తెలంగాణలో ఇప్పుడంతా...టెక్ పాలనే!

Posted By: Madhavi Lagishetty

సోషల్ మీడియా...ఆధునిక సాంకేతిక ప్రపంచంలో కీలక పాత్ర పోషిస్తుంది. సమాజంలో అనేక అంశాలకు చర్చావేదికగా నిలుస్తోంది. అంతేకాదు సోషల్ మీడియాను సరిగ్గా వినియోగించులేకపోతే...వాటి నుంచి ఊహించలేని పరిణామాలను ఎదుర్కొవల్సి వస్తోంది.

తెలంగాణలో ఇప్పుడంతా...టెక్ పాలనే!

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడంతా...హైటెక్ పాలన సాగుతోందనే చెప్పాలి. యువనేత, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆద్వర్యంలో హైదరాబాదులో ఏర్పాటైన ఐటీ హబ్ ఇప్పటికే పలు రికార్డులకు ఎక్కింది. అంతేకాదు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు మంత్రి అనునిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై స్పందిస్తారు. వారి ఫిర్యాదులకు పరిష్కారాలను చూపుతున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ పోలీస్ బాస్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త పాలనకు తెర తీసినట్లుగానే చెప్పవచ్చు.

నూతన సంవత్సరం సందర్భంగా డిజిపి మహేందర్ రెడ్డి ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ట్విట్టర్, ఫేస్ బుక్ లలో ప్రత్యేకంగా అకౌంట్లను ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో రక్షణ, శాంతి భద్రతలను కాపాడే యోచనలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నట్లు డిజిపి తెలిపారు.

ఇందుకుగాను ఈ ఏడాది 8 లక్ష్యాలను పెట్టుకున్నామని తెలిపారు. ఫ్రెండ్లీ పోలిసింగ్ ను రాష్ట్రమంతా విస్తరించడం, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకే పోలీసుశాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రజల జీవన ప్రమాణానలు మెరుగుపరిచేందుకు పోలీసు శాఖ ఎంతగానో క్రుషి చేస్తుందని తెలిపారు.

రాష్ట్రంలోని 800 పోలీసుస్టేషన్లకు ప్రత్యేకంగా సోషల్ మీడియా అకౌంట్లను క్రియేట్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతోపాటు... ఆయా పోలీస్ స్టేషన్ల పనితీరుపై ప్రజలు నిర్భయంగా తమ ఫీడ్ బ్యాక్ చెప్పేలా ఏర్పాట్లు జరుతున్నాయన్నారు. హైదరాబాద్ లోని స్టేషన్లకు, తర్వాత ఇతర జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు డిజిపి స్పష్టం చేశారు.

ప్రతి పోలీస్ స్టేషన్ లో రిసప్షన్ డెస్క్ ఏర్పాటు చేస్తామన్నారు. దీంతోపాటు ఫేస్ బుక్ , ట్విట్టర్ అకౌంట్ ఏర్పాటు చేయనున్నట్లు డిజిపి తెలిపారు. ప్రతిఒక్కరూ అంకితభావంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని డిజిపి తెలిపారు. ప్రజల అభిప్రాయాన్ని థర్డ్ పార్టీ కాల్ సెంటర్ ద్వారా తెలుసుకుంటారు.

నారీ.. జయభేరీ, 350 ప్రభుత్వ పథకాలతో మహిళల కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్

పెట్టుబడులు, సంక్షేమ అభివ్రుద్ధి కార్యకలాపాలు, రాష్ట్రాన్ని మరింత ప్రగతిపథంలో నడిపేందుకు దోహదపడుతాయి. రాష్ట్రం మరింత అభివ్రుద్ధి చెందాలంటే...శాంతిని నెలకొల్పాలి. అందుకే స్ట్రాంగ్ ఫోర్స్ టెక్నాలజీతో కమ్యూనిటీ భాగస్వామ్య సంబంధిత కార్యక్రమాలు చేపడుతున్నట్లు డిజిపి తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లు రాజధాని నగరాన్ని, దాని చుట్టున్న పరిసర ప్రాంతాలను కవర్ చేస్తున్న కొన్ని ప్రాజెక్టులు..రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను ఆదర్శంగా ఉంటాయని తెలిపారు.

ఉత్తమ సేవలందిస్తూ ప్రశంసలు పొందతున్న తెలంగాణ పోలీసులను ఎన్నో అవార్డులు వరించాయి. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసులు ఉపయోగిస్తున్న హాక్ ఐ మొబైల్ యాప్ కు బహుమతి లభించింది. ఇప్పుడు ఈ మొబైల్ యాప్ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది.

నేనుసైతం కమ్యూనిటీ సిసిసిటివి ప్రాజెక్టుకు విశేష స్పందన వస్తోందన్నారు. ప్రతీ కమిషనరేట్ పరిధిలోని మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వీటన్నింటికి బంజారాహిల్స్ లోని ప్రధాన కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేస్తామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిజిపి హెచ్చరించారు.

ప్రతి జిల్లాలో సోషల్ మీడియా లాబ్ కూడా ప్రతిపాదించినట్లు డిజిపి వెల్లడించారు. రాష్ట్రంలో 2017లో సైబర్ నేరాలు రెండింతలు తగ్గినట్లు చెప్పుకొచ్చారు. నేరాలు జరుగుతున్న కొన్ని ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక ద్రుష్టి కేంద్రీకరించినట్లు చెప్పారు.

హైదరాబాద్ లో ఇన్వెస్టిగేషన్ అధికారులకు సహాయ పడేందుకు ఎక్స్ పీరియన్స్ షేరింగ్ సిస్టమ్ దర్యాప్తు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇది 24గంటలు పనిచేస్తుంది. డొమైన్ నిపుణులు, ఫోరెన్సిక్, వైద్య, న్యాయ నిపుణులు ఇందులో ఉంటారు. నేరాలు నివారించడానికి , సురక్షితమైన ప్రాంతాలను అభివ్రుద్థి చేయడానికి ఒక కమ్యూనిటీ పాలసీ మద్దతు కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు డిజిపి తెలిపారు.

ఇది అమలు అయినట్లయితే...నిజంగా తెలంగాణలో పోలీసింగ్ కొత్త పుంతలు తొక్కడం ఖాయమని చెప్పవచ్చు.

English summary
All police stations in the Indian state of Telangana will now have a Facebook account and Twitter handle for communication with people on a daily basis.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot