ఫేస్ బుక్, వాట్సాప్ సరికొత్త రికార్డు!

By: Madhavi Lagishetty

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి అప్పుడే నాలుగు రోజుల పూర్తయ్యింది. ఈ నాలుగు రోజుల్లో లైవ్ బ్రాడ్ కాస్టింగ్ పరంగా ఫేస్ బుక్ ఒక కొత్త మైలురాయిని చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 10మిలియన్ల కంటే ఎక్కువమంది...కొత్త సంవత్సరం ఈవ్ మూమెంట్స్ ను కమ్యూనిటీలతో ఫేసుబుక్ లైవ్ ద్వారా పంచుకున్నారు.

ఫేస్ బుక్, వాట్సాప్ సరికొత్త రికార్డు!

గతేడాది ప్రత్యక్షంగా 47శాతం మంది లైవ్ వీడియోలను షేర్ చేసుకున్నారు. దీంతో గతేడాది ప్రత్యక్ష ప్రసార కార్యకలాపాల్లో ఫేస్ బుక్ మొదటిస్థానంలో నిలిచిందని ఫేస్ బుక్ ప్రొడక్ట్ మేనేజర్ ఎరిన్ తన బ్లాగ్ పోస్టులో తెలిపారు. 2018 వరకు ఫ్రెండ్స్, ఎవరు ఎక్కడ ఉన్నారు. వారి ఇంట్రెస్ట్ ను వ్యక్తం చేశారు. డిసెంబర్ లో సగటు రోజుతో పోల్చితే కొత్త సంవత్సర వేడుకల్లో స్నేహితులతో 3 సార్ల కంటే ఎక్కువసార్లు ఫేస్ బుక్ లైవ్ లో పాల్గొన్నట్లు తెలిపారు.

కొత్త సంవత్సరం వేడుకలను ప్రపంచం మొత్తం జరుపుకుంది. అంతేకాదు ప్రత్యేక్ష ప్రసారాలకు ఇది గొప్ప సమయమని చెప్పవచ్చు. ఫేస్ బుక్ యూజర్లు అదనపు ఆప్షన్స్ ఇవ్వడానికి, వారి పూర్తిస్థాయిలో ఎంటర్ టైన్మెంట్ అందించడానికి ఫేస్ బుక్ కొన్ని లైవ్ ఫీచర్లను కూడా ప్రారంభించింది.

ఈ ప్రత్యక్ష ప్రసార వీడియోలను ఎంతమంది వీక్షించారు అనిదానిపై డేటాను పంచుకోవడం లేదు. కానీ చాలా మంది లైవ్ వీడియోలను ఫాలో అయినట్లు పేర్కొంది. మీరు లైవ్లోకి వచ్చినప్పుడు మీకు ఇష్టం ఉన్న వ్యక్తులతో మీ అభిప్రాయాలను షేర్ చేసుకుంటారు.

తెలంగాణలో ఇప్పుడంతా...టెక్ పాలనే!

ఫేస్ బుక్ తోపాటు వాట్సాప్ కూడా 75బిలియన్ మెసేజ్ లతో నూతన సంవత్సర వేడుకలో కొత్త మైలురాయిని అదిగమించింది. నిజానికి వాడుకలో ఉన్న కారణంగా మెసేజింగ్ యాప్...ఇండియాలో అనేమంది యూజర్లకు కొంత సమయం వరకు పనిచేయలేదు.

అయితే వాట్సాప్ మెసేజ్ లు వేదిక క్రాష్ తర్వాత, రెండు గంటల్లో పునరుద్దరించబడింది. డిసెంబర్ 31న బ్లాక్ బెర్రీ OS, మరియు విండోస్ ఫోన్ సర్వీసులకు వాట్సాప్ సపోర్టు ఉపసంహరించుకున్నప్పటికీ రికార్డు కూడా సెట్ చేసింది.

Venturebaet ప్రకారం, వాట్సాప్ ఒక రోజులో అత్యధిక మెసేజ్ లు పంపిన యాప్ గా చరిత్రలో నిలిచిపోయింది. 2016 సంవత్సరంలో నూత సంవత్సరం వేడుకలో 63బిలియన్ల సందేశాలు పంపారు. 75బిలియన్ల సంఖ్య 13 బిలియన్ చిత్రాలు మరియు 5బిలియన్ వీడియోలను పంపించారు. ఇప్పుడు ఆ రికార్డును వాట్సాప్ బద్దలు కొట్టింది.

Read more about:
English summary
More than 10 million people around the world went live on Facebook to share their New Years eve moments with their communities.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot