అబద్దానికి వేగమెక్కువ,సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న న్యూస్

Written By:

సోషల్ మీడియా వచ్చిన తరువాత ఏది నిజమో మరేది అబద్దమో తెలియకుండానే న్యూస్ వైరల్ అవుతోంది. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే అసత్యాలు, పుకార్లనే జనం తొందరగా నమ్ముతారనే విషయం మరోసారి రుజువైంది. సామాజిక మాధ్యమం ట్వీటర్‌లో తప్పుడు రాజకీయ వార్తలు ఎంతో వేగంగా, వీలైనంత ఎక్కువమందికి చేరుతున్నాయనీ, వాటినే జనం నమ్ముతున్నారనీ ఓ సర్వేలో తేలింది. ఈ అధ్యయనం చేప ట్టిన మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన సొరొష్‌ వొసౌఘి ఈ వివరాలు వెల్లడించారు. ట్వీటర్‌లో వచ్చే వార్తల్లో అధికశాతం పుకార్లు, తప్పుడు వార్తలేనని రుజువైందని చెప్పారు. తప్పుడు వార్తలను ఎక్కువ మంది నమ్మి రీట్వీట్‌ చేస్తున్న కారణంగానే అవి వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి.

అదిరే ఫీచర్లతో మార్కెట్లోకి దూసుకొస్తున్న మోటో ఫోన్లు ఇవే,ఓ లుక్కేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్విట్టర్ లో 2006-2017 మధ్య కాలంలో..

దీని కోసం ట్విట్టర్ లో 2006-2017 మధ్య కాలంలో వచ్చిన 1,26,000 వార్తా కథనాలను పరిశీలించగా వీటిని దాదాపు 30 లక్షల మంది 45లక్షల సార్లు రీట్వీట్‌ చేసినట్లు గుర్తించారు. సమాచారాన్ని బట్టి, దాని తీవ్రతను బట్టి చూసినా..తప్పుడు సమాచారమే ఎక్కువ వేగంగా, ఎక్కువ మంది, ఎక్కువ సా ర్లు ట్వీట్‌ చేసినట్లు తేలింది.

70%వరకు రీట్వీట్‌..

నిజమైన సమాచారం కంటే తప్పుడు వార్తా సమాచారమే 70%వరకు రీట్వీట్‌ అయ్యింది. వాస్తవ వార్త 1500 మందికి చేరటానికి పట్టే సమయంలో ఆరోవంతు సమయంలోనే తప్పుడు సమాచారం వ్యాప్తి అవుతోంది.

 

 

సోషల్ మీడియాలో ఏవి పోస్ట్ చేయకూడదు!

అనుమతి లేకుండా.. మీ సన్నిహితులు, కుటుంబసభ్యులు ఇలా మీకు దగ్గరి వారికి సంబంధించిన ఏ విషయమైనా వారి అనుమతి లేకుండా షేర్ చేయకూడదు. ఉదాహరణకు మీ కొలీగ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు, మీ సోదరి ఉద్యోగం పొందినప్పుడు, లేదా మీ సన్నిహితుల ప్రైవసీ మేటర్స్ ను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో చర్చించడం, పోస్ట్ చేయడం చేయకూడదు.

పూర్తి ఆధారాలు లేకుండా..

పూర్తి ఆధారాలు లేకుండా ఏ వార్తను కూడా సోషల్ మీడియా వేదికపై షేర్ చేయకూడదు. ఉదాహరణకు ఎవరైనా సెలబ్రిటీ మరణ వార్తలను, లేదా ప్రజల్లో భయం పుట్టించే వార్తలను ఆధారాలు లేకుండా షేర్ చేయకూడదు.

కోరికలను..

అంతేకాదు కోరికలను సోషల్ మీడియా వాల్ పై పోస్ట్ చేయకూడదు.ఉదాహరణకు మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న అమ్మాయి వివరాలు, మీరు ప్రయాణించాలనుకుంటున్న స్థలాలు, మీరు చేసే పనులను సోషల్ మీడియాలో పంచుకోకూడదు.

ఎదుటి వారి వర్ణాన్ని

అలాగే ఎదుటి వారి వర్ణాన్ని, ఆకారాన్ని వెక్కిరిస్తూ జోక్స్ లాంటివి షేర్ చేయకూడదు. ఇలా చేయడం ద్వారా ఇతరుల మనోభావాలను గాయపరిచినట్లు అవుతుంది. ఇలాంటివి షేర్ చేస్తే మీ ఉద్యోగాలు సైతం ఊడిపోయే ప్రమాదం ఉంది.

పర్సనల్ ప్రాబ్లమ్స్‌

మీ పర్సనల్ ప్రాబ్లమ్స్‌ను కూడా షేర్ చేసుకోకూడదు. మీ ఆర్థిక ఇబ్బందులు, మీ ఇంట్లో వ్యక్తులకు ఉన్న వ్యాధులు లాంటివి సోషల్ మీడియాలో షేర్ చేయడం, ఒక రకంగా వారిని ఇబ్బంది పెట్టినట్లు అవుతుంది. ఏదైనా భావాన్ని పంచుకునేటప్పుడు, పూర్తిగా రాయండి, అంతేకానీ అర్థం కాకుండా అర్థరహితంగా భావం ఉండకూడదు. అలాంటివి మీ పట్ల వ్యతిరేక భావాన్ని కలుగ చేస్తాయి.

మీ కెరీర్ ను ఇబ్బందుల్లో పడేసే పోస్ట్ లు..

అలాగే మీ కెరీర్ ను ఇబ్బందుల్లో పడేసే పోస్ట్ లు కూడా చేయకూడదు. ఉదాహరణకు నాకు ఈ జాబ్ ఇష్టం లేదు. నేను విసిగిపోయాను, ఆఫీసులో బాసుల మీద జోకులు లాంటివి మీ కెరీర్, ఉద్యోగాన్ని ఇబ్బందులకు గురిచేస్తాయి.

వీడియో లింక్ లు సరైనవా..

మీరు షేర్ చేయాలనుకునే వీడియో లింక్ లు సరైనవా ? కాదా ? అనేది చెక్ చేసుకొని షేర్ చేయండి, నిర్ధారణ లేకుండా షేర్ చేస్తే ఇతర మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆ లింక్స్ లో మరే ఇతర కంటెంట్ ఉంటే ప్రమాదకరం.

మీ జీవితంలో ఎదురయ్యే అనుభవాలను

మీ జీవితంలో ఎదురయ్యే అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తతో వ్యవహరించాలి. ఎలాంటి విషయాలు పంచుకోవచ్చు,. పంచు కోకూడదు అనే విచక్షణతో పాటు ఇతరుకులకు మనం చెప్పే మాటలు ఉపయోగపడేలా ఉండాలి. అన్నింటికన్నా ముందు మీరు చెప్పే , లేదా షేర్ చేసే విషయాలు నిజాలై ఉండాలి.

కామెంట్స్ పోస్ట్ చేసేటప్పుడు

కామెంట్స్ పోస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రాసినవారి మనస్సు నొప్పించకుండా జాగ్రత్త పడాలి. అంతే కాదు కామెంట్స్ వారి వ్యక్తిత్వాన్ని కించపరచకూడదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
False news spreads faster than truth online thanks to human nature More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot