ఫేస్‌బుక్ ఫేక్ న్యూస్ లకు బ్యాడ్ న్యూస్!

By: Madhavi Lagishetty

ఫేస్ బుక్... ఫేక్ న్యూస్ కు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఫేక్ న్యూస్ తొలగింపునకు సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు రెడీ అయ్యింది. పదే పదే వస్తున్న ఫేక్ న్యూస్ ..Facebook లో ఇన్వాల్వ్ కాకుండా చర్యలు తీసుకుంటుంది. అంతేకాదు ఫేక్ న్యూస్ షేర్ చేసే పేజీలకు యాడ్స్ నిలివేయాలని డిసైడ్ అయ్యింది.

ఫేస్‌బుక్ ఫేక్ న్యూస్ లకు బ్యాడ్ న్యూస్!

ఫేస్ బుక్ బ్లాగ్ పోస్ట్ ప్రకారం...ఈ అప్ డేట్ ఫేక్ న్యూస్ డిస్ట్రిబ్యూషన్ తగ్గించడానికి సహాయం చేస్తుంది. ఇది డబ్బును సంపాదించే ఫేక్ న్యూస్ ను స్ప్రెడ్ చేసే పేజీలను తొలగిస్తుంది. ఫేస్ బుక్ ప్రకటనలను ఉపయోగించి ఫేక్ న్యూస్ ను డిస్ట్రిబ్యూట్ చేయడాన్ని నిరోధిస్తుంది. ఒక పేజీ పదేపదే థర్డ్ పార్టీ ఫ్యాక్ట్ చెక్కర్ మార్క్ చేసిన స్టోరీలను షేర్ చేస్తుంటే..వారు ఫేస్ బుక్ లో ఇకపై యాడ్స్ ను కొనుగోలు చేయలేరని తెలిపింది.

అయినప్పటికీ, అటువంటి పేజీలు ఫేక్ న్యూస్ షేర్ చేయడం స్టాప్ చేస్తే..వారు యాడ్ సర్వీస్ ను మరల ఉపయోగిస్తుంటారు. ఫేస్ బుక్ థర్డ్ పార్టీ సంస్థలను న్యూస్ మరియు స్టోరీలలో పేర్కొన్న వాస్తవాలను చెక్ చేయడానికి ఉపయోగిస్తుంది. ఫేక్ న్యూస్ అప్పుడు ఫ్లాగ్ మరియు ఫిల్టర్ చేయబడుతాయి.

మీ వాట్సాప్ అకౌంట్‌లోని వీడియోలు, ఫోటోలు ఇతరులకు కనపించకూడదా..?

ఫేస్ బుక్ తన ఫ్లాట్ ఫాంలో 2016నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత ఫేక్ న్యూస్ బాగా స్ర్పెడ్ అయ్యాయి. దీంతో ఇప్పుడు ఫేస్ బుక్ ఫేక్ న్యూస్ ను వ్యాప్తి చేయడంలో యాక్టివ్ గా పాల్గొనే అకౌంట్స్ ను పర్యవేక్షిస్తుంది. యూజర్లు ఫేక్ న్యూస్ ను గుర్తించడానికి వినియోగదారులకు సహాయపడే ఫ్రింట్ యాడ్ ను కూడా పబ్లిష్ చేయనుంది. ఇది కూడా బ్లాగ్ పోస్ట్ లో పేర్కొన్న మూడు కీలక ప్రాంతాల్లో పనిచేస్తుంది.

• ఫేక్ న్యూస్ ను క్రియేట్ చేసేందుకు ఎకనామికల్ ఇంటెన్సివ్ లను డిస్ట్రబ్ చేయడం.

• ఫేక్ న్యూస్ స్ర్పెడ్ నిరోధించేందుకు న్యూ ప్రొడక్ట్స్ ను బిల్డింగ్ చేయడం.

• ఫేక్ న్యూస్ ను ఎదుర్కొంటున్నప్పుడు ప్రజలకు మరింత సమాచార నిర్ణయాలు తెలిపేందుకు సహాయం చేయడం.

Read more about:
English summary
Facebook has announced today that it will stop pages from using advertisement service that spread false news.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot