ ద్వారా వాయిస్ ను ఫేస్‌బుక్ లో పోస్ట్ చేసినప్పటికీ టెక్నికల్ గా ఫేస్‌బుక్ గా లో వచ్చే ఈ ఫీచర్ యూజర్లను ఎక్కువగా ఆకట్టుకునే అవకాశం ఉంది. కాగా ఈ వాయిస్ క్లిప్ మొత్తం 22 భాషల్లో రానుందని సమాచారం.

భారీగానే కసరత్తు..

కాగా గతేడాది గూగుల్ 11 కొత్త భాషలను  పాఠకులకు కోసం యాడ్ చేసిన సంగతి విదితమే. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫేస్‌బుక్ ఈ ఫీచర్ మీద భారీగానే కసరత్తు చేస్తోందని సమాచారం. Aloha అనే smart speaker code నేమ్ తో ఇది నిర్మితమైనట్లు చెడ్డార్ అనే సైటు కూడా రిపోర్ట్ చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Micropodcasting? Facebook tries Voice Clip status updates more news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot