వాట్సప్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ గురించి తెలుసుకోండి

ఇండియాలో 2019 సార్వత్రిక సమరం వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజాలు అలర్ట్ అయ్యాయి. ప్రధానంగా ఫేక్ న్యూసులపై దృష్టి సారించాయి. ఎన్నికల్లో ఫేక్ న్యూస్ వైరల్ అవుతుండటం వల్ల అనే

|

ఇండియాలో 2019 సార్వత్రిక సమరం వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజాలు అలర్ట్ అయ్యాయి. ప్రధానంగా ఫేక్ న్యూసులపై దృష్టి సారించాయి. ఎన్నికల్లో ఫేక్ న్యూస్ వైరల్ అవుతుండటం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. కాగా ఫేక్ న్యూస్ అనేది ఇండియాలో ఇప్పుడు ఓ పెద్ద సమస్యగా మారిపోయింది.

వాట్సప్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ గురించి తెలుసుకోండి

సుమారు రెండేళ్లుగా భారతదేశంలో ఫేక్ న్యూస్ సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. తప్పుడు వార్తలు, కథనాలు, సమాచారంతో అనేక దారుణాలు కూడా జరిగాయి. మూకదాడులు, మూకహత్యలకు ఈ ఫేక్ న్యూస్ కారణమైంది. వీటిని నిరోధించేందుకు దిగ్గజాలు సరికొత్త సెక్యూరిటీ ఫీచర్లను అందిస్తున్నాయి. ఇందులో భాగంగా వాట్సప్ మరో అడుగు ముందుకేసింది. సరికొత్త ఫీచర్ ని తీసుకురాబోతోంది.

ఫేక్ న్యూస్ ఎక్కువగా సర్క్యులేట్

ఫేక్ న్యూస్ ఎక్కువగా సర్క్యులేట్

ఈ మధ్య వాట్సప్‌లో ఫేక్ న్యూస్ ఎక్కువగా సర్క్యులేట్ కావడంతో దాని ప్రతిష్ట మసకబారింది. దాంతో ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వివాదంలో చిక్కుకుంది. ఈ ఫేక్‌న్యూస్ అడ్డుకోవడానికి వాట్సప్ చర్యలు మొదలుపెట్టింది.

ఐదుగురి కంటే ఎక్కువగా

ఐదుగురి కంటే ఎక్కువగా

ఫార్వర్డ్ మెసేజ్‌కు 'Forwarded' లేబుల్, ఐదుగురి కంటే ఎక్కువగా ఫార్వర్డ్ మెసేజ్‌లు పంపే అవకాశం లేకపోవడం లాంటి కొత్త ఫీచర్లన్నీ ఫేక్ న్యూస్ అడ్డుకోవడం కోసం తీసుకువచ్చింది.

రివర్స్ ఇమేజ్ సెర్చ్

రివర్స్ ఇమేజ్ సెర్చ్

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ను తీసుకొస్తోంది. అదే రివర్స్ ఇమేజ్ సెర్చ్. త్వరలో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనుండటం, ఎన్నికల్లో ఫేక్‌న్యూస్ ఎక్కువగా సర్క్యులేట్ అయ్యే అవకాశం ఉండటంతో వాట్సప్ ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది.

Search image

Search image

WABetainfo సమాచారం ప్రకారం వాట్సప్ బీటా 2.19.73 అప్‌డేట్‌లో 'Search image' ఫీచర్ కనిపిస్తుంది. మీకు వాట్సప్‌లో ఏదైనా ఫోటో వస్తే అది నిజమో కాదో తెలుసుకునేందుకు ఈ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు

గూగుల్‌లో అలాంటి ఇమేజెస్

గూగుల్‌లో అలాంటి ఇమేజెస్

మీకు వచ్చిన ఫోటోను క్లిక్ చేసి 'Search image' పైన క్లిక్ చేస్తే నేరుగా గూగుల్‌లో అలాంటి ఇమేజెస్ ఏవైనా ఉంటే చూపిస్తుంది. దాన్ని బట్టి ఆ ఫోటో ఎక్కడిది? ఎప్పుడు తీశారు? మీకు వచ్చిన ఫోటోలో ఉన్న సమాచారం నిజమేనా? ఇవన్నీ తెలుసుకోవచ్చు.

టెస్టింగ్ దశలో ...

టెస్టింగ్ దశలో ...

ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. దీని ద్వారా మీరు ఫేక్ న్యూస్‌ను సులభంగా గుర్తించొచ్చు. అది తప్పుడు సమాచారం అని, తప్పుడు వార్తలని తెలిస్తే మీరు ఫార్వర్డ్ చేయకుండా అడ్డుకోవచ్చని వాట్సప్ తెలిపింది.

Best Mobiles in India

English summary
Elections 2019: WhatsApp may soon help you find out if an image received is fake or real

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X