ఫేస్‌బుక్‌లోకి కొత్త ఫీచర్, అన్‌ఫ్రెండ్ చేయలేని వారికి ఉపశమనం

By Hazarath
|

సోషల్ మీడియాలో తిరుగులేకుండా దూసురకుపోతున్న దిగ్గజం ఫేస్‌బుక్‌ తమ యూజర్ల కోసం మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. మన స్నేహితుల లిస్ట్ లోని పోస్టులను కాని వారిని కాని అన్‌ఫాలో లేదా అన్‌ ఫ్రెండ్‌చేయాల్సి అవసరం లేకుండానే తాత్కాలికంగా అన్‌ఫ్రెండ్‌ చేసే వెసులుబాటును కల్పిస్తోంది.

 

చైనాతో పాటు విదేశీ ఫోన్లకు చుక్కలు, ఒకే ఒక్క దెబ్బ !చైనాతో పాటు విదేశీ ఫోన్లకు చుక్కలు, ఒకే ఒక్క దెబ్బ !

స్నూజ్‌' అప్షన్‌

స్నూజ్‌' అప్షన్‌

ఫేస్‌బుక్‌లో కొంతమందిని అన్‌ఫ్రెండ్‌ చేయకుండానే వారి పోస్టులను తాత్కాలికంగా అంటే 30రోజులపాటు నిరోధించే అవకాశం కల్పించే ‘స్నూజ్‌' అప్షన్‌ను తీసుకొచ్చింది.

తాత్కాలింకంగా నియంత్రించేలా..

తాత్కాలింకంగా నియంత్రించేలా..

ఫేస్‌బుక్‌లో మన స్నేహితులను, పేజీలను లేదా గ్రూపులను తాత్కాలింకంగా నియంత్రించేలా ఈ సరికొత్త అవకాశాన్ని అందిస్తోంది.

ఫేస్‌బుక్‌ న్యూస్‌ఫీడ్‌లో 30 రోజులు

ఫేస్‌బుక్‌ న్యూస్‌ఫీడ్‌లో 30 రోజులు

తాజా ఫీచర్‌ ప్రకారం ఎవరి పోస్టులైనా మనకు తాత్కాలికంగా నచ్చకపోతే వారిని 30 రోజుల పాటు ఆపివేసే అవకాశాన్ని ఇపుడు కల్పిస్తోంది. అంటే ఫేస్‌బుక్‌ న్యూస్‌ఫీడ్‌లో 30 రోజులు మనకు నచ్చని వారి పోస్టులు మన దృష్టికిరావు.

నోటిషికేషన్‌..
 

నోటిషికేషన్‌..

ఈ గడువు అనంతరం 'తాత్కాలిక వ్యవధి' ముగిసే సమయానికి ఫేస్‌బుక్‌ మనకి నోటిషికేషన్‌ ఇస్తుంది. అనంతరం వారి పోస్టులు తిరిగి పొందాలనుకుంటే పునరుద్ధరించుకోవచ్చు లేదంటే మరో 30 రోజుల పాటు అదే ఆప్షన్‌ కొనసాగించవచ్చు.

ఫేస్‌బుక్‌ తన బ్లాగ్‌పోస్ట్‌లో

ఫేస్‌బుక్‌ తన బ్లాగ్‌పోస్ట్‌లో

ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ తన బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించింది. అయితే ఈ ఫీచర్ కొంతమందికి అందుబాటులోకి వచ్చింది. అందరికీ అందుబాటులోకి రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. 

Best Mobiles in India

English summary
Facebook's new Snooze button can mute annoying friends for 30 days More News at Telugu Gizbot

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X