సోషల్ మీడియాని కుదిపేస్తున్న లెమన్ ఫేస్ ఛాలెంజ్, అసలేంటిది ?

|

ఒకప్పుడు ఇంటర్నెట్ ప్రపంచాన్ని కుదిపేసిన ఛాలెంజింగ్ గేమ్ ఐస్‌ బకెట్‌ ఛాలెంజ్‌ అందరికీ తెలిసే ఉంటుంది. బకెట్ నిండా ఉన్న ఐస్ నీళ్లను నెత్తి మీద పోసుకోవాలి. ఈ గేమ్ మహామహులను ఆకర్షించింది. సెలబ్రిటీలు సైతం ఇందులో పాల్గొని దాన్ని సోషల్ మీడియలో పోస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఆ స్థాయిలోనే మరో ఛాలెంజ్ బయటకొచ్చింది. అదే లెమన్ ఫేస్ ఛాలెంజ్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది ఓ వైరల్ అయింది. ప్రతి ఒక్కరూ ఈ గేమ్ లో పాల్గొంటున్నారు. మరి ఈ గేమ్ ఏంటి ఎలా ఆడాలి అనేదానిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేయాల్సిందే, RBI,ఎలా లింక్ చేయాలో తెలుసుకోండిబ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేయాల్సిందే, RBI,ఎలా లింక్ చేయాలో తెలుసుకోండి

సగం కోసిన నిమ్మకాయ..

ఒకప్పుడు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించిన ‘ఐస్‌ బకెట్‌ ఛాలెంజ్‌' లాగా ఇప్పుడు ‘లెమన్‌ ఫేస్‌ ఛాలెంజ్‌' సంచలనం సృష్టిస్తోంది. ఇందులో మీరు చేయాల్సిందల్లా సగం కోసిన నిమ్మకాయ ముక్కను తీసుకొని పళ్లతో కొరికి కొంత రసాన్ని మింగాలి.

ముఖంలో కలిగే హావభావాలను

కొరికిన తరువాత ముఖంలో కలిగే హావభావాలను ఓ వీడియోలో రికార్డు చేసి ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేయాలి. ఇతరులను పోటీకీ ఛాలెంజ్‌ చేయాలి. ఈ ఛాలెంజ్‌ను ఒంటరిగానైనా స్వీకరించవచ్చు. ఇంటిల్లిపాది స్వీకరించవచ్చు. లేదా మిత్ర బందంతో కలిసి ఛాలెంజ్‌ చేయవచ్చు.

 ఒకరకమైన ప్రాణాంతక బ్రెయిన్‌ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా ..
 

ఒకరకమైన ప్రాణాంతక బ్రెయిన్‌ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా ..

డీఐపీజీగా వ్యవహరించే ఒకరకమైన ప్రాణాంతక బ్రెయిన్‌ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ‘అబ్రైగ్‌ ఆర్మీ' ఈ ఛాలెంజ్‌ను సృష్టించిందని అమెరికా నుంచి వెలువడుతున్న ‘ది అమెరికా పోస్ట్‌' పత్రిక వెల్లడించింది.

ఛాలెంజ్‌ స్వీకరించడం..

ఛాలెంజ్‌ స్వీకరించడం..

గుడ్‌మార్నింగ్‌ బ్రిటన్స్‌ రిపోర్టర్‌ అరెక్స్‌ బెరెస్‌ఫోర్డ్‌ కూడా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన తన రియాక్షన్‌ను ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేశారు. అయితే ఛాలెంజ్‌ స్వీకరించడం మరి ఇంత ఈజీ ఏమీ కాదు. ఎందుకంటే ఛాలెంజ్‌ చేసిన వాళ్లు ఎంతోకొంత కరెన్సీ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆర్మీకి విరాళంగా ఇవ్వాలి.

మీరు కూడా ఇందులో పార్టిస్ పేట్ చేయాలనుకుంటే..

మీరు కూడా ఇందులో పార్టిస్ పేట్ చేయాలనుకుంటే..

ఇంకా మన ఇండియాకి ఈ ఛాలెంజింగ్ గేమ్ రాలేదు. ఒకవేళ వస్తే ఇక్కడ కూడా వైరల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సో మీరు కూడా ఇందులో పార్టిస్ పేట్ చేయాలనుకుంటే మీ నిమ్మకాయ ముక్కను కొరికి ఆ వీడియోను పోస్ట్ చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Lemon face challenge’: This new internet trend is spreading awareness about terminal brain cancer More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X