ఫేస్‌బుక్ మాయలో పిట్టల్లా రాలుతున్న ప్రాణాలెన్నో, జాగ్రత్తగా లేకుంటే అంతే !

ఫేస్‌బుక్..ఇదొక పెద్ద మాయా ప్రపంచం. ఒక్కసారి దీనిలోకి ఎంటర్ అయ్యామంటే బయటకు రావడమనేది కలలో మాట.

|

ఫేస్‌బుక్..ఇదొక పెద్ద మాయా ప్రపంచం. ఒక్కసారి దీనిలోకి ఎంటర్ అయ్యామంటే బయటకు రావడమనేది కలలో మాట. 24 గంటలు దానిలో గడిపేవారికి కొదవే లేదు. ఎక్కడో దూరంగా ఉన్నవారు దగ్గరగా ఉన్నారనే భావనను ఫేస్‌బుక్ కలిగిస్తుంది. అదే ఇప్పుడు అందరి కొంపలు ముంచుతోంది. దాని మాయలో పడి మోసపోయిన వారు జీవితాల్ని అర్థంతరంగా బలి తీసుకుంటున్నారు. దీని వెనుక వారు పడిన సంఘర్షణకు ప్రధాన కారణం ఫేస్‌బుక్ అన్నది బహిరంగ సత్యం. ఒక్క ఫేస్‌బుక్ మాత్రమే కాదు వాట్సప్, ట్విట్టర్, మెసెంజర్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా యాప్స్ యూజర్లకు మాయని మచ్చని మిగుల్చుతున్నాయి. అదే సమయంలో ఈ సోషల్ మీడియా యాప్స్ జనాలకు మంచి చేస్తున్నాయనే వాదనను కొట్టి పారేయలేం. అయితే మంచి కన్నా చెడు వైపే జనాలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారన్నది పచ్చి నిజం. ఇప్పటికైనా తగు జాగ్రత్తలు పాటించకపోతే ఇంకా ఘోరమైన ఫలితాలు చవిచూడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వారు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు. అవేంటో చూడండి.

షియోమి గుడ్ న్యూస్, శాశ్వత ఓపెన్ సేల్‌ మీద Redmi 5షియోమి గుడ్ న్యూస్, శాశ్వత ఓపెన్ సేల్‌ మీద Redmi 5

ఆన్‌లైన్ స్నేహం ..

ఆన్‌లైన్ స్నేహం ..

పరిచయం లేనివారితో ఆన్‌లైన్ స్నేహం చేయకపోవడమే మంచిది. అలాంటి వారికి దూరంగా ఉండటం చాలా మంచిది. తర్వాత ఏదైనా జరగరానిది జరిగితే మంచిచెడు తెలుసుకోవడానికి ఎలాంటి సమాచారం దొరకదు. దీంతో పాటు ఐడీ కార్డులు, మీ వివరాలు, కనిపించే ఫొటోలు ఫేస్‌బుక్‌లో పెట్టకపోవడమే శ్రేయస్కరం. వాటివల్ల అనర్థాలే ఎక్కువ వస్తాయి.

ఇబ్బంది పెట్టే కామెంట్లు..

ఇబ్బంది పెట్టే కామెంట్లు..

మీరు ఫ్రెండ్స్ ఫొటోలు వారికి తెలియకుండా ఫేస్‌బుక్‌లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టవద్దు. అది వేరేవాళ్ల చేతికి చిక్కితే ఇద్దరూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే స్నేహితుల పోస్టుల మీద తీవ్రంగా స్పందించడం, వారిని ఇబ్బంది పెట్టే కామెంట్లు పెట్టడం వంటివి కూడా చేయకండి. అవి పెను ప్రమాదాన్ని మోసుకొచ్చే అవకాశం ఉంది.

ఫేక్ అకౌంట్లతో..

ఫేక్ అకౌంట్లతో..

ఎక్కువమంది స్నేహితుల కోసం వచ్చిన ప్రతీ ఫ్రెండ్ రిక్వెస్టును యాక్సెప్ట్ చేయడం కూడా మంచిది కాదు. రిక్వెస్ట్ పెట్టినవాళ్లు మీకు తెలిసిన వాళ్లయితేనే ఓకే చేయండి. లేకుంటే వారి అకౌంట్లలో పోస్ట్ చేసిన విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకోవడం మంచింది. ముఖ్యంగా ఫేక్ అకౌంట్లతో చాలా జాగ్రత్తగా ఉండండి.

అప్‌డేటెడ్‌..

అప్‌డేటెడ్‌..

మీరు మీ ఫేస్‌బుక్‌ని ఫ్రెండ్స్‌తో టచ్‌లో ఉండడం కోసం, సోషల్ మీడియాలో అప్‌డేటెడ్‌గా ఉండడానికి మాత్రమే ఫేస్‌బుక్ ఉపయోగించండి. ఇతరులను అవమానపరిచే పోస్టులకు లైకులు, కామెంట్లు కొట్టకండి. అలాగే అందరికీ తెలిసేలా ఫోన్ నెంబర్లు, చిరునామా, ఫొటోలు ఫేస్‌బుక్‌లో పెట్టొద్దు. అది చాలా ప్రమాదం.

లావాదేవీలు ..

లావాదేవీలు ..

ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తులతో లావాదేవీలు జరుపడం, విందులు, వినోదాలకు వెళ్లడం చేయకండి.ఫేస్‌బుక్‌లో ఉండే సెట్టింగులను వాడండి. అవి మీ ప్రైవసీని కాపాడుతాయి. తరచుగా మీ పాస్‌వర్డ్ మారుస్తూ ఉండండి. హ్యాకర్లకు చిక్కకుండా ఉంటారు.

టైం..

టైం..

ఫేస్‌బుక్ చూడడానికి, కామెంట్లకు, మెసేజ్‌లకు రిైప్లె ఇవ్వడానికి ఒక టైం నిర్ణయించుకోండి. ఎక్కువ టైం ఫేస్‌బుక్ వాడడం వల్ల మీ సమయమే కాదు, ఆరోగ్యం కూడా పాడవుతుంది. వీలయినంతవరకు దూరంగా ఉండేందుకే ప్రయత్నించండి.

ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది..

ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది..

ఆడ, మగ ఇద్దరూ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా బిజీ అయిపోయారు. ఆ బిజీలో వారు ఏం చేస్తున్నారో తెలుసుకోకుండా ఆ మాయలో చిక్కుకుని అనుకోని సంఘటనల ఫలాన్ని అనుభవిస్తున్నారు. వీటివల్ల అమ్మాయిలు ఎంత నష్టపోతున్నారో, అబ్బాయిలు కూడా అంతే నష్టపోతున్నారు.వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

Best Mobiles in India

English summary
Happy or sad, be careful what you post on Facebook More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X