Facebookలోకి కొత్త ఫీచర్,అన్నీ అప్లికేషన్స్ ఒకేసారి తొలగించుకోవచ్చు

Posted By: ChaitanyaKumar ARK

ఫేస్బుక్ ఈమద్యన అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంది. అందులో ముఖ్యమైనది ఫేస్బుక్ వినియోగదారుల వివరాలను, బ్రిటిష్ కన్సల్టన్సీ సంస్థ అయిన కేంబ్రిడ్జి అనలిటికా దుర్వినియోగం చేయడమే. అమెరికా అద్యక్షుడు ట్రంప్ గెలుపునకు ఈ సంస్థ దుశ్చర్యకు పాల్పడినట్లు వార్తలు వచ్చిన నేపధ్యంలో ఫేస్ బుక్ CEO మార్క్ జూకర్బర్గ్ కూడా క్షమాపణలు తెలుపుకోవలసిన పరిస్తితి నెలకొంది. ఇలాంటి గడ్డుకాలం గడుపుతున్న ఫేస్బుక్ మరొక సమస్యను కూడా ఎదుర్కొంటూ ఉంది, వినియోగదారులు తమ ఫేస్బుక్ అక్కౌంట్ ని తొలగించలంటూ #deletefecebook మూవ్మెంట్ కూడా ఆన్లైన్ లో జోరందుకుంది.

Facebookలోకి  కొత్త ఫీచర్,అన్నీ అప్లికేషన్స్ ఒకేసారి తొలగించుకోవచ్చు

కానీ ఫేస్బుక్ జరిగిన తప్పిదానికి ఎంతో చింతిస్తూ, క్షమాపణలు చెప్పిన తర్వాత వినియోగదారులను నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా కొన్ని రక్షణ చర్యలకు పూనుకుంది. వినియోగదారుల వివరాలకు పటిష్ట భద్రత ఏర్పరిచే దిశగా అడుగులు ముందుకు వేస్తూ ఉంది. తద్వారా ఫేస్బుక్ కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను ప్రవేశపెట్టింది వీటి ద్వారా ఫేస్బుక్ లో ఉన్న థార్డ్ పార్టీ అప్లికేషన్స్ మరియు ఆ అప్లికేషన్స్ ద్వారా చేయబడిన పోస్ట్స్ ను ఒకే సారి తొలగించుకునే సౌలభ్యం వినియోగదారులకు లభించింది. ఈ విషయాన్ని మొదటి సారిగా tech crunch తో పంచుకుంది.

నోకియా నుంచి ఒకేసారి మూడు స్మార్ట్‌ఫోన్లు విడుదలయ్యాయి, ధర, ఫీచర్లు ఇవే !

ఈ ఫీచర్ కు ధన్యవాదాలు తెలుపవచ్చు. ఈ నూతన సదుపాయంతో , వినియోగదారుడు నేరుగా ఫేస్బుక్ సెటింగ్స్ లో ఎడమ వైపున ఉన్న apps విభాగానికి వెళ్ళి, అక్కడ లిస్టు చేయబడి ఉన్న అప్లికేషన్స్ లో అనవసరమైనవిగా భావించిన వాటన్నిటినీ క్లిక్ చేసి, పైన కనిపించే రిమూవ్ బట్టన్ క్లిక్ చేయడం ద్వారా ఈ అప్లికేషన్స్ అన్నింటినీ ఒకేసారి తొలగించుకోవచ్చు. అప్లికేషన్స్ తొలగించే సమయంలో , ఈ అప్లికేషన్స్ ద్వారా చేయబడిన పోస్టులను తొలగించాలా? వద్దా? అని మీకు ప్రశ్న ఎదురవుతుంది. మీ నిర్ణయం ద్వారా ఆ పోస్టులను తొలగించుకునే సౌలభ్యం కల్పించబడింది. ఒక్కొక్క అప్లికేషన్ తొలగించుకునేందుకు అధిక సమయమే పడుతుంది, దీనిని దృష్టిలో ఉంచుకుని అన్నిటినీ ఒకే సారి తొలగించేలా ఫేస్బుక్ ఈ ఫీచర్ ను పొందుపరచడం జరిగింది.

అంతే కాకుండా, ఒకవేళ వినియోగదారుడు ఏదేని అప్లికేషన్ 3నెలల పాటు వినియోగించని ఎడల, అవి వాటికవే తొలగింపబడుతాయని కూడా చెప్పబడినది. వినియోగదారుల ప్రైవసీని దృష్టిలో ఉంచుకుని మరికొన్ని ప్రత్యేకమైన సెక్యూరిటీ ఫీచర్లను కూడా ప్రవేశపెడుతున్నామని ఆ సంస్థ అధికారి ఒకరు వెల్లడించారు.

Facebookలోకి  కొత్త ఫీచర్,అన్నీ అప్లికేషన్స్ ఒకేసారి తొలగించుకోవచ్చు

క్రితం నెల మార్చిలోనే ఫేస్ బుక్ లో అనేక నూతనమైన మార్పులు చేయబడ్డాయి. ముఖ్యంగా సెటింగ్స్ విభాగంలో మార్పులు చోటుచేసుకున్నాయి. పాత సెటింగ్స్ లో చిన్న టైటిల్ తో కూడుకుని 17ఆప్షన్స్ కలిగి ఉండేది , కొత్తగా మార్పు చేయబడిన సెటింగ్స్ లో ఒకే బానర్ కింద అన్నీ ఆప్షన్స్ కనిపించేలా, తద్వారా వినియోగదారుడు సులువుగా అర్ధం చేసుకునే విధంగా రూపుదిద్దబడింది.

మరియు ఫేస్బుక్ కొన్ని ప్రత్యేకమైన ప్రైవసీ షార్ట్ కట్స్ ను కూడా పొందుపరచడం జరిగింది. ఈ షార్ట్ కట్స్ ద్వారా వినియోగదారుడు ఎక్కువ శ్రమ వెచ్చించకుండానే తమ అకౌంట్ ప్రైవసీ సెటింగ్స్ అమర్పులు చేసుకునేలా మార్చబడింది. అంతేకాకుండా access your information అనే ఫీచర్ ద్వారా, వినియోగదారుడు తాను చేసిన పోస్ట్స్ లేదా recent social media activities గురించి తనిఖీ చేసేలా, మరియు అవి తమ ప్రైవసీకి , స్వేచ్చకి భంగంగా భావించిన ఎడల తొలగించే విధంగా వెసులుబాటు కల్పించబడినది.

English summary
Facebook recently found itself in hot water after the company's CEO Mark Zuckerberg admitted that the social media platform had shared data with British consultancy firm Cambridge Analytica.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot