Home
Social media

యాప్స్ వాడుతున్నప్పుడు ఫోన్ డేటా ఆదా అవ్వాలా..?

By Bommu Sivanjaneyulu

సోషల్ మీడియా వినియోగం రోజురోజుకు విస్తరిస్తోంది. ముఖ్యంగా నేటి యువత సామాజిక మాద్యమాలకు మరింతగా కనెక్ట్ అవుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లు చేతుల్లోకి వచ్చాక ప్రతిక్షణాన్ని, ప్రతి సందర్భాన్ని పోస్టులు, ట్వీట్లు, అప్‌డేట్లతోనే ఆస్వాదిస్తున్నారు.

How to Save Data When Using Your Favorite Social Media Apps

ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ రోజుకో కొత్త అప్‌డేట్‌ను తీసుకువస్తూ సోషల్ మీడియా వినియోగం పై మరింత మక్కువను పెంచుతున్నాయి. సోషల్ మీడియా యూసేజ్ పెరుగుతోన్న కొద్ది మొబైల్ డేటా వినియోగం కూడా పెరుగుతూ వస్తోంది.

ఒక నిర్థిష్టమైన అవగాహనతో సోషల్ మీడియా సైట్‌లను వినియోగించునే ప్రయత్నం చేసినట్లయితే అటు డేటా ఆదా అవటంతో పాటు ఇటు ఆసక్తి కూడా పెరుగుతుంది. సోషల్ మీడియా యాప్స్‌ను ఫోన్‌లో వినిగిస్తున్నపుడు డేటాను మరింతగా ఆదా చేసుకునేందుకు పలు తీరైన మార్గాలు..

Facebook వాడుతున్నపుడు..

Facebook వాడుతున్నపుడు..

సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. వీరిలో అత్యధిక మంది యూజర్లు రోజుకు ఒకసారైన తమ అకౌంట్‌లను ఓపెన్ చేసి చూస్తున్నట్లు ఓ అంచనా.

ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను ఓపెన్ చేసే ప్రతిసారి ఎంతోకొంత మొబైల్ డేటా ఖర్చవుతూనే ఉంటుంది. ఫేస్‌బుక్ అకౌంట్‌లను రోజు గంటల తరబడి వినియోగించుకునే యూజర్లు యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Data saver optionను ఆన్ చేసుకున్నట్లయితే మొబైల్ డేటా ఆదా అవుతుంది.

Instagram వాడుతున్నప్పుడు..

Instagram వాడుతున్నప్పుడు..

ఫేస్‌బుక్ తరహాలోనే ఇన్‌స్టాగ్రామ్ యాప్‌కు కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉంది. ఈ ఫోటో షేరింగ్ యాప్‌లోని కొన్ని ఫీచర్లు మొబైల్ డేటాను విపరీతంగా ఖర్చుచేస్తన్నట్లు ఓ అంచనా.

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లను గంటల తరబడి వినియోగించుకునే యూజర్లు మొబైల్ డేటాను పొదుపుగా వాడుకునే క్రమంలో యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Use Less Data ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే తక్కువ డేటాను యాప్ ఖర్చు చేస్తుంది.

 Snapchat వాడుతున్నప్పుడు..

Snapchat వాడుతున్నప్పుడు..

మొబైల్ డేటాను అమితంగా ఖర్చు చేస్తోన్న యాప్‌లలో స్నాప్‌చాట్ కూడా ఒకటి. అనేక డేటా కన్స్యూమింగ్ ఫీచర్లను కలిగి ఉన్న ఈ యాప్‌లో సెట్టింగ్స్‌ను అడ్జస్ట్ చేసుకోవటం ద్వారా డేటాను ఆదా చేసుకునే వీలుంటుంది.

మొబైల్ డేటాను ఆదా చేసుకునేందుకు మరిన్ని చిట్కాలు..

మొబైల్ డేటాను ఆదా చేసుకునేందుకు మరిన్ని చిట్కాలు..

వై-ఫై ఇంటర్నెట్ కనెక్షన్‌ను వాడటం వల్ల మొబైల్ డేటా వినియోగాన్ని మరింతగా తగ్గించుకోవచ్చు. ఆ పైగా, మొబైల్ డేటాతో పోలిస్తే వై-ఫై డేటా మరింత చవక. ఆన్‌లైన్ వీడియో గేమ్స్ ఎక్కువ డేటాను ఖర్చు చేస్తాయి. కాబట్టి మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌లైన్ వీడియో గేమింగ్‌కు బదులు ఆఫ్‌లైన్ వీడియో గేమింగ్‌కు ప్రాధాన్యతనివ్వండి.

మీ ఫోన్‌లో ఎక్కువ డేటాను ఖర్చు చేస్తున్న అప్లికేషన్‌లను పరిమితం చేయండి. Settingsలోకి వెళ్లి Data usageను చూసినట్లయితే ఏ యాప్ ఎంతంత డేటాను ఖర్చు చేస్తుందో అర్థమవుతుంది. అవసరంలేనపుడు 3జీ, 4జీ కనెక్షన్‌లను టర్నాఫ్ చేయండి. ఇలా చేయటం వల్ల డేటాను పొదుపుగా వాడుకోవచ్చు. ఇలా చేయాలంటే settings>Wireless &Networks>More>Mobile Networks>Data Connection.

Best Mobiles in India

English summary
How to Save Data When Using Your Favorite Social Media Apps. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X