ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్తగా QR కోడ్‌ ఫీచర్!!! మరొకరి ప్రొఫైల్ ఓపెన్ చేయడం మరింత సులభం...

|

పేస్ బుక్ యాజమాన్యంలో గల సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు కొత్త కొత్త అప్ డేట్ లను అందుకుంది. వాట్సాప్ మాదిరిగానే వినియోగదారులకు QR కోడ్‌లను రూపొందించే ఫీచర్ ను అందిస్తున్నది. దీని ద్వారా వినియోగదారులు నేరుగా తమకు ఇష్టమైన వారి యొక్క ప్రొఫైల్‌లను చూడడానికి అనుమతిస్తుంది.

ఇన్‌స్టాగ్రామ్‌ QR కోడ్ ఫీచర్
 

ఇన్‌స్టాగ్రామ్‌ QR కోడ్ ఫీచర్

ఇన్‌స్టాగ్రామ్‌లోని QR కోడ్‌ యొక్క కొత్త ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్‌లోనే కాకుండా ఏదైనా కెమెరా యాప్ ద్వారా స్కాన్ చేయవచ్చు. ఈ కొత్త ఫీచర్ ప్రత్యేకించి వ్యాపార-యజమానులకు ప్రయోజనకరంగా ఉంటుంది. వీరు వారి యొక్క QR కోడ్‌లను ముద్రించి సంభావ్య వినియోగదారులకు నేరుగా పంపవచ్చు. ఏదైనా మూడవ పార్టీ కెమెరా యాప్ లతో కోడ్‌ను స్కాన్ చేసినప్పుడు వినియోగదారుడి యొక్క ఇన్‌స్టాగ్రామ్ అకౌంటుకు నేరుగా మళ్ళించబడతారు. వారు తనని అనుసరించవచ్చు, బ్రౌజ్ చేయవచ్చు లేదా సమాచారం కోసం తనిఖీ చేయవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్  నేమ్‌ట్యాగ్ ఫీచర్

ఇన్‌స్టాగ్రామ్ నేమ్‌ట్యాగ్ ఫీచర్

ఇన్‌స్టాగ్రామ్ యొక్క నేమ్‌ట్యాగ్ ఫీచర్ కు సారూప్యంగా ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉంది. అయితే ఇది ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మాత్రమే స్కాన్ చేయగల అంతర్గత క్యూఆర్ కోడ్‌లను అనుమతించింది. స్నాప్‌చాట్ 2015లో ప్రసిద్ధ స్నాప్‌కోడ్ ఎంపికను ప్రారంభించింది. ఇది ఫోన్ కెమెరాను ఉపయోగించి స్నేహితులను జోడించడానికి ఉపయోగించబడుతుంది. గత నెలలో వాట్సాప్ బిజినెస్ కూడా క్యూఆర్ కోడ్‌ ఫీచర్ ను ప్రారంభించింది. వినియోగదారులు వ్యాపార ప్రతినిధితో సులభంగా చాట్ చేయడానికి క్యూఆర్ కోడ్‌ చాలా సులభంగా వీలు కల్పిస్తుంది.

మీ QR కోడ్‌ను సృష్టించడం ఎలా?

మీ QR కోడ్‌ను సృష్టించడం ఎలా?

ఇన్‌స్టాగ్రామ్‌లో QR కోడ్‌ను రూపొందించడానికి మీ యొక్క ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లోని మెనూ ఎంపికను ఓపెన్ చేసి అందులో QR కోడ్‌ ఎంపికపై క్లిక్ చేయండి. మీరు QR కోడ్‌కు బదులుగా నేమ్‌ట్యాగ్ ఎంపికను చూస్తే కనుక ఇన్‌స్టాగ్రామ్‌ను ఇంకా అప్ డేట్ చేయలేదు అని అర్థం. ఈ క్రొత్త ఫీచర్ దశలవారిగా వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.

QR కోడ్ ఎంపికను క్లిక్ చేసిన తర్వాత
 

QR కోడ్ ఎంపికను క్లిక్ చేసిన తర్వాత

QR కోడ్ ఎంపికను క్లిక్ చేసిన తర్వాత వినియోగదారులు బ్యాక్ గ్రౌండుని అనుకూలీకరించవచ్చు. నేమ్‌ట్యాగ్ ఫీచర్ వలె ఇది కూడా పనిచేస్తుంది. మీరు అందుబాటులో ఉన్న కలర్ ల నుండి బ్యాక్ గ్రౌండ్ ను ఎంచుకోవచ్చు లేదా ఎమోజి నమూనాను ఎంచుకోవచ్చు. వినియోగదారులు ఒక సెల్ఫీని క్లిక్ చేసి దానిని బ్యాక్ గ్రౌండ్ నమూనాగా కూడా ఉపయోగించవచ్చు. ఎమోజీని ఎంచుకోవడం ఖరారు అయిన తర్వాత సంభావ్య అనుచరులకు పంపడానికి సేవ్ లేదా స్క్రీన్‌షాట్ తీసుకోండి లేదా ప్రింట్ చేయండి వంటివి ఎంచుకోవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Instagram Allows QR Code Feature to Open Users Profiles Quickly  

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X