ఫేస్‌బుక్‌లో ఉన్న లోపం గురించి తెలుసా..?

Written By:

ఫేస్‌బుక్‌లో ఉన్న ఓ లోపాన్ని ఓ 18 ఏళ్ల కుర్రాడు క‌నిపెట్టాడు. అకౌంట్ రిక‌వ‌రీ ఫీచ‌ర్‌లో ఉన్న ఆ లోపం వ‌ల్లే ఎవ‌రైనా మన అకౌంట్ల‌లోకి సులువుగా వ‌చ్చే వీలున్న‌ట్లు గుర్తించాడు. అంతేకాదు అలా బ‌య‌టివాళ్లు మ‌న అకౌంట్‌లోకి వ‌చ్చినా అది మ‌నం గుర్తించ‌లేము కూడా. దీనికి పాస్‌వ‌ర్డ్‌తో కూడా ప‌నిలేద‌ని, మ‌న అకౌంట్‌ను మ‌న‌మే యాక్సెస్ చేసే చాన్స్ కూడా కోల్పోతామ‌ని ఇండిపెండెంట్‌లో వ‌చ్చిన ఓ క‌థ‌నం వెల్ల‌డించింది.

జియో మరో అద్బుతం, ఫోన్ టూ టీవీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

18 ఏళ్ల వ్య‌క్తి పేరు జేమ్స్ మార్టిన్‌డేల్‌

ఈ బ‌గ్‌ను గుర్తించిన ఆ 18 ఏళ్ల వ్య‌క్తి పేరు జేమ్స్ మార్టిన్‌డేల్‌. త‌న ఫోన్‌లో కొత్త సిమ్ కార్డ్ వేసిన‌ప్పుడు అత‌ను ఈ బ‌గ్‌ను గుర్తించాడు.

కొత్త సిమ్ వేయ‌గానే

కొత్త సిమ్ వేయ‌గానే ఫేస్‌బుక్ నుంచి అత‌నికి ఓ మెసేజ్ వ‌చ్చింది. కొంత సేప‌టి వ‌ర‌కు మీ అకౌంట్‌లో లాగ్ అవ‌లేదు అన్న‌ది ఆ మెసేజ్ సారాంశం. అయితే ఈ కొత్త నంబ‌ర్‌ను అకౌంట్‌కు యాడ్ చేయ‌క‌పోయినా.. ఈ మెసేజ్ రావ‌డం అత‌న్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఫేస్‌బుక్‌లో సెర్చ్ చేయ‌గా

దీంతో అత‌ను త‌న పాత‌ నంబ‌ర్‌పై ఫేస్‌బుక్‌లో సెర్చ్ చేయ‌గా.. ఒక అకౌంట్ వ‌చ్చింది. ఈ నంబ‌ర్‌ను యూజ‌ర్‌నేమ్‌గా చేసి.. ఓ రాండ‌మ్ పాస్‌వ‌ర్డ్‌తో లాగిన్ అవ‌డానికి ప్ర‌య‌త్నించినా.. అది సాధ్యం కాలేదు.

ఫ‌ర్‌గాట్ పాస్‌వ‌ర్డ్ ఆప్ష‌న్ సాయంతో

ఫ‌ర్‌గాట్ పాస్‌వ‌ర్డ్ ఆప్ష‌న్ సాయంతో త‌న అకౌంట్‌ను రిక‌వ‌ర్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించినా అందులోనూ ఫెయిల‌య్యాడు. అప్పుడు కొత్త నంబ‌ర్‌తో అత‌ను సెర్చ్ చేయ‌గా ఓ ఈమెయిల్ అడ్రెస్‌, ఆరు ఫోన్ నంబ‌ర్ల‌తో రిక‌వ‌రీ ఆప్ష‌న్స్ వ‌చ్చాయి.

పాస్‌వ‌ర్డ్ రీసెట్ కోడ్ కోసం

అయితే ఇందులో ఒక‌టి పాస్‌వ‌ర్డ్ రీసెట్ కోడ్ కోసం ఫేస్‌బుక్‌కు ఇచ్చిన నంబ‌ర్ ఉంది. అంత‌కుముందు ఆ నంబ‌ర్ నుంచే మార్టిన్‌డేల్ త‌న అకౌంట్‌లోకి లాగిన్ అవ‌డానికి ప్ర‌య‌త్నించాడు.

ఆ వ్య‌క్తి అకౌంట్‌లోకి

ఆ ఆప్ష‌న్ సెల‌క్ట్ చేసిన త‌ర్వాత అత‌ను ఆ వ్య‌క్తి అకౌంట్‌లోకి విజ‌య‌వంతంగా లాగిన్ అయ్యాడు. అప్పుడు ఫేస్‌బుక్ అత‌నికి పాస్‌వ‌ర్డ్ చేంజ్ ఆప్ష‌న్ ఇచ్చింది.

అస‌లు యూజ‌ర్

దీనివ‌ల్ల ఆ అస‌లు యూజ‌ర్ ఇక ఎప్ప‌టికీ త‌న అకౌంట్‌లోకి లాగిన అవ‌లేడు. ఆ త‌ర్వాత మార్టిన్‌డేల్ మ‌రో కొత్త నంబ‌ర్‌తో ఇలాగే ప్ర‌య‌త్నించ‌గా.. మ‌ళ్లీ అదే ఫ‌లితం ఎదురైంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook’s account recovery feature comes with a critical flaw, claims researcher Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot