ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ వెరిఫై చేయాలంటే,గవర్నమెంట్ ఐడి ఉండాల్సిందే!

By Maheswara
|

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లు వెరిఫై చేసుకోవడానికి కొత్త విధానం ప్రవేశపెడుతున్నట్టు, ఇన్‌స్టాగ్రామ్ తన ప్రకటనలో తెలిపింది. ఒక సారి ఇంస్టాగ్రామ్ ఖాతా గుర్తింపును ధృవీకరించమని అడిగితే,ఒక వేల యూజర్లు వెరిఫై చేయకపోతే ,ఇంస్టాగ్రామ్ వారి ఖాతాను డిసేబుల్ చెయ్యవచ్చు. అని ఇన్‌స్టాగ్రామ్ చెబుతుంది.అంతేకాక అనుచరుల ఫీడ్‌లలో వారి పోస్టులు తక్కువ ఉంటాయి.

ఆటోమేటిక్ బోట్ లు
 

ఆటోమేటిక్ బోట్ లు

ఒక దేశం లోని ఖాతాలకు సంబంధించి న అనుచరులు వేరొక దేశంలో ఎక్కువ మంది ఉన్నట్లైయితే వారి ఖాతాలు అనుమానాస్పదమైనవి గ పరిగణించబడతాయి.మరియు ఆటోమేటిక్ బోట్ లు ఉపయోగించి వాడే ఖాతాలు కూడా పరిశీలించబడతాయి.

సంబంధం లేని ఇన్‌స్టాగ్రామ్

సంబంధం లేని ఇన్‌స్టాగ్రామ్

ఈ విధానం పేరుతో సంబంధం లేని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలకు వారి గుర్తింపును బహిర్గతం చేయడం ద్వారా హాని కలిగే అవకాశాలు ఉన్నాయి.గోప్యతా సమస్యలను కూడా పెంచుతుంది - బ్లాక్ లైవ్స్ మేటర్ నిరసనలను నిర్వహించే ఖాతాలు లేదా సున్నితమైన సమాచారాన్ని పంచుకోవడానికి ఉపయోగించే ఖాతాలు ఇలాంటివి.

ఈ విధానం వల్ల, తమ అనుచరులను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్న ఖాతాలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్ కు అవకాశం కలుగుతుందని, ఇన్‌స్టాగ్రామ్ తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

ఇన్‌స్టాగ్రామ్ అంగీకరించే ఐడిల జాబితా

ఇన్‌స్టాగ్రామ్ అంగీకరించే ఐడిల జాబితా

ఇన్‌స్టాగ్రామ్ అంగీకరించే ఐడిల జాబితా డిఎమ్‌వి వద్ద లైసెన్స్ పొందడానికి మీరు తీసుకురాగల డాక్యుమెంట్ ల లాంటివే. మీకు పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వం జారీ చేసిన ఐడి లేకపోతే, ఇన్‌స్టాగ్రామ్ పేచెక్ స్టబ్‌లు, మెయిల్, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు లేదా క్రెడిట్ కార్డులను ఇంస్టాగ్రామ్ గుర్తింపు డాక్యూమెంట్లు గా అంగీకరిస్తుంది.

 

"అనుమానాస్పద" ఖాతా లు

"అనుమానాస్పద" ఖాతా లు ఎలా గుర్తిస్తారు,వేటిని అనుమానాస్పద ఖాతాలు గా పరిగణిస్తారో ఇన్‌స్టాగ్రామ్ వివరించలేదు. 2020 అమెరికా ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఖాతాల గుర్తింపులను ధృవీకరించే ప్రయత్నం చేస్తోంది. పరిశీలనను ఎదుర్కోవటానికి ఇన్‌స్టాగ్రామ్ యొక్క మాతృ సంస్థ ఫేస్‌బుక్ కూడా ఈ మధ్య తప్పుడు సమాచారం మరియు అనాథక కార్యకలాపాలతో పోరాడటానికి కొత్త పాలసీ లు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

 రీల్స్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే ...

రీల్స్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే ...

టిక్‌టాక్ ని మరిపించే దిశగా ఇన్‌స్టాగ్రామ్ తన కొత్త ఫీచర్ అయిన 'రీల్స్' ను భారతదేశంలోని వినియోగదారులకు విడుదల చేసింది.టెస్టింగ్ కోసం విడుదల చేసిన దీనిలో అచ్చం టిక్‌టాక్ లాంటి ఫీచర్ లే ఉండటం ఆశ్చర్యపరిచే విషయమే.ఇన్‌స్టాగ్రామ్ కూడా తమ కొత్త 'Reels ' ఫీచర్ టిక్‌టాక్ కు పోటీ గానే విడుదల చేసినట్టు అంగీకరించింది.ఈ కొత్త ఫీచర్ తో ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌లు 15-సెకన్ల, లూపింగ్ వీడియో క్లిప్‌లను సృష్టించడానికి వీలు ఉంటుంది, ఇది సంగీతానికి అనుకరణగా అమర్చుకోవచ్చు , వివిధ క్లిప్‌ల తో కలిసి ఉంటుంది టిక్‌టాక్ లాగానే.ఈ Reels ఫీచర్ తో వీడియో లు షేర్ చేసుకోవచ్చు , రీమిక్స్ కూడా చేయవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Instagram Will Ask Users To Verify With Government Identity 

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X