గూగుల్ సీఈఓని ముప్పతిప్పలు పెడుతున్న ప్రశ్న !

By Hazarath
|

ఈ మధ్య ఓ నెటిజన్ సంధించిన ప్రశ్న గూగుల్ సుందర్ పిచాయ్‌ని తెగ ఆకర్షించింది. అందరూ తమ పనులను వదిలేసి ముందు దీనికి సమాధానం చెప్పండి అనే ట్వీట్ చేసేదాకా ఈ ఫన్నీ పోస్టు వెళ్లింది. మరి ఆయన్ని అంతలా ఆకర్షించిన ట్వీటుపై ఓ లుక్కేయండి..

 

4100mAh బ్యాటరీతో నోకియా2 వచ్చేసింది, కేవలం రూ. 6999కే !4100mAh బ్యాటరీతో నోకియా2 వచ్చేసింది, కేవలం రూ. 6999కే !

బర్గర్‌లో చీజ్ ముక్క ఎక్కడుండాలి

బర్గర్‌లో చీజ్ ముక్క ఎక్కడుండాలి

బర్గర్‌లో చీజ్ ముక్క ఎక్కడుండాలి ? టమాటా, ప్యాటీ స్లైస్‌ల‌కు కిందా ? లేక టమాటా, ప్యాటీ స్లైస్‌ల‌ మధ్యలోనా ? ఇప్పుడీ ఈ ప్రశ్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఆయనకు ఆ ప్రశ్న అంతుచిక్కడం లేదు.

ఏ ఆర్డర్‌లో పెడతారు ?

ఏ ఆర్డర్‌లో పెడతారు ?

ఇక బర్గర్‌లో టమాటా, ఆనియన్, ప్యాటీ, చీజ్, లెట్యూస్ స్లైస్‌ల‌ను ఏ ఆర్డర్‌లో పెడతారు ? అని చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్రంగా చ‌ర్చించుకుంటున్నారు.

 థామస్ బేక్‌డల్ అనే వ్యక్తి ట్వీట్..
 

థామస్ బేక్‌డల్ అనే వ్యక్తి ట్వీట్..

అయితే ఇది మొదటగా ప్రారంభమైంది థామస్ బేక్‌డల్ అనే వ్యక్తి ట్వీట్ వల్ల..! ఆపిల్‌కు చెందిన డివైస్‌లలో ఉండే బర్గర్ ఎమోజీలో చీజ్ స్లైస్‌ టమాటా, ప్యాటీల మధ్యలో ఉంటుంది. అదే గూగుల్‌కు చెందిన డివైస్‌లలో అయితే అదే బర్గర్ ఎమోజీలో టమాటా, ప్యాటీల కింద చీజ్ స్లైస్‌ ఉంటుంది. అనే ప్రశ్నను ట్విట్టర్ ద్వారా సంధించాడు.

కాస్తా వైరల్ అయి..

కాస్తా వైరల్ అయి..

ఆ ట్వీట్ కాస్తా వైరల్ అయి అది గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ దాకా చేరడంతో వెంటనే ఆయన తన ట్విట్టర్‌లో అకౌంట్‌లో దాన్ని పోస్ట్ పెట్టారు.

అన్ని పనులు వదిలేసి..

అన్ని పనులు వదిలేసి..

మిగిలిన అన్ని పనులు వదిలేసి అసలు బర్గర్‌లో చీజ్ స్లైస్‌ ప్లేస్‌మెంట్ ఎక్కడ ఉండాలి అనే సమస్యను ముందుగా పరిష్కరించండి, దీనిపై సోమవారం మాట్లాడుకుందాం ! అని పిచాయ్ ట్వీట్ చేశారు.

Image source : Entertainmentbio.Us

ట్వీట్ కూడా తెగ వైరల్..

ట్వీట్ కూడా తెగ వైరల్..

దీంతో ఆ ట్వీట్ కూడా తెగ వైరల్ అవుతోంది. మరి ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటారా ? లేదా ? అన్నది పిచాయ్ తదుపరి ట్వీట్లతో తెలిసే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Google CEO Pichai discusses the cheese in burger more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X