ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయిన సంగతి తెలుసా ?
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఫేస్‌బుక్ దాని అనుబంధ సంస్థలు ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ సేవలు కొన్ని గంటటల పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో స్తంభించిపోయాయి.
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఫేస్‌బుక్ దాని అనుబంధ సంస్థలు ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ సేవలు కొన్ని గంటటల పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో స్తంభించిపోయాయి. అమెరికా, కెనడా, యూరప్‌లతో పాటు ఇండియాలో కూడా కొన్ని గంటల పాటు సేవలు నిలిచిపోయాయి. డౌన్ డిటెక్టర్ డేటా ఆధారంగా.. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.15 గంటల ప్రాంతంలో సేవలు ఆగిపోయాయి. సోషల్ మీడియా సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా తమ అసంతృప్తిని తెలియజేశారు.

లాగిన్‌తోపాటు, పోస్టింగ్ సమస్యలు ..
ఫేస్‌బుక్ వినియోగదారులు లాగిన్‌తోపాటు, పోస్టింగ్ సమస్యలు ఎదుర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తాము ఇటీవల పోస్ట్ చేసిన ఫొటోలు/సందేశాలు కనబడకపోవడంతో నెటిజన్లు ఆందోళన చెందారు.

వాట్సప్‌లోనైతే..
వాట్సప్‌లోనైతే మెసేజ్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ట్విటర్‌ను ఆశ్రయించిన నెటిజన్లు ఫేస్‌బుక్ నువ్వు ఎక్కడికి వెళ్లావు, ఫేస్‌బుక్ డౌన్.. లాంగ్ లీవ్ ట్విటర్.. అంటూ తమ సమస్యలను షేర్ చేశారు.

రెండు గంటలకుపైగా..
దాదాపు రెండు గంటలకుపైగా ఈ సమస్య కొనసాగినట్టుగా తెలుస్తోంది. ట్విట్టర్ వేదికగా నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు వేశారు.

అధికార ప్రతినిధి స్పందిస్తూ
దీనిపై ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి జే నాన్‌కర్రో స్పందిస్తూ.. సమస్య తలెత్తగానే తాము వెంటనే స్పందించామని, వీలైనంత త్వరగా సేవలు పునరిద్ధరించామని తెలిపారు. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications








