తండ్రిపై స్టాలిన్ భావోద్వేగ లేఖ, షేకవుతున్న ఇంటర్నెట్ !
డిఎంకె అధినేత కరుణానిధి అస్తమయంతో అభిమానలోకం శోకసంద్రంలో మునిగిపోయింది.
డిఎంకె అధినేత కరుణానిధి అస్తమయంతో అభిమానలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. డిఎంకె అభిమానులు, నేతలు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ విషాదంలో డిఎంకె నేత స్టాలిన్ తండ్రికి రాసిన ఓ ఉత్తరం ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. స్వతహాగా మంచి కవి అయిన స్టాలిన్ ఎంతో భావోద్వేగంతో ఈ లేఖను రాశారు. ఆ లేఖలో తన తండ్రితో గల అనుభంధాన్ని కవితరూపంలో వెలువరించారు. నేను పుట్టినప్పటి నుంచి మిమ్మల్ని నా నాయకుడిగానే చూశాను. కనీసం ఇప్పటికైనా ఒకే ఒక్కసారి నేను నిన్ను నాన్నా అని పిలువనా?" అని డీఎంకే నేత స్టాలిన్ తన తండ్రిని తలచుకుంటూ రాసిన కవిత తమిళనాట ఇప్పుడు వైరల్ గా మారి డీఎంకే కార్యకర్తల కంట కన్నీరు పెల్లుబికేలా చేస్తోంది.
తొలిసారిగా అలా..
తన తండ్రి కరుణానిధిని స్టాలిన్ ఏనాడూ 'అప్పా' (నాన్నా) అని పిలవలేదని ఉత్తరం ద్వారా తెలుస్తోంది. తొలిసారిగా అలా పిలవాలని ఉందని లేఖలో పేర్కొన్నారు. "ఇంతవరకూ గడిపిన నా జీవితంలో మీరు ఓ నేతగానే నాకు తెలుసు" అని కరుణానిధి ఆరుగురు వారసుల్లో ఒకరైన స్టాలిన్ తన కవితలో వ్యాఖ్యానించారు.

కన్నీటితో తానిప్పుడు రాస్తున్నానని..
కన్నీటితో తానిప్పుడు రాస్తున్నానని, ఇకపై ఇంట్లో మీ నవ్వు కనిపించదన్న సంగతి తలచుకోవడానికే భయపడుతున్నానని ఆయన తనలోని బాధను చెప్పుకున్నారు. కాగా, కరుణానిధిలానే ఆయన రాజకీయ వారసుడైన స్టాలిన్ కు కూడా కవిత్వంపై మంచి పట్టుంది.

మొత్తం 51 దేశాల్లో
కాగా కరుణానిధి గురించి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. మొత్తం 51 దేశాల్లో కరుణానిధి గురించి తెలుసుకోవాలని గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారని ఓ రిపోర్ట్ తెలిపింది.

కరుణానిధి జీవితం
ముఖ్యంగా కరుణానిధి సినీ జీవితం, రాజకీయ జీవితం, వ్యక్తిగత జీవితం లాంటి అంశాలను గూగుల్‌లో అందరూ పరిశోధిస్తున్నారని తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా..
కరుణానిధి మరణంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సంతాపదినం ప్రకటించింది. సోషల్ మీడియాలో సైతం కరుణానిది రిప్ అంటూ తమ సంతాపాన్ని తెలియజేస్తోంది.

మరణానికి సంతాప సూచికగా..
కరుణానిధి మరణానికి సంతాప సూచికగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో బుధవారం జాతీయ జెండాను అవనతం చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.

తమిళనాడు రాష్ట్రా వ్యాప్తంగా..
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు కరుణానిధికి నివాళిగా సంతాప దినాలను ప్రకటించాయి. కాగా నేడు తమిళనాడు రాష్ట్రా వ్యాప్తంగా న్యాయస్థానాలకు సెలవు ప్రకటించారు.


Click it and Unblock the Notifications