ఇన్ స్టాగ్రామ్ నుంచి స్టిక్కర్ ప్యాక్!

By: Madhavi Lagishetty

ఫేస్ బుక్ అనుబంధంగా ఉన్న ఫోటో మెసేజింగ్ ప్లాట్ ఫాం ఇన్ స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటుంది. స్నాప్ చాట్ మాదిరిగా ఫేస్ ఫిల్లర్లతోపాటు ఫేస్ బుక్ లో ఇటీవల వచ్చిన స్టోరీస్, డైరెక్ట్ ఫీచర్లూ ఇన్ స్టాగ్రామ్ లో అందుబాటులోకి వచ్చాయి. వీటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. గతేడాది ఆగస్టు 2న ఇన్ స్టాగ్రామ్ స్నాప్ చాట్ ను పరిచయం చేసింది.

ఇన్ స్టాగ్రామ్ నుంచి స్టిక్కర్ ప్యాక్!

తాజాగా ఇన్ స్టాగ్రామ్ స్టిక్కర్స్ ప్యాక్ ను ప్రారంభించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 700మిలియన్ల మంది ఇన్ స్టాగ్రామ్ యూజర్లు ఉన్నారు. వీరిలో స్టోరీస్ ఫీచర్ కోసం ప్రతిరోజు 250 మిలియన్ల మంది యూజర్లు లాగిన్ అవుతున్నారు.

ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ ఇతరులతో పంచుకునేందుకు సహాయపడుతుది. ఈ ఫీచర్ ప్లాట్ ఫామ్ పై యూజర్లు ఎక్కువ సమయం గడుపుతున్నారని కంపెనీ పేర్కొంది. అధికారిక బ్లాగ్ పోస్ట్ నుంచి...25 సంవత్సరాల లోపు యువతీయువకులు ప్రతీరోజు 32నిమిషాలపాటు కంటే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. అంతేకాదు 25సంవత్సరాల పైబడిన వారు రోజుకు 24నిమిషాలపాటు ఇన్ స్టాగ్రామ్ ను ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు.

DSLR కెమెరాలో డిఫరెంట్ మోడ్స్!

ఇన్ స్టాగ్రామ్ లోనూ ఫన్నీ ఫోటోలు తీసుకుని షేర్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకుని వేరే ఫ్లాట్ ఫారం మీద కూడా వాడుకోవచ్చు. ఇందుకోసం ఇన్ స్టాగ్రామ్ లో యువర స్టోరీస్ ఆప్షన్ లేదా దాని పైనుండే కెమెరా ఐకాన్ టాప్ చేయాలి. ఇన్ స్టాగ్రామ్ డైరెక్ట్ అనే యారో ఐకాన్ ను క్లిక్ చేసినా ఇదే మెనూ వస్తుంది.

స్టార్ట్ లైవ్ వీడియో ఆప్షన్ తో మీరు లైవ్ లో మీ ఫ్రెండ్స్ , రిలేటివ్స్ తో మాట్లాడుకోవచ్చు. బూమ్ రాంగ్, రివైండ్, హ్యాండ్స్ ఫ్రీ ఆప్షన్లు కనిపిస్తాయి. దీన్ని క్లిక్ చేస్తే 20కొత్త ఫీచర్ల కనిపిస్తాయి. ఈ ఫీల్టర్లతో ఫోటోలతోపాటు, వీడియోలు కూడా రికార్డ్ చేసుకోవచ్చు.

అంతేకాదు..బ్లాగ్ పోస్ట్ స్లోరీస్ ఫీచర్ ను ఉపయోగించి కూడా ఇన్ స్టాగ్రామ్ లో వ్యాపారాలు చేస్తున్నారు. చాలా లాభదాయకంగా ఉన్నాయని తెలిపింది. గత నెలలో ఫ్లాట్ ఫాం పై 50శాతం వ్యాపారాలు స్టోరీస్ ను ప్రొడ్యూస్ చేశాయి. 20శాతం సేంద్రీయ కథనాల నుంచి వ్యాపారాలు డైరెక్ట్ మెసేజ్ ను అందుకున్నాయి. ఇన్ స్టాగ్రామ్ టాప్ ట్యాగ్స్, ఎక్కువ ప్రజాదరణ పొందిన స్టిక్కర్లు, అత్యంత జనాదరణ పొందిన ఫేస్ ఫిల్టర్లను వెల్లడించింది.

Read more about:
English summary
Instagram Stories feature has turned one year old. The company has introduced a new celebration sticker pack in order to celebrate the same.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting