అడల్డ్ వెబ్‌సైట్స్ చూస్తున్నారా, మీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌తో జాగ్రత్త?

అడల్ట్ కంటెంట్ చూస్తున్నప్పుడు ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంచుతున్నారా...? బుక్కైపోతారు జాగ్రత్త!. ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అయిన తరువాత ఏదైనా అడల్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్ లేదా షాడీ పోర్న్ వెబ్‌సైట్‌ను మీరు ఓపెన్ చేస్తున్నట్లయితే ఆ వెబ్‌సైట్‌లకు సంబంధించిన ఫేస్‌బుక్ ప్లిగిన్స్ యాక్టివ్‌గా మారి, మీ సర్ఫింగ్ డేటాను ట్రాక్ చేస్తూ, మీ ఇంటర్నెట్ ప్రైవసీని ప్రశ్నార్థకంలోకి నెట్టేయగలవని సైబర్ నిపుణులు హెచ్చిరిస్తున్నారు.

Read More : ఆండ్రాయిడ్ ఫోన్‌లలో DVD, VCD ఫైల్స్‌ రన్ చేయటం సాధ్యమేనా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్ కనిపెట్టేస్తుంది..

ఇంటర్నెట్‌లో మీ పోర్స్ సర్ఫింగ్ అలవాట్లు ఆధారంగా ఎటువంటి సెక్స్యువల్ యాడ్స్ ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ కానప్పటికి, మీరు ఏం చేస్తున్నారనేది మాత్రం ఫేస్‌బుక్ స్ఫష్టంగా కనిపెట్టేస్తుంది.

తప్పనిసరిగా లాగవుట్ కావల్సి ఉంటుంది..

మీరు సెర్చ్ అడల్ట్ వెబ్‌సైట్స్ తాలుకా సెర్చ్ రిజల్ట్స్ డేటా ట్రాక్ కాకుండా ఉండాలంటే, ఆ సైట్‌లలోకి ప్రవేశించే ముందు తప్పనిసరిగా మీ ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి లాగవుట్ కావల్సి ఉంటుంది.

పోర్న్ ఆధారిత మాల్వేర్

సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో పోర్న్ ఆధారిత మాల్వేర్ (porn-based malware) హల్‌చల్ చేస్తోంది. ఈ ప్రమాదకర మల్వేర్ లింక్‌లు క్షణాల్లో ఫేస్‌బుక్‌ యూజర్ల అకౌంట్‌లను వైరస్‌లతో నింపేయగలవు.

మిమ్మల్ని బురిడీ కొట్టించే లింక్..

మీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లోకి మీ మిత్రుడు నుంచి షేర్ కాబడినట్లు ఓ పోర్న్ లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై పొరపాటును మీరు క్లిక్ చేసినట్లయితే కొద్ది సెకన్ల పాటు ఆ వీడియో ‘ప్లే' అయి ఆగిపోతోంది. ఆ తరువాత వీడియో మొత్తం చూడాలంటే ఫ్లాష్ అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరుతుంది. డౌన్‌లోడ్ పై క్లిక్ చేసినట్లయితే మాల్వేర్ మీ కంప్యూటర్‌లోకి ప్రవేశించి మౌస్ ఇంకా కీబోర్డ్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటుంది.

మీకు తెలియకుండానే మరో 20 మందికి..

ఒకసారి మీరు ఈ దాడికి గురైనట్లయితే ఈ ప్రమాదకర మాల్వేర్ మీకు తెలియకుండానే ప్రతిసారీ 20 మందికి వివిధ లింక్స్ రూపంలో మాల్వేర్‌ను పోస్ట్ చేస్తుంటుంది. ఆ లింక్‌‍లను క్లిక్ చేసిన వారు కూడా ఇదే తరహా దాడులకు గురువుతారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Log Out Of Your Facebook Before Watching Adult Sites. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot