Home
Social media

రూ. 83 లక్షల ప్యాకేజి ఉద్యోగం, ఆన్‌లైన్‌‌లో అప్లయి చేయడం ఎలా ?

ఇప్పుడు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది సాదా సీదా వార్త కాదు. ఓ కంపెనీ ఉద్యోగం కోసం ఇచ్చిన ప్రకటన.

By Hazarath Aiah

ఇప్పుడు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది సాదా సీదా వార్త కాదు. ఓ కంపెనీ ఉద్యోగం కోసం ఇచ్చిన ప్రకటన. ట్రావెలింగ్ అంటే ఇష్టపడేవారి కోసం ఓ విదేశీ కంపెనీ పేపర్లలో ఉద్యోగం కల్పిస్తామంటూ ప్రకటన ఇచ్చింది. అన్ని దేశాలు తిరుగుతూ విభిన్న సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి మెక్సికోలోని విదాంతా రిసార్ట్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోమని చెబుతోంది.

ఏడాదికి 83 లక్షల రూపాయల వేతనం..

ఏడాదికి 83 లక్షల రూపాయల వేతనం..

ఈ ఉద్యోగం వస్తే ఏడాదికి 83 లక్షల రూపాయల వేతనం, బీచ్‌ అందాల్ని ఆస్వాదించేలా రిసార్టుల్లో ఉచిత బస, దేశదేశాలు తిరిగే ఛాన్స్‌ వస్తుంది.

విందు వినోదాలకు..

విందు వినోదాలకు..

ఇక విందు వినోదాలకు కొదవే లేదు. పైసా ఖర్చు లేకుండా ప్రపంచ ప్రసిద్ధ వంటకాల్ని లొట్టలేసుకుంటూ తినొచ్చు. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాలను సందర్శించవచ్చు.

అడవుల్లో షికారు..

అడవుల్లో షికారు..

సాహసం చేసే స్వభావం ఉంటే అడవుల్లో షికారు కొడుతూ వేటాడే సరదా తీర్చుకోవచ్చు. మంచం మీద నుంచి కాలు కింద పెట్టకుండా బెడ్‌ కాఫీ, బ్రేక్‌ ఫాస్ట్‌.. బాడీకి మసాజ్‌ల కోసం సకల సౌకర్యాలతో ఉండే స్పాలు, సరస్సుల పక్కన విహారం ఇంకా ఎన్నో అవకాశాలను కంపెనీ కల్పిస్తోంది.

అంతులేని ఆనందం అంతా..

అంతులేని ఆనందం అంతా..

ఈ భూమి మీద ఉన్న అంతులేని ఆనందం అంతా ఈ ఒక్క ఉద్యోగంతో మీ సొంతమవుతుందని విదాంతా గ్రూప్‌ ఎగ్జిక్యూటిక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఇవాన్‌ చావెజ్‌ అంటున్నారు.

పర్యాటకుల్ని ఆకర్షించే నైపుణ్యం..

పర్యాటకుల్ని ఆకర్షించే నైపుణ్యం..

ఈ ఉద్యోగానికి అర్హతలేంటని అనుకుంటున్నారా? సోషల్‌ మీడియాలో మీకు నేమ్, ఫేమ్‌ ఉండాలి. పర్యాటకుల్ని ఆకర్షించే నైపుణ్యం మీ సొంతమైతే చాలు.

www.worldsbestjob.com

www.worldsbestjob.com

ఈ ఉద్యోగానికి మీరు అర్హులు అనుకుంటే www.worldsbestjob.com వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అవండి. ఉద్యోగానికి ధరఖాస్తు చేసుకోండి.

అక్టోబర్‌ 21లోగా..

అక్టోబర్‌ 21లోగా..

ఒక బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఆ రిసార్టుల బిజినెస్‌ పెంచే బాధ్యతను మీరే తీసుకోవాలి. అక్టోబర్‌ 21లోగా ఈ కొత్త ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రపంచంలో దీనిని మించిన ఉద్యోగమే లేదట

ప్రపంచంలో దీనిని మించిన ఉద్యోగమే లేదట

కాగా ఇదేమీ సాదాసీదా ఉద్యోగం కాదు. ప్రపంచంలో దీనిని మించిన ఉద్యోగమే లేదట. విదాంతా గ్రూప్‌ ‘ప్రపంచంలో అత్యుత్తుమ ఉద్యోగం' అంటూ జారీచేసిన ప్రకటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

లక్ ఉంటే ఆ జాబు మీకే రావచ్చు

లక్ ఉంటే ఆ జాబు మీకే రావచ్చు

సో.. మీరు ఇటువంటి క్వాలిఫికేషన్లు కలిగి ఉంటే వెంటనే కంపెనీ వెబ్ సైట్ లోకి లాగిన్ అయి ఉద్యోగానికి అప్లయ్ చేయండి. లక్ ఉంటే ఆ జాబు మీకే రావచ్చు. ఆల్ ది బెస్ట్..

Best Mobiles in India

English summary
how to apply rs 83 lakh package job in online viral in social media more new at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X