మీ తలరాత ఇకపై కేంద్ర ప్రభుత్వం చేతిలో, ప్రాజెక్ట్ ఇన్‌సైడ్‌ వస్తోంది..

Written By:

మీరు పన్ను కడుతున్నారా.. అయితే దీనిపై మీకు ఎటువంటి బెంగా లేదు. పన్ను కట్టనివారి కోసమే ఈ స్టోరీ. మీరు ఎంతో ఇష్టపడి కొనుక్కున్న లగ్జరీ ఇల్లు, కారు, విదేశాల్లో ఎంజాయ్ ఇలాంటి అంశాలన్నీ
మీరు పన్ను కట్టకుంటే మీకు చుక్కలు చూపిస్తాయి. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా మీ భవిష్యత్ అంతా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోతుంది.

ప్రపంచాన్ని వణికించే నార్త్ కొరియాను ఇదే భయపెడుతోంది..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ లగ్జరీ ఫోటోలను

మీరు మీ లగ్జరీ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారా. అయితే.. ఇకముందు ఇలా చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే..

ఇలాంటి ఫోటోల ద్వారా

ఎందుకంటే ఇకపై ఇలాంటి ఫోటోల ద్వారా పన్ను ఎగవేతదారులకు చెక్‌ పెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం మరో కీలక చర్యను చేపట్టనుంది.

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా‍గ్రామ్‌ తదితర సోషల్‌ మీడియా పోస్టులును

ఇందుకు గాను ముఖ్యంగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా‍గ్రామ్‌ తదితర సోషల్‌ మీడియా పోస్టులును ఆదాయ పన్ను శాఖ పరిశీలించనుంది.

ఆదాయపు ప్రకటనలతో

తాజా నివేదికల ప్రకారం ఆదాయపు ప్రకటనలతో, ఖర్చు నమూనాలతో సరిపోలాయో లేదో తేల్చుకునేందుకుగాను అధికారులు ఆయా వ్యక్తుల సోషల్ మీడియా పోస్టులను పరిశీలించనున్నారు.

ప్రాజెక్ట్‌ ఇన్‌సైడ్‌

ఈ నెలనుంచే ఈ పక్రియ మొదలుకానుందని తెలుస్తోంది. ‘ప్రాజెక్ట్‌ ఇన్‌సైడ్‌' పేరుతో ఈ ప్రాజెక్టు రెండు దశల్లో అమలు కానుంది.

40శాతం పన్ను వసూలు

ప్రాజెక్ట్‌ ఇన్‌సైడ్‌ ద్వారా 40శాతం పన్ను వసూలు పెరగనుందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు ఈ ప్రాజెక్టుకోసం 156 మిలియన్ డాలర్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Instagram posts will soon help Modi government sniff out tax evader read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot