ఫేస్‌బుక్ మీ కాల్స్,మెసేజులను సంగ్రహిస్తుందా, పరిష్కారం మార్గం తెలుసుకోండి

Posted By: ChaitanyaKumar ARK

ఈ మద్య ఫేస్బుక్ ఆండ్రాయిడ్ మొబైల్స్ లో కాల్స్ హిస్టరీ, కాంటాక్ట్స్ మరియు మెసేజెస్ ను సంగ్రహిస్తుందని ఒక రూమర్ ఎక్కువగా చక్కర్లు కొట్టింది. దీనికి సంబంధించి ఫేస్బుక్ CEO, మార్క్ జూకర్బర్గ్ ఆ రూమర్ కు ఊతమిచ్చేలా చేసిన పోస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఒక కలకాలాన్నే సృష్టించిందని చెప్పవచ్చు. తద్వారా ప్రజలలో అనేక భద్రతాపరమైన అనుమానాలు రేకెత్తాయి అని వేరే చెప్పనవసరంలేదు. ఇలాంటి రూమర్ చక్కర్లు కొడుతున్న సమయంలోనే, ఈ వివరాలను కేవలం వినియోగదారుల పనితీరు మెరుగుపరచడానికే సంగ్రహిస్తున్నాము అని ఫేస్బుక్ పేర్కొంది. మరియు ఈ సమాచారాన్ని ఏ ఇతర అప్లికేషన్లతో పంచుకోవడంలేదని, ఈ వివరాలను సొమ్ము చేసుకునే అవసరం ఫేస్బుక్ కు లేదనీ, వినియోగదారుల భద్రతకు ఎక్కువ విలువనిస్తామని, అందుకే ఫేస్ బుక్ ఇందరి ఆదరాభిమానాలు చూరగొన్నదని పేర్కొన్నారు. మరియు కాల్ లాగ్, sms లో పొందుపరచిన వివరాలను సంగ్రహించడం లేదని కూడా పేర్కొంది. అయినా ఈ ప్రశ్న ఉత్పన్నమయింది కనుక ఎందరో దీని గురించిన సందేహాలను కలిగి ఉంటారు. వారికోసం ఈ క్రింది పద్దతిని పొందుపరచడం జరిగినది.

జియో ప్రైమ్ వద్దనుకుంటున్నారా, అయితే ఈ బెస్ట్ ఆఫర్లు మీ కోసమే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్స్

స్టెప్ 1 : మీ pc లేదా లాప్టాప్ నుండిhttps://register.facebook.com/download/ ను ఓపెన్ చేయండి .

స్టెప్ 2: ఇది మీ general account settings మెనూ తెరుస్తుంది. ఇక్కడ download a copy లింక్ మీద క్లిక్ చేయండి.

స్టెప్ 3 : తద్వారా download your information అను పేజీ కి తీసుకునివెళ్ళబడుతారు. ఇక్కడ share my archive ఆప్షన్ కనిపిస్తుంది. దీనిని క్లిక్ చేయడం ద్వారా మీ డేటా డౌన్లోడ్ చేయడానికి సిద్దం చేయబడుతుంది. ఒక్కసారి పూర్తయిన తర్వాత download archive ఆప్షన్ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది.

స్టెప్ 4 : ఈ డేటా .zip ఫైల్ రూపంలో డౌన్లోడ్ చేయబడుతుంది. ఈ ఫైల్స్ ను ఎక్స్ట్రాక్ట్ చేయడం ద్వారా ఒక ఫోల్డర్ లోనికి కాపీ చేయబడుతాయి. తర్వాత ఎడమ వైపు మీ ప్రొఫైల్ ఫోటో కింద HTML and contact_info అని కనిపిస్తుంది.

స్టెప్ 5 : దీనిని క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ల్ డౌన్ చేసి ఫేస్ బుక్ తీసుకున్న కాల్స్ మరియు SMS వివరాలను చూడవచ్చు.

 

ఫేస్బుక్ మీ డేటా సంగ్రహించకుండా ఆపండిలా:

ఫేస్బుక్ మీ వివరములను, డేటా సింక్ ఎనేబుల్ చేసినప్పుడు మాత్రమే తీసుకొనగలదు. ఒకవేళ మీరు కనుక ఈ డేటా సంగ్రహించడాన్ని ఆపివేయాలని భావిస్తే, దీనిని టర్న్ ఆఫ్ చేయవచ్చు. దీనికోసం మీరు మీ home page నందు పైన కుడిభాగం వైపు కనిపిస్తున్న ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేసి., అక్కడ people -> synced contacts నకు వెళ్ళవలసి ఉంటుంది. ఫేస్ బుక్ lite యూసర్స్ 3lines ఐకాన్ మీద క్లిక్ చేసి App Settings → Continuous Contacts Upload నకు వెళ్లవలసి ఉంటుంది. ఇక్కడ మీరు sync calls మరియు text హిస్టరీ లో మార్పులను చేయగలరు.

 

 

Manage Imported Contacts

లేదా మెసెంజర్ పేజీ నుండి Manage Imported Contacts విభాగంనుండి అప్లోడ్ అయిన కాంటాక్ట్స్ అన్నింటినీ డెలీట్ బట్టన్ ద్వారా తొలగించుకునే సౌలభ్యం ఉంది. మరియు continuous syncing ఆప్షన్ ను మీకు సంబంధించిన అన్నీ డివైజులలో టర్న్ ఆఫ్ చేయడం ద్వారా మీ డేటా ఫేస్బుక్ వినియోగించకుండా చూసుకోవచ్చు.

 

ప్రజలకు భద్రతను ఇవ్వడంలో..

ఫేస్బుక్ నమ్మకం అనే పునాదులపై నిర్మించబడిన సౌధం, ప్రజలకు భద్రతను ఇవ్వడంలో ఎల్లప్పుడూ ముందు ఉంటుంది. కానీ ఈ మద్య కాస్త గడ్డుకాలం నడుస్తున్నదనే చెప్పవచ్చు. కేంబ్రిడ్జ్ అనలిటికా నుండి ప్రారంభమయిన సమస్య, కొత్త కొత్త రూమర్లను సృష్టిస్తూ నెమ్మదిగా వినియోగదారుల నమ్మకాలకు దూరమవుతూ వస్తుంది . త్వరలోనే ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం లభిస్తుంది అని ఫేస్బుక్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to find your call and SMS data collected by Facebook and stop it More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot