కీలక ఫీచర్‌ను టెస్ట్ చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్.. నెలాఖరునాటికి మరో ప్లాట్‌ఫాం లాంచ్!!
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక శాతం స్మార్ట్‌ఫోన్ యూజర్లు వినియోగిస్తున్న సోషల్ మీడియా యాప్‌లలో ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. మెటా నేతృత్వంలోని ఈ సోషల్ మీడియో ప్లాట్‌ఫాం ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఓ కొత్త ఫీచర్‌ను టెస్ట్ చేస్తున్నట్లు తన బ్లాగ్‌లో పోస్ట్ చేసింది.
ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్ 'interested' పేరుతో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ అభిరుచులు, ప్రాధాన్యతలకు అనుగుణంగా కంటెంట్‌ను పొందనున్నారు. యూజర్లు అత్యధికంగా ఏఏ అంశాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తారో వాటిని అందించడం ద్వారా వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తన బ్లాగ్‌లో పేర్కొంది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు తమ అనుభవాన్ని మెరుగు పరుచుకోవడంలో సహాయ పడడానికి మరియు కంటెంట్ క్రియేటర్లకు వారి కంటెంట్ ఎలా చూపుతుందో తెలిపే ర్యాంకింగ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో కూడా తమ బ్లాగ్‌లో ఇన్‌స్టాగ్రామ్ వెల్లడించింది.
వివిధ రకాల ఆల్గారిథమ్, క్రాసిఫైయర్లు, సహా అనేక ప్రక్రియలు ఉపయోగిస్తామని తెలిపింది. ప్రజలు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తాము కోరుకుంటున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ పేర్కొంది. ఇందుకోసం టెక్నాలజీ ఉపయోగమే ఉత్తమ మార్గమని తాము భావిస్తున్నట్లు తన బ్లాగ్‌లో రాసుకొచ్చింది.
ఫీడ్, స్టోరీస్, ఎక్స్‌ప్లోర్, రీల్స్, సెర్చ్ సహా మరిన్నింటిలో వినియోగదారునికి మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు ప్రత్యేక ఆల్గారిథమ్‌ను వినియోగిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మరింత పారదర్శకత, నియంత్రణ తీసుకొచ్చేందుకు నిరంతరం పనిచేస్తున్నట్లు సంస్థ తెలిపింది.
ప్రపంచ కుబేరుడు, ఎలాన్ మస్క్‌కు చెందిన ట్విట్టర్‌కు గట్టి పోటీనిచ్చే విధంగా టెక్ట్స్ ఆధారిత ప్లాట్‌ఫాంను ప్రారంభించనుంది. ఈ నెల ఆఖరుకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. వినియోగదారుల తమ ఆలోచనలను పంచుకొనేందుకు ప్రత్యామ్నాయ ప్లాట్‌ఫాంను అందించాలనేది ఇన్‌స్టాగ్రామ్ ఆలోచనగా తెలుస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్ సింగిలర్ ఆల్గారిథమ్‌పై ఆధారపడి ఉండదని సంస్థ హెడ్ ఆడమ్ మెస్సేరీ తెలిపారు. యూజర్ యాక్టివిటీ, పోస్ట్ సమాచారం సహా వివిధ అంశాల అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని వివరించారు.
ఎక్స్‌ప్లోర్ ఫీడ్‌కు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్ లైక్, షేర్‌లు అత్యంత ముఖ్యమైన చర్యలను పేర్కొన్నారు. ఉదాహరణకు మీరు ఒక పోస్ట్‌ను ఫ్రెండ్‌కు షేర్ చేస్తే.. అదే తరహా కంటెంట్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వినియోగదారులు ఏ పోస్టులపై ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారో ఇన్‌స్టాగ్రామ్ పరిగణనలోకి తీసుకుంటుంది. అటువంటి కంటెంట్ ఎక్కువుగా కనిపించనుంది.
ఉదాహరణకు ఎక్స్‌ప్లోర్ ఓపెన్ చేసిన వెంటనే ఫ్యాషన్‌కు సంబంధించిన పోస్టులను మీరు ఎక్కువగా చూస్తే, అటువంటి కంటెంట్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని తెలిపింది. ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. పూర్తిస్థాయిలో ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందనేది సంస్థ ఇంకా వెల్లడించలేదు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








