ఇకపై ఫేస్‌బుక్‌లో ఇవి చేయడం కష్టం, జుకర్‌బర్గ్ కీలకమైన చర్యలు !

Written By:

కేంబ్రిడ్జ్‌ అనలిటికా డేటా చోరి ఉదంతంపై తుది విచారణ ముగిసింది. ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ రెండు రోజులు పాటు అమెరికా కాంగ్రెస్‌ అడిగిన ప్రశ్నలన్నింటికీ చాలా స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. కొన్ని సార్లు అసహనానికి గురయినా ఎక్కువశాతం కూల్ గా ఉండేందుకే ప్రయత్నించారు. తొలిరోజు ఆత్మవిశ్వాసంతో కనిపించినా రెండవ రోజు మాత్రం అమెరికన్‌ సెనేటర్లు Mark Zuckerbergకి చుక్కలు చూపించారు. వినియోగదారుల గోప్యతకు మించి పలు అంశాలపై అందరూ ఆయన్ని అటాక్ చేశారు. కఠినతరమైన ప్రశ్నలతో Mark Zuckerbergను గుక్క తిప్పుకోనివ్వకపోవడంతో ఒకానొక దశలో జుకర్‌బర్గ్‌ తీవ్ర అసహనానికి కూడా గురయ్యారు. అయినపన్పటికీ తన తప్పును ఒప్పుకుంటూ నిజాయితీగా సమాధానాలు ఇచ్చారు. రెండు రొజుల మీటింగ్ లో ప్రధాన అంశాలు ఇవే..

ఆపిల్ నుండి సరికొత్త 9.7 ఇంచ్ IPAD, ధర రూ. 28,000 మాత్రమే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

100 మంది చట్టసభ్యులు 10 గంటల పాటు..

కేంబ్రిడ్జ్‌ అనలిటికా డేటా స్కాండల్‌పై అమెరికన్‌ కాంగ్రెస్‌ లోని రెండు రోజుల పాటు దాదాపు 100 మంది చట్టసభ్యులు 10 గంటల పాటు జుకర్‌బర్గ్‌ను విచారించినట్టు తెలుస్తోంది. వారు ఫేస్‌బుక్‌ డేటా పాలసీ, థర్డ్‌ పార్టీ యాప్స్‌తో కలిసి ఉల్లంఘిస్తుందనే అంశంపై ఎక్కువగానే ప్రశ్నలు సంధించారు.

జుకర్‌బర్గ్‌ పదే పదే తాను పెద్ద తప్పు చేశానని ..

ఈ విచారణలో కూడా జుకర్‌బర్గ్‌ పదే పదే తాను పెద్ద తప్పు చేశానని ఒప్పుకున్నారు. 2011లో ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌తో చేసుకున్న ఒప్పందాన్ని గుర్తు చేస్తూ డేటా ఉల్లంఘనకు పాల్పడితే భారీ మొత్తంలో జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.ఈ ఒప్పందం ప్రకారం స్‌బుక్‌ డేటా పాలసీ, థర్డ్‌ పార్టీ యాప్స్‌తో కలిసి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయి.

ఒక్క పదంతో సమాధానం చెప్పలేమని..

డేటా సేకరణను తగ్గించడానికి ఏమైనా డీఫాల్ట్‌ సెట్టింగ్స్‌ను ఫేస్‌బుక్‌ మార్చడానికి సిద్ధంగా ఉందా? అనే ప్రశ్నకు జుకర్‌బర్గ్‌ సమాధానమిస్తూ ఇది చాలా క్లిష్టమైన అంశమని, కేవలం ఒక్క పదంతో సమాధానం చెప్పలేమని తెలిపారు. అయితే ఈ సమాధానం సెనేటర్లను సంతృప్తిపరచలేకపోయింది.

వినియోగదారుల భద్రతకు సంబంధించి..

కేంబ్రిడ్జ్‌ అనలిటికాతో ఫేస్‌బుక్‌ షేర్‌చేసిన 8.7 కోట్ల మంది డేటా ఉదంతం చాలా బాధాకరమని ఫేస్‌బుక్‌లో వినియోగదారుల భద్రతకు సంబంధించి కొన్ని కీలకమైన చర్యలు తీసుకున్నామని జుకర్‌బర్గ్‌ వారికి వివరించారు.

ఫోన్‌ నెంబర్లు, ఈ మెయిల్‌ ఐడీల ద్వారా..

ఫోన్‌ నెంబర్లు, ఈ మెయిల్‌ ఐడీల ద్వారా ఇతర వ్యక్తుల్ని ఇక మనం సెర్చ్‌ చేయలేం. వేరే వ్యక్తుల పోస్టులను షేర్‌ చేయడానికి కొన్ని పరిమితులు విధించారు. గతంలో మాదిరిగా ఏ సమాచారాన్నైనా మనం షేర్‌ చేయడం ఇకపై అంత సులభం కాదు.

ఫేస్‌బుక్‌లో డేటాను వినియోగించలేరు..

యాప్‌ డెవలపర్స్‌ ఇక ఫేస్‌బుక్‌లో డేటాను వినియోగించలేరు. ఇతర యాప్‌లకు ఎఫ్‌బీ నుంచి చాలా తక్కువ సమాచారం మాత్రమే అందుతుంది. వినియోగదారుల వ్యక్తిగతం సమాచారం, వారు పెట్టిన పోస్టులను డెవలపర్స్‌ చూడడానికి ఇక చాలా అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇతరుల చేతికి సమాచారం వెళ్లకుండా దీనిపై ఎన్నో పరిమితులు విధించారు.

ఫేస్‌బుక్‌ చేతిలోనే ఇన్‌స్టాగ్రామ్‌

కాగా 200 కోట్ల మంది వినియోగదారులు ఉన్న ఫేస్‌బుక్‌కు ప్రత్యామ్నాయం ఇన్‌స్టాగ్రామ్‌.. అది కూడా ఫేస్‌బుక్‌ చేతిలోనే ఉంది. 2017 సంవత్సరంలో వచ్చిన డిజిటల్‌ రెవిన్యూలో 87 శాతం ఈ రెండింటికే వచ్చింది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ..

ఫేస్‌బుక్‌లో రాజకీయంగా, వర్గాల వారీగా విద్వేషపూరిత వ్యాఖ్యల్ని, సమాచారాన్ని తొలగించడం చాలా సంక్లిష్టమైన విషయమని, అయితే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వినియోగించుకొని మరో అయిదు, పదేళ్లలో దానిని సాధిస్తామని హామీ ఇచ్చారు.

ఎన్నికల సమగ్రతని కాపాడడానికి ..

భారత్‌లో ఎన్నికలకు ఎంత ప్రాధాన్యత ఉందో తమకు తెలుసునని, ఆ ఎన్నికల సమగ్రతని కాపాడడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటామని జుకర్‌బర్గ్‌ స్పష్టం చేశారు. భారత్‌తో పాటు పాకిస్థాన్, బ్రెజిల్, మెక్సికో దేశాల్లో జరగబోయే ఎన్నికల్లో డేటా లీకేజీ జరగకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

కృత్రిమ మేధ సాయంతో

కృత్రిమ మేధ సాయంతో ఫేక్‌ అకౌంట్లను తొలగించడంతో పాటు ఫేస్‌బుక్‌ భద్రతను ఎప్పటికప్పుడు పటిష్టం చేయడానికి 20 వేల మంది సిబ్బందితో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జుకర్‌బర్గ్‌ హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో సమాచారాన్ని సురక్షితంగా ఉంచడమే తమ ముందున్న లక్ష్యమని చెప్పుకొచ్చారు.

సెనేటర్లతో జుకర్‌బర్గ్‌ ..

అయితే సెనేటర్లతో జుకర్‌బర్గ్‌ విచారణకు ముందే సంబంధాలను నెరిపారని అందువల్ల ఏ దశలోనూ అతను ఆత్మవిశ్వాసం కోల్పోలేదని దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయని న్యూయార్క్‌ టైమ్స్‌ ఒక కథనాన్ని వెల్లడించింది.

జుకర్‌బర్గ్‌ విచారణ అంత సంక్లిష్టంగా సాగలేదని..

ఈ కథనంలో జుకర్‌బర్గ్‌ను విచారించిన సెనేట్‌ జ్యుడీషియరీ, కామర్స్‌ కమిటీలకు ఫేస్‌బుక్‌ నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి. ఈ రెండు కమిటీల్లో సభ్యులకు 2007వ సంవత్సరం నుంచి 6.4 లక్షల అమెరికా డాలర్లు విరాళం రూపంలో అందాయి. అందుకే జుకర్‌బర్గ్‌ విచారణ అంత సంక్లిష్టంగా సాగలేదని ఆ పత్రిక కథనాలు ప్రచురించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook CEO Congressional testimony: Mark Zuckerberg warned by senators of ‘privacy nightmare’ More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot