ఫేస్‌బుక్ ప్రైవసీ కావాలంటే డబ్బులు కట్టాల్సిందే : సీఈఓ

కేంబ్రిడ్జ్‌ అనలిటికా కుంభకోణం నేపథ్యంలో ఫేస్‌బుక్‌ తాజాగా ప్రైవసీ పాలసీపై కీలక వ్యాఖ్యలు చేసింది.

|

కేంబ్రిడ్జ్‌ అనలిటికా కుంభకోణం నేపథ్యంలో ఫేస్‌బుక్‌ తాజాగా ప్రైవసీ పాలసీపై కీలక వ్యాఖ్యలు చేసింది. 8.7 కోట్ల మంది ఫేస్‌బుక్‌ వినియోగదారుల సమాచారం దుర్వినియోగం అయిన నేపథ్యంలో ఆ సంస్థ సీవోవో షెరిల్‌ శాండ్‌బర్గ్‌ ఓ ఇంటర్వ్యూలో ప్రైవీసీ పాలసీపై స్పందించారు. NBC Newsలో వస్తున్న Today Show కార్యక్రమంలో సంస్థ సీవోవో షెరిల్‌ శాండ్‌బర్గ్‌ మాట్లాడుతూ వినియోగదారులు ప్రైవసీ కావాలనుకుంటే కొంత మొత్తం చెల్లించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ప్రకటనల కోసం తమ సమాచారాన్ని లక్ష్యంగా చేసుకోకుండా ఉండాలనే ఫేస్‌బుక్‌ వినియోగదారులు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.

Sheryl Sandberg

పూర్తిస్థాయి ప్రైవీసీ కోసం అలాంటి ఆప్షన్‌ అందుబాటులోకి వస్తే వినియోగదారులు ఛార్జీల రూపంలో కొంత మొత్తం చెల్లించాలని చెప్పారు.కాగా కేంబ్రిడ్జ్‌ అనలిటికా కుంభకోణం విషయంలో కంపెనీ సరిగ్గా వ్యవహరించలేదని ఆమె ఒప్పుకొన్నారు. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులు వినియోగించకుండా ఆప్ట్‌- అవుట్‌ బటన్‌ ఏదైనా ఉందా? అని ఆమెను అడిగితే..'చాలా రకాల ఆప్ట్‌-అవుట్‌ బటన్లు ఉన్నాయి. అయితే అన్నింటికీ ఒకే బటన్‌ అందుబాటులో లేదు. పైస్థాయిలో ఆప్ట్‌-అవుట్‌ బటన్‌ లేదు. దానికి వినియోగదారులు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది' అని ఆమె వివరించారు.

ఫేస్‌బుక్ మీ ఫోన్ డేటాను సేకరిస్తోందా..? అయితే ఇలా చేయండిఫేస్‌బుక్ మీ ఫోన్ డేటాను సేకరిస్తోందా..? అయితే ఇలా చేయండి

మరోవైపు 8.7 కోట్ల యూజర్ల డేటా దుర్వినియోగం అయిన నేపథ్యంలో.. ఎవరి సమాచారం చోరీకి గురైందో తెలుపుతూ ఫేస్‌బుక్‌ తమ వినియోగదారులకు నోటీసులు పంపించడం నేటి నుంచి ప్రారంభించింది.రస్తుతం ప్రభావితమైన యూజర్లకు ఫేస్‌బుక్‌ నోటీసులు పంపబోతోంది. దీంతో పాటు మిగతా 2.2 బిలియన్‌ యూజర్లకు కూడా '‍ప్రొటెక్టింగ్‌ యువర్‌ ఇన్‌ఫర్మేషన్‌' పేరుతో మరో నోటీసులు జారీచేయనుంది. దీంతో పాటు ఓ లింక్‌ను కూడా పంపిస్తుంది. ఆ లింక్‌లో కొన్ని యాప్‌ల వివరాలు వాటికి ఎలాంటి సమాచారం ఇవ్వాలి.. ఎలాంటి సమాచారం ఇవ్వకూడదు అనే వివరాలు ఉంటాయని తెలుస్తోంది.

డేటా లీక్ వ్యవహారంపై తాము అతిపెద్ద తప్పు చేశామని కంపెనీ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ కూడా ఒప్పుకున్నారు. ఈ విషయంపై వివరణ ఇచ్చేందుకు, భవిష్యత్తులో యూజర్ల గోప్యత విషయంలో వాగ్దానాలు చేసేందుకు అమెరికన్‌ కాంగ్రెస్‌ ముందుకు కూడా రాబోతున్నారు. ఈ సమయంలో మార్క్‌ జుకర్‌బర్గ్‌ కఠిన ప్రశ్నలనే ఎదుర్కోబోతున్నారని తెలిసింది.

Best Mobiles in India

English summary
If You Want an Ad-Free Facebook You're Going to Have to Pay for It, Says Sheryl Sandberg More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X