ఇంటర్నెట్ నుంచి శాస్వుతంగా నిష్క్రమించాలనుకుంటున్నారా..?

అయితే ఒక్కసారి ఆలోచించుకోండి..

|

ఇంటర్నెట్ నుంచి శాస్వుతంగా నిష్క్రమించాలనుకుంటున్నారా..? ఇంటర్నెట్‌లో మీకు సంబంధించిన డేటాను క్లియర్ చేయటమనేది పూర్తిగా సాధ్యం కాకపోయినప్పటికి 95% వరకు డేటాను మీరు క్లియర్ చేసుకునే అవకాశముంది.

 

మన శాస్త్రవేత్తలు, వారి సంచలనాలుమన శాస్త్రవేత్తలు, వారి సంచలనాలు

ఒక్కసారి ఆలోచించుకోండి..

ఒక్కసారి ఆలోచించుకోండి..

ఇంటర్నెట్ ద్వారా ఆన్‌లైన్ అకౌంట్‌లను ఓపెన్ చేసి ఉంటారు. వీటి ద్వారా అనేక కార్యకలాపాలు నిర్వహించి ఉంటారు. ఈ క్రమంలో అనేక పరిచయాలను మీరు పెంచుకుని ఉండొచ్చు. ఒక్కసారిగా వీటిని తెంచుకునే ముందు ఆలోచించటం మంచిది. ఎందుకంటే, ఒక్కసారి క్లోజ్ చేసిన అకౌంట్‌ను అదే పేరుమీద మళ్లీ రీస్టార్ట్ చేయటమనేది కష్టమైన ప్రక్రియ.

సోషల్ మీడియా అకౌంట్స్..

సోషల్ మీడియా అకౌంట్స్..

ఇప్పటికే మీరు ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్ వంటి ప్రముఖ సోషల్ సైట్‌లలో అకౌంట్‌లను ఓపెన్ చేసుకుని ఉండి ఉంటారు. మీరు ఇంటర్నెట్ నుంచి పూర్తిగా నిష్ర్కమించే క్రమంలో ఈ అకౌంట్‌ల నుంచి పూర్తిగా డీయాక్టివేట్ కావల్సి ఉంటుంది.

బలమైన కారణాన్ని చూపాలి..
 

బలమైన కారణాన్ని చూపాలి..

సోషల్ మీడియా అకౌంట్‌ల నుంచి పూర్తిగా డీలిట్ అవ్వటం అంత సులువేమి కాదు. కాబట్టి మీ సమాచారం పూర్తిగా డిలీట్ అయ్యేందుకు ఆస్కారం ఉండదు. ఓ ఆన్‌లైన్ అకౌంట్‌ను పూర్తిగా డిలీట్ చేయాలంటే బలమైన కారణాన్ని చూపాల్సి ఉంటుంది. కాబట్టి, ముందస్తుగా జాగ్రత్తగా మీ అకౌంట్స్ తాలుకా చాటింగ్ హిస్టరీని పూర్తిగా క్లియర్ చేసేయండి.

మీకు బ్లాగ్స్ లేదా వెబ్‌సైట్‌లు ఉన్నట్లయితే..

మీకు బ్లాగ్స్ లేదా వెబ్‌సైట్‌లు ఉన్నట్లయితే..

ఇంటర్నెట్‌లో మీకంటూ వ్యక్తిగత బ్లాగ్స్ లేదా వెబ్‌సైట్‌లు ఉన్నట్లయితే వాటిని పూర్తిగా డిలీట్ చేసే ప్రయత్నం చేయండి.

నెట్‌వర్క్ ప్రొవైడర్ వద్ద మీ డేటా...

నెట్‌వర్క్ ప్రొవైడర్ వద్ద మీ డేటా...

మీకు సంబంధించిన వివరాలను కస్టమర్ డేటాబేస్‌లో ఫీడ్ చేసే అవకాశముంది. ఈ డేటా ఇంటర్నెట్‌లో కనిపించే అవకాశం ఉంది కాబట్టి సంబంధిత ప్రొవైడర్‌ను సంప్రదించి, మీ తాలుకా డేటాను తొలగించమని చెప్పండి.

మెయిల్ అకౌంట్స్ పూర్తిగా...

మెయిల్ అకౌంట్స్ పూర్తిగా...

మీ తాలుకా మెయిల్ అకౌంట్‌లను పూర్తిగా డీయాక్టివేట్ చేసి, అన్ని మెయిలింగ్ లిస్ట్‌లను క్యాన్సిల్ చేసుకోండి. గూగుల్, యాహూ, బింగ్ వంటి ప్రముఖ సెర్చ్ ఇంజిన్‌లలో మీ బ్రౌజింగ్ హిస్టరీని పూర్తిగా క్లియర్ చేసుకోండి.

ఇంటర్నెట్ హిస్టరీని తొలగించటంతో పాటు..

ఇంటర్నెట్ హిస్టరీని తొలగించటంతో పాటు..

ఇంటర్నెట్‌లో మీ బ్రౌజింగ్ తాలుకా హిస్టరీ అలానే కుకీలను తొలగించటంతో పాటు ఇంటర్నెట్ ప్రోగ్రామ్‌ను రిమూవ్ చేయండి. ఇంటర్నెట్‌లో మీరు రాసిన న్యూస్ ఆర్టికల్స్, మీరు చేసిన కామెంట్స్, బ్లాగ్ ఐటమ్స్ ఇంకా ఆడియో ఫైల్స్‌ను తొలిగించటమనేది అసాధ్యం. అలానే మీరు ప్రభుత్వానికి ఇచ్చిన వ్యక్తిగత సమాచారాన్ని కూడా తొలగించలేరు.

Best Mobiles in India

English summary
Follow this Simple Trick to Delete Yourself from the Internet Completely. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X