Home
Social media

ఇది ఓ నమ్మకద్రోహం, నిజాయితీగా ఒప్పుకున్న ఫేస్‌బుక్ అధినేత

ఖాతాదారుల వ్యక్తిగత వివరాలను దుర్వినియోగపరుస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్ మరోసారి క్షమాపణలు చెప్పింది.

By Hazarath Aiah

ఖాతాదారుల వ్యక్తిగత వివరాలను దుర్వినియోగపరుస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్ మరోసారి క్షమాపణలు చెప్పింది. సంస్థ అధినేత మార్క్ జుకర్ బర్గ్ క్షమాపణ చెబుతున్నట్టు ఉన్న ప్రకటన బ్రిటన్, అమెరికా వ్యాప్తంగా వెలువడే ప్రముఖ పత్రికలన్నింటిలో ప్రత్యక్షమయ్యాయి. 'మీ సమాచారాన్ని భద్రంగా ఉంచాల్సిన బాధ్యత మాది. అలా చేయలేకపోతే.. మాకు అర్హత లేనట్లే' అని ఉన్న ప్రకటన కింద జుకర్‌బర్గ్‌ సంతకం ఉంది. ఈ విషయానికి సంబంధించి జుకర్ బర్గ్ రెండు రోజుల క్రీతమే క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే మరోసారి ఇలా పత్రికల ప్రకటనల ద్వారా క్షమాపణలు చెప్పడం విశ్వసనీయతను సంతరించుకుంది.

డేటా చౌర్యానికి కారణాలు తెలుపుతూ..

డేటా చౌర్యానికి కారణాలు తెలుపుతూ..

డేటా చౌర్యానికి కారణాలు తెలుపుతూ కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో రీసెర్చర్ గా ఉన్న ఓ వ్యక్తి ఫేస్ బుక్ కోసం 'క్విజ్' పేరిట ఓ యాప్ ను రూపొందించారని, దాని ద్వారానే డేటా దుర్వినియోగం అయిందని అన్నారు. ఇది నమ్మక ద్రోహమేనని అంగీకరించిన ఆయన, సమాచార భద్రత తమ బాధ్యతని, దాన్ని నెరవేర్చకుంటే ఈ స్థానానికి అనర్హులమని అన్నారు.

ప్రస్తుతానికి ఇంతకుమించి ఏమీ చేయలేని.

ప్రస్తుతానికి ఇంతకుమించి ఏమీ చేయలేని.

డేటా భద్రత తమ అత్యంత ప్రధానమైన కర్తవ్యమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి ఇంతకుమించి ఏమీ చేయలేని, చెప్పలేని స్థితిలో ఉన్నామని తెలిపారు. ఇండియా, అమెరికా సహా పలు దేశాల్లో ఎన్నికల వేళ ప్రజలను ప్రభావితం చేసేలా 5 కోట్ల ఫేస్ బుక్ ఖాతాలను కేంబ్రిడ్జి అనలిటికా దుర్వినియోగం చేసిందన్న విషయం బహిర్గతమై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఏదైనా యాప్ ను..

ఏదైనా యాప్ ను..

కాగా, ఏదైనా యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలంటే, ఫోన్ లోని మెసేజ్ లు, కాంటాక్టులకు యాక్సెస్ ఇవ్వాల్సి వుంటుందన్న సంగతి తెలిసిందే. ఈ తరహా యాప్ లను సైబర్ నేరగాళ్లు డెవలప్ చేసి ఉంటే, ఫోన్ లోని సమస్త సమాచారం వారి సర్వర్లలోకి వెళ్లిపోతుందని, ఈ యాప్ లతో జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రముఖ కంపెనీలు..

ప్రముఖ కంపెనీలు..

ఇప్పటికే ఈ విషయంపై అమెరికాలోని శాన్‌జోస్‌ కోర్టులో కేసు కూడా నమోదైంది. దీంతో ప్రముఖ కంపెనీలు తమ ఫేస్‌బుక్ ఖాతాను కూడా తొలగించుకున్నాయి. మొజిల్లా, టెస్లా, స్పేస్‌ఎక్స్‌ లాంటి ప్రముఖ కంపెనీలు కూడా ఫేస్‌బుక్‌ను గుడ్‌ బై చెప్పేశాయి.

టెస్లా, స్పేస్‌ఎక్స్‌ కంపెనీలు

టెస్లా, స్పేస్‌ఎక్స్‌ కంపెనీలు

ముఖ్యంగా లక్షలాది ఫాలోవర్లు ఉన్న టెస్లా, స్పేస్‌ఎక్స్‌ కంపెనీల ఫేస్‌బుక్‌ అకౌంట్లను తొలగించినట్టు ఎలన్‌ మస్క్‌ ప్రకటించడం కలకలం రేపింది. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో తన అభిప్రాయాలను ట్విట్‌ చేశారు.ఫేస్‌బుక్‌ అనేది ఒకటుందనేది తనకు తెలియందంటూ వ్యంగ్యంగా కామెంట్‌ చేశారు.

మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ ..

మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ ..

అటు ప్రముఖ సెర్చ్‌ ఇంజీన్‌ మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ కూడా తాము ఫేస్‌బుక్‌ నుంచి తాత్కాలికంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. అయితే మొజిల్లా తన ఖాతాను తొలగించనప్పటికీ.. ఇకపై ఈ ఖాతా నుంచి ఎలాంటి పోస్టులు చేయబోమని తెలిపింది. ‘ఫేస్‌బుక్‌ నుంచి బ్రేక్‌ తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.

వాట్సప్‌ సహ వ్యవస్థాపకుడు..

వాట్సప్‌ సహ వ్యవస్థాపకుడు..

ఇది ఇలా ఉంటే వాట్సప్‌ సహ వ్యవస్థాపకుడు బ్రెయిన్‌ ఆక్టన్‌ కూడా ‘ఇది ఫేస్‌బుక్‌ను డిలిట్‌ చేయాల్సిన సమయం' ట్వీట్‌తో డిలీట్‌ ఫేస్‌బుక్‌ ఉద్యమాన్ని రగిలించిన సంగతి తెలిసిందే.

ఫేస్‌బుక్ సారీ ప్రకటనలు..

ఫేస్‌బుక్ సారీ ప్రకటనలు..

కాగా ఫేస్‌బుక్ సారీ ప్రకటనలు బ్రిటన్.. అమెరికా ద్వారా వెలువడే అన్ని పత్రికల్లోనూ ప్రత్యక్షమయ్యాయి. తప్పును ఒప్పుకునే విషయంలో జుకర్ సరికొత్త పద్దతికి తెర తీశారనే చెప్పాలి. మరి.. జుకర్ యాడ్స్ వ్యూహం ఎంతవరకు వర్క్ వుట్ అవుతుందో చూడాలి.

Best Mobiles in India

English summary
Facebook's Zuckerberg says sorry to US, UK with newspaper ads; polls show trust in site is sinking More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X