వాట్సాప్‌లో Fake అకౌంట్స్‌ను గుర్తించటం ఎలా..?

నకిలీ వాట్సాప్ అకౌంట్‌లను గుర్తించే 5 సులువైన మార్గాలు

|

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నకిలీ అకౌంట్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లలో నకిలీ అకౌంట్‌లను క్రియేట్ చేయటం చాలా సులువు. మోసపూరిత ఉద్దేశ్యంతో రూపొందించబడే ఈ అకౌంట్‌లకు దూరంగా ఉండటం చాలా మంచిది. నకిలీ వాట్సాప్ అకౌంట్‌లను గుర్తించే 5 సులువైన మార్గాలు...

 Spoof నెంబర్లు ఆధారంగా

Spoof నెంబర్లు ఆధారంగా

ఇటీవల కాలంలో Spoof నెంబర్లు ఆధారంగా నకిలీ వాట్సాప్ అకౌంట్లు పుట్టుకొస్తున్నాయి. సాధారణ మొబైల్ నెంబర్లతో పోలిస్తే స్పూఫ్ నెంబర్లు చాలా విభిన్నంగా ఉంటాయి. ఇటువంటి గుర్తు తెలియని నెంబర్ల నుంచి మీకు సడెన్గా మెసేజ్ వచ్చినట్లయితే, అది నకిలీ వాట్సాప్ అకౌంట్ నుంచి వచ్చిన మెసేజ్‌గా భావించండి.

 1 నెంబర్‌తో వచ్చే...

1 నెంబర్‌తో వచ్చే...

+1 నెంబర్‌తో వచ్చే వాట్సాప్ మెసెజ్‌లను కూడా నకిలీ వాట్సాప్ మెసెజ్ లుగా గుర్తించాల్సి ఉంటుంది. ఇటువంటి ఫేక్ నెంబర్స్ ఎక్కువుగా voxox app ద్వారా క్రియేట్ చేయబడతాయి. కాబట్టి, +1 నెంబర్‌తో వచ్చే వాట్సాప్ మెసెజ్‌లను ఏ మాత్రం విశ్వసించకండి.

+44 నెంబర్‌తో వచ్చే

+44 నెంబర్‌తో వచ్చే

+44 నెంబర్‌తో వచ్చే వాట్సాప్ మెసెజ్‌లను కూడా నకిలీవిగానే పరిగణించాల్సి ఉంటుంది. Fw calls అనే U.K బేసిడ్ వెబ్‌సైట్ ద్వారా ఈ +44 వాట్సాప్ నెంబర్స్ జనరేట్ అవుతుంటాయి.

ప్రొఫైల్ ఫోటో స్థానంలో..

ప్రొఫైల్ ఫోటో స్థానంలో..

ప్రొఫైల్ ఫోటో స్థానంలో కార్టూన్ బొమ్మగాని, మరేదైనా విభన్నమైన ఆకారం గాని లేకంటే ఏ విధమైన ఫోటో లేకుండా, స్టేటస్ స్థానంలో 'Hey there! I'm using WhatsApp' అని ఉన్నట్లయితే అది దాదాపుగా నకిలీ అకౌంటే అవుతుంది. కాబట్టి ఇటువంటి వాట్సాప్ అకౌంట్స్‌ను నకిలీవిగానే పరిగణించాల్సి ఉంటుంది.

కొన్ని కొన్ని సందర్భాల్లో ...

కొన్ని కొన్ని సందర్భాల్లో ...

కొన్నికొన్ని సందర్భాల్లో ఫేక్ వాట్సాప్ అకౌంట్‌లను గుర్తించటం చాలా కష్టతరమవుతుంది. కాబట్టి గుర్తు తెలియని వాట్సాప్ అకౌంట్ నెంబర్‌తో చాట్‌చేసే ముందు ఒకటికి 10 సార్లు గర్తుంచుకోండి.

Best Mobiles in India

English summary
How to know if a WhatsApp number is fake. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X