ఆ దేశాల్లో ఆ తప్పులు చేస్తే..?

Written By:

ఇంటర్నెట్ ఓ అద్బుతమైన కమ్యూనికేషన్ సాధనం. వెబ్ విహరణిలో ఎటువంటి సమాచారాన్ని అయినా పొందవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా కావాల్సినంత విజ్ఞానంతో పాటు కాలక్షేపాన్ని కూడా పొందవచ్చు. అయితే, ఇంటర్నెట్ కంటూ కొన్ని పరిధులు ఉన్నాయి. వీటిని ఉల్లంఘించకూడుదు. ఇంటర్నెట్ స్వేచ్చకు సంబంధించిన నిబంధనలు ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటాయి. ఆన్‌లైన్‌లో మీరు చేయకూడని 10 తప్పులను ఇక్కడ సూచించటం జరుగుతోంది...

Read more : శవాలతో సెల్ఫీ లొల్లి..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్‌లో

ఆ దేశాల్లో ఆ తప్పులు చేస్తే...

ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర లిరిక్స్‌ను పోస్ట్ చేసినందుకు గాను అమెరికాలో ఓ స్కూల్ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

టొరెంట్స్ చట్ట వ్యతిరేకం

ఆ దేశాల్లో ఆ తప్పులు చేస్తే...

టొరెంట్స్ ద్వారా ఫైల్స్ షేర్ చేయటమనేది చాలా దేశాల్లో చట్ట వ్యతిరేక చర్యగా పరిగణిస్తారు. ఫైల్ షేరింగ్ అంటే కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించినట్లే. సినిమా, మ్యూజిక్ ఇంకా ఫైల్స్‌ను యజమాని పర్మిషన్ లేకుండా షేర్ చేయటమనేది చట్ట వ్యతిరేక చర్యగా పరిగణిస్తారు.

ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ చట్ట విరుద్ధం

ఆ దేశాల్లో ఆ తప్పులు చేస్తే...

చాలా దేశాలు ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ను నిషేధించాయి. ఆన్‌లైన్‌లో గ్యాంబ్లింగ్ ఆటను నిర్వహించినా, ఆడినా ఈ చట్టం పరిధిలోకి వస్తారు.

రాజుకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే

ఆ దేశాల్లో ఆ తప్పులు చేస్తే...

థాయిల్యాండ్ అథారిటీస్‌కు వ్యతిరేకంగా ఆర్టికల్ రాయటం కారణంగా, ఓ అమెరికన్ ను అక్కడి ల్యాండ్ పోలీసులు అదుపులోకి తీసుకుని జైలులో ఉంచారు. థాయిల్యాండ్‌లో ఆ దేశ రాజును సుప్రిం లీడర్‌గా పరిగణిస్తారు. ఇతని పై ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా ఊచలు లెక్కబెట్టాల్సిందే.

సిరియాలో

ఆ దేశాల్లో ఆ తప్పులు చేస్తే...

సిరియా వంటి దేశాల్లో కఠినతమైన సెన్సార్ షిప్ చట్టాలు అమలులో ఉన్నాయి. వీటిని ఉల్లఘించిన్లయితే జైలు ఊచలు లెక్కబెట్టాల్సిందే.

ఇరాన్‌ దేశంలో

ఆ దేశాల్లో ఆ తప్పులు చేస్తే...

ఓ అభ్యంతరకర వీడియోలో డ్యాన్స్ చేస్తూ కనిపించినందుకు ఇరాన్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులకు ఆ దేశ ప్రభుత్వం 91 కొరడా దెబ్బలతో పాటు ఏడాది జైలు శిక్షను విధించింది. కాబట్టి, అభ్యంతరకర వీడియోలకు దూరంగా ఉండటం మంచిది.

ఇతోపియాలో

ఆ దేశాల్లో ఆ తప్పులు చేస్తే.

ఇతోపియాలో వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సర్వీసుల పై నిషేదాజ్ఞలు అమలులో ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా స్కైప్‌ వంటి సర్వీసులను ఉపయోగించుంటున్నట్లయితే నేరుగా జైలులోనే ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది.

పోస్ట్ చేసే ముందే ఆలోచించుకోండి

ఆ దేశాల్లో ఆ తప్పులు చేస్తే..?

ఆన్‌లైన్‌లో ఉన్నప్పడు మీరేం పోస్టు చేస్తున్నారనేది ముందు గమనించుకోండి. అది పోస్టు చేయడానికి తగినదేనా కాదా అన్నదీ నిర్ధారించుకోండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో అభ్యంతర వ్యాఖ్యలు చేయకూడదు. సరదాకో, తమషాకో మీరు చేసే వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నేరేపొచ్చు.

మీ ఓపెన్ వై-ఫై వేరొకరు వాడుతున్నారా

ఆ దేశాల్లో ఆ తప్పులు చేస్తే..?

మీకు ఓపెన్ వై-ఫై ఉందా అయితే, వెంటనే దానికి పాస్ వర్డ్ ప్రొటెక్షన్‌ను సెట్ చేసుకోండి. ఎందుకంటే, మీ ఓపెన్ వై-ఫైను ఇతరలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించుకోవచ్చు. 

బ్రౌజింగ్ హిస్టరీతో జాగ్రత్త..

ఆ దేశాల్లో ఆ తప్పులు చేస్తే..?

అమెరికాకు చెందిన డేవిట్ అనే వ్యక్తిని యాహూ అకౌంట్ హ్యాకింగ్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో డేవిడ్ ఇంటర్నెట్ సెర్చ్ హిస్టరీ చాలా కీలకంగా వ్యవహరించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Online Activities That Can Put You in Jail. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting