సోషల్‌మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్‌ను కనిపెట్టే కొత్త టెక్నాలజీ ఇదే

ప్రొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రతి ఒక్కరు చేసే పని స్మార్ట్ ఫోన్ తో కాలక్షేపం చేయడం.అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచమే మన చేతిలో ఉన్న విధంగా ఫీల్ అవుతుంటారు.

By Anil
|

ప్రొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రతి ఒక్కరు చేసే పని స్మార్ట్ ఫోన్ తో కాలక్షేపం చేయడం.అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచమే మన చేతిలో ఉన్న విధంగా ఫీల్ అవుతుంటారు. ఈ నేపథ్యం లో సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ఫేక్ న్యూస్ ల వళ్ళ కలిగే నష్టాలు అన్ని ఇన్ని కావు . ఈ మధ్య ఫేక్ న్యూస్ లు రావడం మరీ ఎక్కువ అయిపోయాయి.సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ నిజమో కాదో తెలుసుకునే అవకాశం ఇప్పటివరకు లేకపోవడం వలన ఆ వార్తలను నిజమని నమ్మిన కొందరు భావోద్వేగాలకు లోనవుతున్నారు.అయితే ఈ ఇబ్బందుల్ని తొలగించడానికి సోషల్ మీడియా లో వచ్చే న్యూస్ లు నిజామా లేక ఫేక్ అన్ని తెలియచెప్పే టెక్నాలజీ ఒకటి త్వరలో రాబోతుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.....

 

మైసూరు చెందిన 21 ఏళ్ల లిరిక్‌ జైన్‌...

మైసూరు చెందిన 21 ఏళ్ల లిరిక్‌ జైన్‌...

మైసూరు చెందిన 21 ఏళ్ల లిరిక్‌ జైన్‌ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసాడు . గత ఏడాది Logically అనే పేరుతో ఒక స్టార్టప్‌ కంపెనీ ఏర్పాటు చేశాడు.అమెరికాలోని MIT(Massachusetts Institute of Technology),బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన నిపుణులతో 10లక్షల పౌండ్ల పెట్టుబడితో దీనిని ఏర్పాటు చేశారు.

మొట్టమొదటి ఇంటెలిజెంట్‌ న్యూస్‌ ఫీడ్‌ కంపెనీ...

మొట్టమొదటి ఇంటెలిజెంట్‌ న్యూస్‌ ఫీడ్‌ కంపెనీ...

బ్రిటన్‌లో మొట్టమొదటి ఇంటెలిజెంట్‌ న్యూస్‌ ఫీడ్‌ కంపెనీ కూడా ఇదే. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ లను గుర్తించడమే దీని పని. బ్రిటన్,అమెరికా, ఇండియాలలో ప్రస్తుతం ఈ కంపెనీకి 38 మంది సిబ్బంది ఉండగా త్వరలో రెట్టింపు చేస్తామని లిరిక్‌ జైన్‌ తెలిపారు.

ఈ టెక్నాలజీ నిజమైన వార్తలను నిర్థారిస్తుంది....
 

ఈ టెక్నాలజీ నిజమైన వార్తలను నిర్థారిస్తుంది....

ఈ టెక్నాలజీ సోషల్ మీడియా లో వచ్చే న్యూస్ లను వడబోసి నిజమైన వార్తలను నిర్థారిస్తుంది.సోషల్ మీడియాలో ఏదైనా స్టోరీ లేదా మెసేజ్ రాగానే ఈ ఫ్లాట్‌ఫాం 70వేలకు పైగా డొమైన్ల నుంచి వాటికి సంబంధించిన స్టోరీలను కలెక్ట్ చేస్తుంది . ప్రతి స్టోరీను పూర్తిగా పరిశీలించాక మెషీన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్‌ను ఉపయోగించి ఆ స్టోరీ కరెక్ట్ గా ఉందా లేదా లేకపోతే దాని వెనుక ఏదైనా రాజకీయ ప్రయోజనాలేమైనా ఉన్నాయా మరియు స్టోరీలో ఇచ్చిన statistics సరైనవేనా కాదా అన్నది పరిశీలించి ఆ వివరాలను బహిర్గతం చేస్తుంది. దానిని బట్టి వినియోగదారుడు ఆ కథనం నిజమైనదో లేక ఫేక్ న్యూస్ అని నిర్థారించుకుంటాడు.

ప్రస్తుతం ప్రయోగదశలో ఉంది....

ప్రస్తుతం ప్రయోగదశలో ఉంది....

ఈ పరిజ్ఞానం ప్రస్తుతం ప్రయోగదశలో ఉందని,వచ్చే సెప్టెంబర్‌లో అమెరికా, బ్రిటన్‌లలో అందుబాటులో ఉంటుంది. అయితే ఇండియాలో మాత్రం వచ్చే అక్టోబర్ లో ఈ టెక్నాలజీ ను ప్రవేశపెట్టబోతున్నట్టు లిరిక్ జైన్ తెలిపారు.

భారత దేశంలో 20 కోట్ల మందికిపైగా వాట్సాప్‌ ....

భారత దేశంలో 20 కోట్ల మందికిపైగా వాట్సాప్‌ ....

భారత దేశంలో 20 కోట్ల మందికిపైగా వాట్సాప్‌ వినియోగదారులున్నారు.ఇటీవల వాట్సాప్‌లో వస్తున్న అసత్య ప్రచారాలు,ఫేక్ స్టోరీలు అల్లర్లకు, హత్యలకు దారితీస్తున్నాయి. ‘వాట్సాప్‌లో వస్తున్న కథనాలు, వార్తలు ఉద్రేకపూరితంగా, భావోద్వేగాలను రెచ్చగొట్టేవిగా ఉంటున్నాయి. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వం ఆ స్టోరీలు అసలైనవో కాదో తెలుసుకోవడానికి, అవాస్తవ స్టోరీలను నియంత్రించడానికి చాలా సమయం పడుతోంది.అయితే ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ లోపాన్ని అధిగమించడం కోసం సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్ని అప్పటి కప్పుడే వడపోసే అవకాశాల కోసం అన్వేషించి ఈ ఏడాది చివర్లో దీనికి సంబంధించిన పక్కా ప్రణాళికల్ని ప్రకటిస్తున్నట్టు జైన్‌ తెలిపారు.

Best Mobiles in India

English summary
An Indian-origin entrepreneur's UK-based start-up that uses a machine-learning algorithm to sift fact from fiction is set to combat fake news around the world, including plans for a project specifically targeted at India.Lyric Jain, a Cambridge University engineering student originally from Mysore, set up Logically last year and has since developed the West Yorkshire-based start-up into a machine-learning platform to filter real from fiction.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X