డేటా లీక్‌పై మరో బాంబు పేల్చిన జుకర్‌బర్గ్, ట్విట్టర్ డేటా లీక్ దుమారం

|

ఇంటర్నెట్ రోజు రోజుకు విస్తరిస్తున్న తరుణంలో డేటా భద్రత అనేది యూజర్లకు పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజాలన్నీ ఈ డేటా లీక్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కుంటూ యూజర్లను మరింత ప్రమాదంలోకి నెట్టివేస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ఫేస్‌బుక్ పలు ఆరోపణల మధ్య నలిగిపోయింది. అయితే ఆ ఆరోపణల మంటలు ఇంకా చల్లారక ముందే ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగదారుల డేటా లీక్‌ ప్రకంపనల నుంచి ఇంకా తేరుకోకుండానే ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జూకర్‌ బర్గ్‌ మరో బాంబు పేల్చారు. డేటా బ్రీచ్‌ ప్రమాదం మరింత పొంచి వుందని యూజర్లు, ఇన్వెస్టర్లను ఫేస్‌బుక్ హెచ్చరించింది.

 

వన్‌ప్లస్ నుంచి OnePlus 6 సీరిస్‌లో స్పెషల్ ఎడిషన్వన్‌ప్లస్ నుంచి OnePlus 6 సీరిస్‌లో స్పెషల్ ఎడిషన్

భవిష్యత్తులో మరింతగా డేటా లీక్‌..

భవిష్యత్తులో మరింతగా డేటా లీక్‌..

అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్ఈసీ)కు సమర్పించిన త్రైమాసిక నివేదికలో భవిష్యత్తులో మరింతగా డేటా లీక్‌ ఉండే అవకాశముందని ఫేస్‌బుక్‌ వెల్లడించింది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ కు అందించిన త్రైమాసిక నివేదికలో, కేంబ్రిడ్జ్ ఎనలైటికా గురించి ప్రస్తావించకుండానే యూజర్లకు ఈ హెచ్చరిక చేసింది.

థర్డ్‌ పార్టీల అవాంఛనీయ కార్యాచరణ ద్వారా..

థర్డ్‌ పార్టీల అవాంఛనీయ కార్యాచరణ ద్వారా..

థర్డ్‌ పార్టీల అవాంఛనీయ కార్యాచరణ ద్వారా వినియోగదారుల డేటా లీక్‌ సంఘటనలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. తమ సంస్థ నుంచి మరింత డేటాను ఇతరులు తస్కరించి వాటిని దుర్వినియోగం చేసే అవకాశముందని ఫేస్‌బుక్‌ ఎస్ఈసీకి తెలిపింది.

తమ కీర్తి, ప్రతిష్టలకు తీవ్ర హాని..
 

తమ కీర్తి, ప్రతిష్టలకు తీవ్ర హాని..

ఇది తమ కీర్తి, ప్రతిష్టలకు తీవ్ర హాని కలిగించవచ్చు. తమ వ్యాపారాన్ని, ఆర్థిక ఫలితాలను ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చని పేర్కొంది. కాగా ఫేస్‌బుక్‌ నుంచి అక్రమంగా సేకరించిన కోట్ల మంది యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని కేంబ్రిడ్జ్‌ అనలిటికా లీక్‌ చేసిన విషయం తెలిసిందే.

భారీ మూల్యం ..

భారీ మూల్యం ..

ఈ వివాదంలో అమెరికా, బ్రిటన్‌ చట్ట సభలు ఇప్పటికే విచారణ ప్రారంభించాయి. అంతేకాదు ఈ వ్యవహారంలో కంపెనీ నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించక తప్పదని అంచనాలు నెలకొన్నాయి.

ట్విటర్‌కూడా..

ట్విటర్‌కూడా..

ఇదిలా ఉంటే మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌కూడా యూజర్ల డేటాను విక్రయిచిందన్న వార్తలతో యూజర్లు మరింతగా ఆందోళనకు గురి అవుతున్నారు. ట్విట్టర్‌కు చెందిన యూజర్ల డేటాను కేంబ్రిడ్జ్ ఎనలిటికా చేజిక్కించుకున్న అనంతరం ఈ సమాచారాన్ని వినియోగదారుల సమ్మతి లేకుండానే పొలిటికల్‌ కన్సల్టింగ్‌ సంస్థకు విక్రయించింది.

ఒక రోజులోనే..

ఒక రోజులోనే..

గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ (జిఎస్ఆర్, అలెగ్జాండర్ కోగన్ సొంత వ్యాపార సంస్థ) భారీ ఎత్తున తమ వినియోగదారుల డేటాను తస్కరించిందని ట్విట్టర్‌ మరో షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. 2015లో కేవలం ఒక రోజులోనే నెలరోజులకు సంబంధించిన భారీ డేటాను చోరిచేసిందని పేర్కొంది.

బ్లూంబర్గ్‌ అందించిన స​మాచారం ప్రకారం..

బ్లూంబర్గ్‌ అందించిన స​మాచారం ప్రకారం..

బ్లూంబర్గ్‌ అందించిన స​మాచారం ప్రకారం 2015లో, జీఎస్‌ఆర్‌ సంస్థకు డిసెంబరు 2014 నుంచి ఏప్రిల్ 2015 దాకా పబ్లిక్ ట్వీట్ల రాండం శాంపిల్‌కోసం ఐదు నెలల వ్యవధిలో తన అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌పై వన్‌టైం యాక్సెస్‌ ఇచ్చామని ట్విటర్‌ ఈ సందర్భంగానే డేటా లీక్‌ అయ్యిందని ఒక ప్రకటనలో తెలిపింది.

డేటా బ్రీచ్‌ నివేదిక నేపథ్యంలో..

డేటా బ్రీచ్‌ నివేదిక నేపథ్యంలో..

అయితే ఇటీవల డేటా బ్రీచ్‌ నివేదిక నేపథ్యంలో అంతర్గత సమీక్షలో ఈ విషయాన్ని గుర్తించామనీ, దీంతో కేంబ్రిడ్జ్ ఎనలిటికా, దాని అనుబంధ సంస్థలు, ప్రకటనకర్తలను తొలగించినట్టు పేర్కొంది. కాగా యూజర్ల సమాచార భద్రతలో ట్విట్టర్ వైఫల్యం, డేటా దుర్వినియోగాన్ని నిరోధించడంలో విఫలం కావడంపై మరో దుమారం చెలరేగింది

Best Mobiles in India

English summary
Facebook warns users, investors of more data leaks More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X