Instagram లో కొత్త Maps ఫీచ‌ర్‌.. ఇక లొకేష‌న్స్ సెర్చింగ్ చాలా సులువు!

|

ప్ర‌ముఖ సామాజిక మాధ్య‌మం ఇన్‌స్టాగ్రామ్ త‌మ యూజ‌ర్లను ఆక‌ట్టుకునేందుకు నిత్యం ఏదో ఒక కొత్త ఫీచ‌ర్‌పై ప్ర‌యోగాలు చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ కొత్త మ్యాప్ ఫీచర్‌ను త‌మ ప్లాట్‌ఫాంకు జోడించేందుకు స‌న్నాహాలు చేస్తోంది. గూగుల్ మ్యాప్స్ మాదిరిగానే కొన్ని మార్పుల‌తో ఈ మ్యాప్ ఫీచ‌ర్‌ను తీసుకురానుంది. ఈ మేర‌కు Instagram మాతృ సంస్థ Meta యొక్క CEO మార్క్ జుకర్‌బర్గ్ సెర్చ‌బుల్‌ మ్యాప్‌ను సూచిస్తూ.. త‌న Instagram స్టోరీస్‌లో ఒక పోస్ట్‌ను చేసారు. ఈ కొత్త ఫీచర్ వినియోగదారులకు సమీపంలో ఉన్న ప్రసిద్ధ స్థానిక వ్యాపారాలను కనుగొనేలా చేస్తుందని మరియు వర్గాల వారీగా ఫిల్టర్ ఆప్ష‌న్‌ల‌ను కూడా వర్తింపజేస్తుంద‌ని పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ అప్‌డేట్ తో పోస్ట్‌లలో లేదా స్టోరీల ద్వారా లొకేషన్ ట్యాగ్‌లను నొక్కడం ద్వారా రెస్టారెంట్లు మరియు ఇతర హాట్ స్పాట్‌లను వెతకడానికి వినియోగదారులకు అవ‌కాశం ల‌భిస్తుందని తెలుస్తోంది.

insta location maps

మెటా CEO తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన పోస్ట్‌లో పంచుకున్న అప్‌డేట్ ప్రకారం, ఇన్‌స్టా కొత్త సెర్చ‌బుల్ మ్యాప్ ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. ఇది ఇప్పుడు వినియోగదారులను రెస్టారెంట్లు మరియు ఇతర హాట్ స్పాట్‌ల కోసం వెతకడానికి అనుమతిస్తుంది. ఇది Google-మ్యాప్స్ మాదిరిగానే ఉన్న‌ప్ప‌టికీ.. కొన్ని మార్పులతో ఈ ఫీచ‌ర్ వ‌స్తోంది. దీని ద్వారా వినియోగదారులు తమ చుట్టూ ఉన్న ప్రసిద్ధ వ్యాపారాలను కనుగొనగలరు. అంతేకాకుండా, వివిధ వర్గాలకు సంబంధించిన స్థ‌లాల‌ను ఫిల్టర్ చేసి సెర్చ్ చేసుకోవ‌చ్చు.

ఇన్‌స్టాగ్రామ్‌లోని మ్యాప్ ఫీచ‌ర్ హ్యాష్‌ట్యాగ్ సెర్చింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా ఫీడ్ లేదా స్టోరీస్‌లో ట్యాగ్ చేయబడిన ప్లేసెస్‌ను క్లిక్ చేయ‌డం ద్వారా వినియోగదారులను ఆయా నిర్దేశిత ప్రాంతాల‌ను కనుగొనేలా అనుమతిస్తుంది. దాంతో పాటు ఇది ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫాంపై వారి స్నేహితులతో లొకేష‌న్ పంచుకోవడానికి కూడా యూజ‌ర్ల‌ను అనుమతిస్తుంది. వినియోగదారులు నగరం లేదా పరిసరాల పేరును నేరుగా సెర్చ్‌ పేజీలో టైప్ చేసి మ్యాప్‌లో ఫలితాలను చూడవచ్చు. అయితే, లొకేషన్-షేరింగ్ ఫీచ‌ర్‌ను ఇత‌రులు వీక్షించ‌డానికి ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పబ్లిక్‌గా ఉండాల్సి ఉంటుంది.

insta location maps

Direct Payment ఫీచ‌ర్ కూడా:

ఇదేకాకుండా ఇటీవ‌ల మ‌రో ఆస‌క్తిక‌ర ఫీచ‌ర్‌ను కూడా తెస్తున్న‌ట్లు ఇన్‌స్టాగ్రామ్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. త‌మ ప్లాట్‌ఫాంపై Direct Payment ఫీచ‌ర్ తెస్తున్న‌ట్లు Meta గ్రూప్ సోమ‌వారం తెలిపింది. మెసేజ్‌ల ద్వారా వినియోగ‌దారులు గుర్తింపు క‌లిగిన చిన్న చిన్న వ్యాపారస్థుల నుంచి ఉత్ప‌త్తుల్ని కొనుగోలు చేయ‌వ‌చ్చని పేర్కొంది. ఇందుకు పేమెంట్ చేసే విధంగా మెసేజ్‌ల‌లో వెసులు బాటు క‌ల్పించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

బ్లాగ్‌పోస్ట్ లో పేర్కొన్న ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. Instagram ప్లాట్‌ఫాంపై పేమెంట్ ఫీచ‌ర్ అందుబాటులోకి రానుంది. యూజ‌ర్లు ఎవ‌రైనా ప్లాట్‌ఫాంలో అర్హ‌త లేదా గుర్తింపు క‌లిగిన చిన్న వ్యాపార‌స్థుల నుంచి వ‌స్తువుల్ని కొనుగోలు చేయ‌వ‌చ్చు. అందుకు త‌గ్గ‌ట్టు న‌గ‌దు చెల్లించ‌డం కోసం మెసేజ్ చాట్‌లో Payment ఫీచ‌ర్‌ ను పొందుతారు. త‌ద్వారా వినియోగ‌దారులు ఇక నుంచి త‌మ‌కు న‌చ్చిన వ‌స్తువుకు సంబంధించి అక్క‌డే చాట్‌లో వివ‌రాలు తెలుసుకుని.. అక్క‌డే నేరుగా ఆర్డ‌ర్ ప్లేస్ చేయ‌వ‌చ్చు.

insta location maps

అంతేకాకుండా, ప్రొడ‌క్ట్ ట్రాకింగ్‌ను కూడా అక్క‌డే నేరుగా చాట్‌లో వ్యాపార‌స్థుడి నుంచి తెలుసుకోవ‌డానికి కూడా వీలు ఉంటుంది. ఇక పేమెంట్ ను మెటా పే ద్వారా చెల్లించ‌డానికి అవ‌కాశం ఉంటుంది. త‌మ ప్లాట్‌ఫాం పై జ‌రిపే Payments, కొనుగోళ్లు పూర్తిగా సెక్యూర్‌గా, సుర‌క్షితంగా ఉంటాయ‌ని మెటా కంపెనీ హామీ ఇచ్చింది. అయితే, మెటా తెస్తున్న ఈ ఫీచ‌ర్ ఈ కామ‌ర్స్ వ్యాపారాన్ని విస్తృత‌ప‌రిచే విధంగా కంపెనీకి దోహ‌ద‌ప‌డుతుంది.

ఇప్ప‌టికే 2020లో, మెటా సంస్థ‌ Facebook మరియు Instagram ప్లాట్‌ఫాంల‌లో యూజ‌ర్లు త‌మ‌కు కావాల్సిన‌ ఉత్పత్తులను సెర్చ్ చేసి, కొనుగోలు చేయడానికి వీలుగా షాప్‌ల‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, ఈ కంపెనీ ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ వేదిక‌గా యూజ‌ర్లు తమ డిజిటల్ స్టోర్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసుకునేలా కూడా ప్రోత్స‌హిస్తోంది.

Best Mobiles in India

English summary
Instagram Makes It Easy for Users to Search Locations With Its New Map Feature

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X