Home
Social media

విరాట్ కోహ్లీపై అదిరిపోయే ట్వీట్ చేసిన BCCI

ఇండియా క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు వినిపిస్తున్న ఒకే ఒక పేరు విరాట్ కోహ్లీ. ఇప్పుడున్న ఆటగాళ్లలో బెస్ట్ బ్యాట్స్ మెన్ గా అందరిచేత మన్ననలు అందుకుంటూ టీమ్ ఇండియాకి పెద్ద దిక్కుగా మారాడు.

ఇండియా క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు వినిపిస్తున్న ఒకే ఒక పేరు విరాట్ కోహ్లీ. ఇప్పుడున్న ఆటగాళ్లలో బెస్ట్ బ్యాట్స్ మెన్ గా అందరిచేత మన్ననలు అందుకుంటూ టీమ్ ఇండియాకి పెద్ద దిక్కుగా మారాడు. మహేంద్ర సింగ్ ధోని తర్వాత ఇండియా క్రికెట్ ప్రస్థానాన్ని ఏ మాత్రం కిందకు జారనీయకుండా ముందుకు తీసుకువెళుతున్నారు. ప్రస్తుత క్రికెటర్లతో ఏ విధంగా పోల్చి చూసినా కోహ్లీని అందుకునే వారే లేరని అతడి గణాంకాలే చెబుతాయి. పరుగుల యంత్రంగా పేరు తెచ్చుకున్న రికార్డుల రారాజు కోహ్లీ పుట్టినరోజు నేడు. 30 ఏట అడుగుపెడుతున్న కోహ్లీకి సహచరులు, బీసీసీఐ, ఇతర సన్నిహితుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.

బీసీసీఐ ట్వీట్

30వ వసంతంలోకి అడుగుపెడుతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరిన్ని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాలని కోరుకుంటూ పరుగుల యంత్రం కోహ్లికి అభినందనలు తెలుపుతూ'-బీసీసీఐ ట్వీట్ చేసింది. టీమిండియా ఆటగాళ్లు ఎంఎస్ ధోని, జడేజా, జస్ప్రిత్ బుమ్రాలు కోహ్లికి విషెస్‌ చెప్పిన ఓ వీడియోను సైతం బీసీసీఐ పోస్ట్ చేసింది.

సచిన్ తర్వాత..

సచిన్ తర్వాత..

వెస్టిండీస్‌తో ఇటీవల విశాఖలో జరిగిన రెండో వన్డేలో విరాట్‌ కోహ్లీ 10వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఫీట్ నమోదు చేసిన 5వ భారత క్రికెటర్ కాగా, ఓవరాల్‌గా 13వ ఆటగాడు. అయితే వన్డేల్లో సచిన్‌ 259 ఇన్నింగ్సుల్లో పదివేల పరుగుల మార్కు చేరుకోగా, కోహ్లీ కేవలం 205 ఇన్నింగ్స్‌ల్లో, ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ 10 వేల పరుగుల మార్క్ అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. వన్డే, టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్‌కు సొంతం చేసుకున్నాడు.

 

 

సెహ్వాగ్ ట్వీట్

కోహ్లీ బర్త్‌డే విషెస్‌ను డాషింగ్ ప్లేయర్ సెహ్వాగ్ తనదైన శైలిలో చెప్పాడు. ‘నేడు దంతేరాస్‌.. ఈ ఏడాదంతా నీకు రన్‌తేరాస్‌ కావాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే విరాట్'అని వీరేంద్ర సెహ్వాగ్‌ ట్వీట్ చేశాడు.

 

 

మహ్మద్‌ కైఫ్‌ ట్వీట్

నీ చేతిలోని మ్యాజిక్‌ స్టిక్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తూ స్థిరత్వానికే కొత్త అర్థం చెప్పిన కెప్టెన్.. నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా.. హ్యాపీ బర్త్‌డే కోహ్లి' అని మహ్మద్‌ కైఫ్‌ విష్ చేశాడు.

 

 

 

Best Mobiles in India

English summary
Guess who just revealed Virat Kohli's love for PUBG.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X