Home
Social media

ఆరేళ్లకే కోట్లు సంపాదిస్తున్న బుడతడి కొత్త డీల్, వింటే ఆశ్చర్యపోవాల్సిందే

బుడిబుడి అడుగులు వేస్తూ ముద్దులొలికే మాటలతో అలరించే ఓ బాలుడు ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కాని అధ్బుతానికి వేదికగా మారాడు.

By Hazarath Aiah

బుడిబుడి అడుగులు వేస్తూ ముద్దులొలికే మాటలతో అలరించే ఓ బాలుడు ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కాని అధ్బుతానికి వేదికగా మారాడు. అత్యంత పిన్న వయసులో కోట్లను ఆర్జిస్తున్న హీరోగా ప్రపంచం చేత జేజేలు పలికించుకుంటున్నాడు. ఇప్పుడు ఏకంగా అమెరికా చెందిన అతిపెద్ద రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌తోనే దోస్తీకి సై అంటున్నాడు. వాల్‌మార్ట్‌తో డీల్ కుదుర్చుకుని వార్తల్లో పతాకశీర్షికలకెక్కాడు. మరి ఆ పిల్లాడు ఏ చేస్తున్నాడు. ఆ వయసులో కోట్లు ఎలా సంపాదిస్తున్నాడనుకుంటున్నారా..అయితే కథనం చదవాల్సిందే.

ర్యాన్‌ అనే బుడతడు

ర్యాన్‌ అనే బుడతడు

ర్యాన్‌ అనే బుడతడు యూట్యూబ్‌లో టోయిస్‌లను రివ్యూ చేస్తూ ఉంటాడు.టోయస్‌తో ఆడుకుంటూ.. వాటికి అనుగుణంగా తన చిట్టి చేతులతో స్పందిస్తూ యూట్యూబ్ స్టార్ గా మారాడు.

గతేడాది 8వ బెస్ట్‌ పెయిడ్‌ యూట్యూబర్‌

గతేడాది 8వ బెస్ట్‌ పెయిడ్‌ యూట్యూబర్‌

గతేడాది 8వ బెస్ట్‌ పెయిడ్‌ యూట్యూబర్‌గా కూడా నిలిచాడు. గతేడాది 11 మిలియన్‌ డాలర్లను ఆర్జించాడు. కాగా యూట్యూబ్‌ ఛానల్‌ ర్యాన్‌ టోయస్‌రివ్యూకు ఈ అబ్బాయే స్టార్‌.

15 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు

15 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు

ఇప్పటికీ ర్యాన్‌ యూట్యూబ్‌ టోయస్‌రివ్యూ ఛానల్‌కు 15 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లున్నారు. ర్యాన్‌ వీడియోలకు నెలకు 1 బిలియన్‌కు పైగా వ్యూస్‌ వస్తున్నాయి.

2015 మార్చి నుంచి

2015 మార్చి నుంచి

2015 మార్చి నుంచి ర్యాన్‌ ఫ్యామిలీ ఆ బాలుడి వీడియోలను రికార్డు చేయడం, పోస్ట్‌ చేయడం చేస్తోంది.

బాలుడి తొలి వీడియో

బాలుడి తొలి వీడియో

లిగో బ్యాక్స్‌ తెరవడం, దానితో ఆడటం ఈ బాలుడి తొలి వీడియో. మూడేళ్ల వయసులో దీన్ని యూట్యూబ్‌లో పెట్టారు. ఇలా ర్యాన్‌ యూట్యూబ్‌ స్టార్‌గా మారిపోయాడు.

 సొంత బ్రాండ్‌ టోయస్‌నే..

సొంత బ్రాండ్‌ టోయస్‌నే..

దీంతో తన సొంత బ్రాండ్‌ టోయస్‌నే ఏకంగా మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాడు. అక్టోబర్లో తన టోయస్‌ వ్యాపారాన్ని మరింత విస్తరించనున్నట్టు ర్యాన్‌ చెబుతున్నాడు.

వాల్‌మార్ట్‌కు చెందిన 2500 అమెరికా స్టోర్లతో

వాల్‌మార్ట్‌కు చెందిన 2500 అమెరికా స్టోర్లతో

తన సొంత టోయస్‌ బ్రాండులను మార్కెట్‌లోకి తీసుకొచ్చి విక్రయించడానికి వాల్‌మార్ట్‌కు చెందిన 2500 అమెరికా స్టోర్లతో, వెబ్‌సైట్‌తో డీల్‌ కుదుర్చుకున్నాడు.ర్యాన్‌ వరల్డ్‌ వర్తకం మూడేళ్లు, ఆపై వారికి డిజైన్‌ చేస్తూ మార్కెట్‌లోకి వచ్చింది. ర్యాన్‌కు ఇష్టమైన వాటిలో పిజ్జాలు కూడా ఉన్నాయి.

యూట్యూబ్ ఛానెళ్లలో ఇది 8వ స్థానం

యూట్యూబ్ ఛానెళ్లలో ఇది 8వ స్థానం

ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం రాయల్టీ ద్వారా ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్న యూట్యూబ్ ఛానెళ్లలో ఇది 8వ స్థానంలో ఉంది.

డబ్బుల కోసం తల్లిదండ్రులు..

డబ్బుల కోసం తల్లిదండ్రులు..

అయితే డబ్బుల కోసం తల్లిదండ్రులు తమ పిల్లల చేత బలవంతంగా ఇలాంటివి చేయిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. డబ్బుల కోసం పిల్లలను తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నట్లు ప్రముఖ యూ ట్యూబర్ పేవ్‌డీపే అంటున్నారు.

అతని తల్లి మాత్రం..

అతని తల్లి మాత్రం..

అతని తల్లి మాత్రం రేయాన్‌ను ఒత్తడి చేయడం లేదు. అతని చదువుకు ఎటువంటి ఇబ్బంది కలిగించడం లేదు. సెలవు రోజునే వీడియోలను రికార్డు చేస్తున్నామని చెబుతోంది.

తల్లిదండ్రుల నుంచి మిశ్రమ స్పందన

తల్లిదండ్రుల నుంచి మిశ్రమ స్పందన

కాగా ఈ ఛానెల్‌పై తల్లిదండ్రుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఇది ఎంతో బాగుందంటే, తమ పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా ఈ పిల్లాడికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

Best Mobiles in India

English summary
A 6-year-old boy is making $11 million a year on YouTube reviewing more news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X