కోటిమంది చూసిన వీడియోపై ఫిర్యాదులు వెల్లువ, కన్నుకొట్టడం కూడా తప్పేనా అంటున్న ప్రియా వారికర్ !

Written By:

మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన 'ఓరు అడార్ లవ్' సినిమాలోని కన్నుకొడుతున్న వీడియో రెండు మూడు రోజులుగా ఇంటర్నెట్, సోషల్ మీడియాలో సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియో చూసి యువత పిచ్చెక్కిపోయారు. ఆ వీడియో మత్తు ఇంకా దిగక ముందే పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ముస్లింల సాంప్రదాయ పాటలో ఆమె హావభావాలు అసభ్యంగా ఉన్నాయంటూ కొందరు హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియా ప్రకాష్ ముస్లింల మనోభావాలను దెబ్బ తీసిందని ఆరోపించారు. ఆమెతో పాటు నిర్మాతపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.

రూ.93తో నెలంతా అపరిమిత కాల్స్, 1జిబి డేటా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దేశవ్యాప్తంగా ఇంతమంది ఇష్టపడుతున్నందుకు...

రాత్రికి రాత్రే ‘వైరల్' స్టార్‌గా మారిన ప్రియా ప్రకాశ్ వారియర్.. వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ప్రియా వారికర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇంతమంది ఇష్టపడుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని, కేసుల విషయం గురంచి నాకు పెద్దగా తెలీదని డైరెక్టర్ చెప్పిందే చేశానని తెలిపింది.

ఫిబ్రవరి 9న వీడియో అప్‌లోడ్ చేయగా..

కాగా ఫిబ్రవరి 9న వీడియో అప్‌లోడ్ చేయగా ఇప్పటికే కోటికి పైగా వ్యూస్ ని సాధించింది. 60 వేల ఫాలోవర్స్‌తో రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. మళయాళం చిత్రం Oru Adaar Loveలో Manikya malaraya poovi అనే పాటకు ఈ ముద్దుగుమ్మ తన హవభావాలను పలికించిన విషయం తెలిసిందే.

ఫన్నీగా కూడా..

కాగా ఈ వీడియో ఇప్పుడు ఫన్నీగా కూడా దూసుకుపోతోంది. Gautam Gambhir, Ravi Shastri, Virat Kohli, Mahendra Singh Dhoni and even Katrina Kaif,modi, kejrival, salman khan, ramdev baba,Rahula gandhi లాంటి వారి హావభావాలను ఈ ముద్దుగుమ్మ హవభావాలకు తగిలించారు

సోషల్ మీడియాలో ఈ ముద్దగుమ్మ..

కాగా సోషల్ మీడియాలో ఈ ముద్దగుమ్మ అగ్ర హీరోలను వెనక్కినెట్టేసింది. ఇన్‌స్టా‌గ్రామ్‌లో అగ్రహీరోలు అయిన మహేష్ బాబు, రాణా, దల్కర్ సల్మాన్‌, ఇంకా హీరోయన్ అనుష్క లాంటి వారినందరినీ వెనక్కి నెట్టేసింది. కాగా అల్లు అర్జున్ ఈ ముద్దుగుమ్మ భావాలకు ఫిదా అయిపోయి ట్వీట్ కూడా చేసిన సంగతి తెలిసిందే.

ప్రేమికుల రోజు సందర్భంగా..

కాగా ప్రేమికుల రోజు సందర్భంగా టీజర్ విడుదల చేసిన టీజర్ లో కూడా అమ్మడు దుమ్మురేపుతోంది. ఈసారి విడుదలైన వీడియో(టీజర్)లో తన ప్రియుడిపైకి ప్రేమ తుపాకి ఎక్కుపెట్టింది ప్రియా వారియర్. ముద్దులనే బుల్లెట్లుగా మార్చి అతడి గుండెల్లో కసిగా దించేసింది. ఈ టీజర్ కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో వైరల్ అవ్వడంతో పాటు ట్రెండింగ్ లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Malayalam actress Priya Varrier floors social media with a smile and wink More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot