దటీజ్ ఇండియా :మనోళ్ల దేశభక్తికి ఫేస్‌బుక్ సైతం సలాం కొట్టింది

Written By:

ఆగస్టు 15న దేశమంతా స్వాతంత్య్ర సంబరాల్లో మునిగిన వేళ సోషల్ మీడియా మన త్రివర్ణ పతాకంతో హోరెత్తిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఓ ఫోటో మాత్రం వైరల్ గా మారి అందరీ చేత సలాం కొట్టించింది. అసోంలో వరదలు ముంచెత్తి అల్లకల్లోలమవుతున్న వేళ అక్కడ ఓ పాఠశాలలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశం మొత్తాన్ని ఆకర్షించాయి. నడుం లోతు నీళ్లలో నుంచి పిల్లలు జాతీయ జెండాకు చేసిన జెండావందనం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఫోటో లక్షల్లో లైకులు, షేర్లు, కామెంట్లతో దూసుకుపోతోంది.

హిస్టరీని మిస్టరీగా మార్చిన చిత్రాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇద్దరు చిన్నారులు భుజాల వరకు వరద నీరు ఉన్నప్పటికీ

దాని వివరాల్లోకివెళ్తే...అసోంలోని ధుబ్రి ప్రాంతంలోని నష్కర ప్రాథమిక పాఠశాలలో జెండా ఎగురవేశారు. జెండా వందన కార్యక్రమానికి ఓ ఉపాధ్యాయుడు, ముగ్గురు విద్యార్థులు హాజరయ్యారు.వారిలో ఇద్దరు చిన్నారులు భుజాల వరకు వరద నీరు ఉన్నప్పటికీ వాళ్లు మాత్రం జెండా వందనం చేస్తూ నిలబడ్డారు.

ప్రస్తుతం మేము ఎలా ఉన్నామనేది చెప్పలేము

దీని గురించి ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు మిజనూర్‌ రెహమాన్‌ వివరిస్తూ, సంబంధిత ఫొటోను ఫేస్‌ బుక్‌ లో పోస్టు చేశారు. ‘ప్రస్తుతం మేము ఎలా ఉన్నామనేది చెప్పలేము.. ఈ ఫొటోనే చెబుతుంది' అని ఆయన రాసుకొచ్చారు.

సోషల్ మీడియాలో

ఆ రాష్ట్ర నిబంధనల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో జరిగే ప్రతీ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను, ఫొటోలతో సహా తీసి విద్యాశాఖకు పంపించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తీసిన ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి, జిల్లా విద్యాధికారికి పంపారు.

సజీవ సాక్ష్యాలుగా ఇలాంటి ఫోటోలు

చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా ఇలాంటి ఫోటోలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మరుగునపడిపోయాయి.. ప్రపంచం మరచిపోయిన ఆ చిత్రాలను మళ్లీ ఓ సారి గుర్తు చేసుకుందాం.

1972వ సంవత్సరంలో వియాత్నం యుద్ధం సమయంలో నాపలమ్‌పై దాడి జరుగుతున్న వేళ ఓ చిన్నారి ఆ దాడి నుంచి తప్పించుకునేందుకు ఏడుస్తూ నగ్నంగా పరిగెత్తుకుంటూ వెళ్తున్న ఓ ఫోటో ప్రపంచం మొత్తాన్ని కదిలించింది. అక్కడ యుద్ధ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. పులిట్జర్ బహుమతి గ్రహీత నార్వే ఫోటోగ్రాఫర్ నిక్ అట్ ఈ విషాద చిత్రాన్ని తన కెమెరాలో బంధించి ప్రపంచానికి అక్కడ జరుగుతున్న విషాదాన్ని తెలియజేయాలని తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

డాడీ నీ కోసం ఎదురుచూస్తున్నా

డాడీ నీ కోసం ఎదురుచూస్తున్నానంటూ చిన్న పిల్లాడు పరిగెడుతున్న చిత్రం.యుద్ధంలోకి వెళుతున్న చాలామందికి ఈ చిత్రం చూసిన తరువాత ఎంతో వేదన కలిగే ఉంటుంది. తన పిల్లల మీద ప్రేమను చూపెడుతోంది. యుద్ద పరిస్థితులను కూడా కళ్లకు కట్టినట్టు చూపే ఈ చిత్రాన్ని డెట్లాఫ్ తీసారు.

చెగువేరా చివరిక్షణం

ప్రపంచాన్నికి ఉద్యమం అంటే ఏంటో తెలియజెప్పిన చెగువేరా చివరిక్షణంలో ఇలా నేలకొరిగినప్పుడు తీసిన చిత్రం ఇది. దీనికి అందరూ చే లైవ్స్ అని స్లోగన్ కూడా ఇచ్చారు.

సైనికుల శవాల మధ్య ఓ డాక్టర్

జర్మనీలో గల బెర్గిన్ లోని క్యాంప్ శిబిరంలో సైనికుల శవాల మధ్య ఓ డాక్టర్ దీనంగా నడుస్తున్న చిత్రం. ఈ శవాలను ఓ చోటుకు చేర్చి తగలబెట్టడం ఇతని ప్రధాన విధి..ఇలా కుప్పలు కుప్పలుగా పడి ఉన్న శవాలను చూసిన యావత్ ప్రపంచం నివ్వెరబోయింది. ఈ చిత్రం ప్రపంచాన్నే మార్చి వేసింది.

పసిమనస్సులపై యుద్ధ ప్రభావం

పాలబుగ్గల ఈ చిన్నారి ఫొటో మొన్నటివరకూ సోషల్‌ నెట్‌వర్క్‌లో విపరీతంగా చూసేలా చేసింది. చేస్తూనే ఉంది. సిరియా శరణార్థుల శిబిరంలో తలదాచుకుంటున్న ఈ చిన్నారిని ఓ ఫొటోగ్రాఫర్‌ ఫొటో తీస్తుండగా ఆ చిన్నితల్లి కెమేరాను చూసి గన్‌ అనుకుంది.అంతే ఇలా చేతులెత్తి, లొంగిపోతున్నట్లు నిలబడి పోయింది. ఆ దృశ్యాన్ని చూసిన ఫొటోగ్రాఫర్‌ కూడా కదలిపోయి, ఆనక తన కెమేరాలో బంధించి ఇలా మన ముందుంచారు. నిత్యం బాంబులు, తుపాకుల మధ్య లక్షలాది చిన్నారుల బతుకులు ఎలా భయభ్రాంతుల్లో కొట్టుమిట్టాడుతుందో ఈ చిత్రం అద్దంపడుతోంది. పసి మనస్సులపై ఉగ్రవాదం వేసిన ముద్రకు ఈ ఫొటో కన్నా వేరొకటి అవసరం లేదేమో!

ప్రపంచదేశాలను కదిలించిన చిత్రం

యూరప్‌ ద్వంద్వ ప్రమాణాల్ని ప్రపంచానికి తెలియజేసిన చిత్రం అది. అదే సముద్రతీరాన చనిపోయి పడివున్న బాలుని చిత్రం.నీలోఫర్‌ డెమిర్‌ అనే పాత్రికేయురాలు తన కెమెరాలో ఈ చిత్రాన్ని బంధించింది. ఈ చిత్రం సొంత ఊరు, కన్నవారినీ వదిలి చేతబట్టుకుని పొరుగు దేశాలకు వెళ్లే శరణార్థుల వెతల్ని చూపెడుతోంది. ఈ ఫొటో చూసి ఇప్పటికే కోటాను కోట్ల మంది కన్నీరు పెట్టి ఉంటారు.

సూడాన్‌ కరువు

ఆకలితో బక్కచిక్కిన శరీరం, ఎముకల గూడుగా మారి తల వంచిన చిన్నారి.. చనిపోతే బాగుండు తినేద్దాం అని ఎదురుచూసే రాబందు.. ఈ చిత్రం చూస్తే ఎంత కరడుగట్టిన వారినైనా కదలిస్తుంది. సూడాన్‌లో నాటి కరువు పరిస్థితులకు అద్దం పట్టిందీ చిత్రం. ఈ చిత్రాన్ని కెవిన్‌ కార్టర్‌ అనే ఫొటోగ్రాఫర్‌ తన కెమెరాతో 1993లో చిత్రీకరించారు. అయితే ఆ బాలుడిని రక్షించకుండా కెవిన్‌ వచ్చేశాడు. ఆ తర్వాత కెవిన్‌కు మంచి కానుకే లభించింది. కానీ అతను తీవ్ర విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ బాలుడిని రక్షించలేదన్న బాధతోనే కెవిన్‌ కొన్ని నెలల తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
This moving photo of schoolkids from flooded Assam saluting the national flag is going viral Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot