ఫేస్‌బుక్‌ వద్దనుకుంటున్నారా, దాన్ని మించిన సైట్లు మీకోసం రెడీగా ఉన్నాయి

|

ఈ మధ్య కాలంలో ఫేస్‌బుక్ మీద అనేక రకాలైన వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. కేంబ్రిడ్జి ఎనాలిటికా ప్రకంపనలతో ఫేస్‌బుక్ ఒక్కసారిగా పాతాళానికి దిగజారిపోయింది. మార్కెట్లో దాని వాల్యూ కుప్పకూలిపోయింది. ఈ నేపథ్యంలో చాలామంది ఫేస్‌బుక్ అకౌంట్ ని డిలీట్ చేయాలని పిలుపునిస్తున్నారు. టెక్ దిగ్గజాలు సైతం ఈ ఫేస్‌బుక్ అకౌంట్లను డిలీట్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. డేటా సమాచారం లీక్ కావడంపై ఫేస్‌బుక్ అధినేత జుకర్ బర్గ్ సారీ చెప్పినప్పటికీ దానికంటిన మచ్చ పోవడం లేదు. డేటా ఎక్కడ మళ్లీ లీకవుతుందోనని చాలామంది ఫేస్‌బుక్ వద్దని ట్విట్టర్లోకి మళ్లారు. ట్విట్టర్ వేదికగా తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. అయితే ఫేస్‌బుక్ డిలీట్ చేస్తే ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా అని చాలామంది వెతుకుతున్నారు. అలాంటి వారి కోసం కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

 

ఫేస్‌బుక్‌ను చిక్కుల్లోకి నెట్టేసిన 5 సందర్భాలు..ఫేస్‌బుక్‌ను చిక్కుల్లోకి నెట్టేసిన 5 సందర్భాలు..

ELLO.co

ELLO.co

ఇది యుఎస్ లో మూడు సంవత్సరాల నుంచి చాలా పాపులర్ అయిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం. అయితే ఫేస్ బుక్ రాకతో ఇది కొంచెం వెనకకు వెళ్లింది. ఇప్పుడు ఫేస్ బుక్ పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లడంతో ఇది మళ్లీ పుంజుకుంది. అందరూ దీని మీద తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో మీ డేటాకు ఎటువంటి భగం వాటిల్లదని కంపెనీ చెబుతోంది. ఈ సైటు వేరే వాళ్లు కొనుగోలు చేసినా మీ వ్యక్తిగత వివరాలకు భరోసా ఉంటుంది.

VERO.co

VERO.co

ఈ సైటు ద్వారా మీరు చెప్పాలనుకున్నది ఎంతమందికి చేరిందనే రివ్యూలు కూడా ఉంటాయి. ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి దూసుకువస్తున్న సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఇది. ఇందులో మీరు మీకు నచ్చనది రాసుకోవచ్చు.

DIGG.com
 

DIGG.com

ఇది పూర్తిగా న్యూస్ కి సంబంధించిన ఫ్లాట్ పాం. మీకు న్యూస్ మీద ఆసక్తి ఉంటే ఈ సైటు ద్వారా మీ భావాలను పంచుకోవచ్చు. ఇందులో అనేక రకాలైన వీడియోలు స్టోరీలు మీకు అందుబాటులో ఉంటాయి.

RAFTR.com

RAFTR.com

దీన్ని మాజీ యాహూ ప్రెసిడెంట్ Susan Decker డెవలప్ చేశారు. దీని ద్వారా యూజర్లు తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా షేర్ చేసుకోవచ్చు. లాగిన్ సమయంలో మీ దగ్గర నుంచి కొంత డేటా అడిగే అవకాశం ఉంది. అయితే ఇది చాలా ప్రైవసీతో కూడుకుని ఉంటుంది.

 

 

SIGNAL / TELEGRAM

SIGNAL / TELEGRAM

ఇందులో మీరు గ్రూప్ ఛాట్ చేసుకోవచ్చు. ఇవి కేవలం మెసేజ్ లు మాత్రమే పంపే అవకాశం ఉంటుంది. గ్రూప్ కమ్యూనిటీల్లో మీరు అనుకున్నది పంపుకోవచ్చు. లైకులు, కామెంట్లు లాంటివి నేరుగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

www.idka.com

www.idka.com

ఇది కూడా ఓ సోషల్ మీడియా సైటు. దీని ద్వారా మీరు మీ భావాలను, అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Five alternatives to Facebook if you decide to delete your account More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X